Wednesday, November 28, 2007

కుక్క పిల్లా సబ్బు బిళ్ళా కాదేదీ మీడియాకి అనర్హం

కుక్క పిల్లా సబ్బు బిళ్ళా కాదేదీ మీడియాకి అనర్హం

రైతుల సమస్యల కన్నా లేచిపొయిన లేవదీసుకు పోయిన వాళ్ళని సెలెబ్రిటీలను చేసే పనే వీళ్ళకి యెక్కువ..ముగ్గులోంచా,, ముగ్గులోకా అంటూ టైటిళ్ళు..

మొన్న ఒక సూమో కథ...నిన్న ఒక ఆటో కథ.....రోడ్డు పై ధర్నాకు సప్పోర్టు గంట గంట కీ రెఫోర్టు...
ప్రస్తుతం జరిగింది అర్ధం కాకపోతే వాళ్ళకి అర్థం అయిందే మనకి చెప్తారు ఒకటికి 99 సార్లు.......
వీలైతే ఆ అమ్మాయి తిరిగొస్తుందా రాదా ఎస్ ఎం ఎస్ చేయండి అంటూ ఒక సర్వే.....

అసలే పరువు పోయి పాపం బాధ పడుతుంటే...వాళ్ళింటి దగ్గర ఒక కెమేరా టీముని పెట్టి
మరింత తాజా సమాచారం కోసం చూస్తూ ఉండండి టీ వీ 99 మెరుగైన సమాజం కోసం దిగజారిన సమాచారం....

Wednesday, November 21, 2007

వస్త్ర సన్యాసం


వస్త్ర సన్యాసం




వందనా బ్రదర్స్, ఏ బి బ్రదర్స్, ఎక్స్ వై బ్రదర్స్, లాంటి బట్టల కొట్లు ఎన్ని వోపెనింగులు చేసినా...పట్టు చీరలతో యాడ్లలో నటించినా ...పాపం కొంత మంది హీరోఇన్లకు సినిమాలలో మాత్రం అవే కరువు....

మడి కట్టుకు కూర్చుంటే చాన్సులు రావని పాపం వస్త్ర సన్యాసం చేసి మరీ కొట్టేస్తున్నారు చాన్సులు.....

తెలుగమ్మాయిలా సీతమ్మ లా వుంటే లాభం లేదనుకుని బాలివూడ్ లో చాన్సు కోసం వస్త్ర సన్యాసం చేసిన మరో తెలుగింటమ్మాయి పాపం ఒక తెలుగు సినిమాలో పెద్దాయన పేరున్న చిన్నాయనగా పేరున్న పెద్ద హీరొ తో అంటే ఎగిరి గంతేసింది తీరా చూస్తే ఒక పాట లో మాత్రమే ఆ గెంతులు అది కూడా దేవతా వస్త్రాలతో అని తెలిసి చేసేది యేమీ లేక షంగు షకాల చింగు చికాల అంటూ గెంతి బాలివూడ్లో పాడ్డది ఆ పడతి...

రచ్చ గెలిచి ప్రస్తుతం ఇంటి వైపు చూస్తోంది...

ఆమె ఆ"వేద"న అర్ధం చేసుకుని త్వరలోనే ఎవరో ఒకరు వరం ఇవ్వక పోరు...వస్త్ర సన్యాసం ఫలించక పోదు.......

Monday, November 19, 2007

హస్త సాముద్రిక ఫలాలు




ప్రస్తుతం కాంగీ రేసులో ఉన్న వారికి జాతక ఫలాలు..చేయవలసిన పూజలూ ఇతరాలు

గ్రామ గ్రామాన ఇందిరమ్మ విగ్రహ ప్రతిష్ట చేయడం

రాజీవ్ బాటలెంబడి ప్రదక్షిణలు చేయడం

సోఅనియా మాతకు ప్రత్యేక పూజలు

"రాహు" ల్ జపం ఒక లక్ష ప్రతి రోజూ

చేతికి ప్రియాంక ఫొటో తో కూడిన ఉంగరం ధరించడం

పైన పేర్కొన్న విధానాలు పాటిస్తే చక్కటి ఫలితాలు కలిగి సోనియా "కరుణామయ" ధ్రుక్కుల వల్ల మంచి పొజిషన్ లభిస్తుంది..లాభిస్తుంది..

ఆంధ్ర నేతలు పై వాటితో పాటుగా ప్రతీ ఆదివారం నంబరు 10 జన్ పధ్ ఆలయ దర్శనం చేయడం వల్ల పి సి సి అధ్యక్ష్య స్థానాన్ని అన్ని గ్రహాలూ చూస్తుండడం వల్ల లగ్నాధిపతి వీరప్ప మొయిలీ కి ప్రత్యేక పూజలు చేయడం లాభించ వచ్చు

Thursday, November 15, 2007

ఒకటికి మూడు ఫ్రీ (ధారావాహికం 2 )



మాస్ మన్మధుడి తో సంతోషంగా బాసూ


' మన్మధుడిలా ' అందంగా ఉండే మరో హీరో గారి సినిమా విషాయల కొస్తే, ఈయన గారికి అమ్మాయిలంటే అసలు పడదు.. (బల్ల కింద ) ' కొంచెం ' దూరం గానే ఉంటుంటాడు . అయినా అమ్మాయిలు మాత్రం ఈ మాస్ హీరో గారి వెంట పడుతుంటారు.. ఆయన ప్రమేయం లేకుండా ' సంతోషం ' గా పాటలు పాడుకుంటారు...ఒక రోజు ఈ సారు తనకి ఆల్రేడీ పెళ్ళో ఎంగేజ్మెంటో ఐపోయిందనీ....ఆ అమ్మాయి సునామీ లోనో, యాక్సిడెంట్లోనో చచ్చిపోయిందనీ..ఆ అమ్మాయి తో పాడుకున్న రెండు మూడు పాటలతో సహా చెబుతాడు.. దాంతో మరింత జాలి పడిన ఈ అమ్మాయి గారు పిల్లలున్నా సరే ఈ ' బాసు ' వెంట పడి మరీ ప్రేమ వొలక పోస్తారు..ఇలాంటి కొత్త కధ తో డిఫరెంటుగా చేస్తుంటారు ఈయన.. .. మనం చూస్తుంటాము అంతే......

మీకు ఏవైనా రెండో మూడో సినిమాలు గుర్తొస్తే తప్పు నా(గ్) ది కాదు.......

Saturday, November 10, 2007

యాం 'ఖరులు'

మిత్రుడు క్రిష్ణ ఇచ్చిన స్ఫూర్తితో ఎఫ్ ఎం పేరుతో బాదుతూ బాధిస్తున్న యాం ఖరుల గోల.....


ఒకరి కార్యక్రామాలు వంటికి 'కారం' రాసుకునంట్టుంటాయని వాళ్ళే బాహాటంగా చెప్పుకుంటున్నారు...పైగా వేడి కబుర్లు అంటూ నోటికొచ్చిన సొల్లు చెప్పేందుకు యెల్లప్పుడూ సిద్ధం

ఇక ఒక 'పెద్ద' ఎఫ్ ఎం లో ఐతే ఆ క్రిష్ణుల వారికి ఏది తోస్తే అది తోసేస్తారు జనం మీదకి.....దీపావళి నాడు పట్టులంగాలు వేసుకున్నా రాత్రికి మాత్రం హీరోయిన్ల లా పొట్టి గౌనులేసుకుంటే బాగుంటుందిట (ఎవరికో ) అది సేఫ్టీ కోసమే అని ఒక కొసమెరుపు....వాళ్ళకి సేఫ్టీ గానీ నాయనా ఎదురుగా ఉండే అబ్బాయిల గుండెలకి మాత్రం అసలు సేఫ్టీ కాదు.......అందులోని మరో యాంఖరు ఈమధ్య ఏదొ పుస్తకం లోకెక్కడానికి రాత్రింబవళ్ళు కేక లు పెట్టి ప్రస్తుతం ఎవరైనా అమ్మాయిలు ఫోన్ చేస్తే చాలు యెలా ఉన్నావ్ యేం చేస్తున్నవ్ అంటూ అందరినీ సొంత మరదళ్ళలా చూసుకుంటాదు పాపం ఈ మధ్య ఒకామె ఫోన్ చేస్తే హాయ్ పద్మ పద్దు యెలా ఉన్నావ్ యేమి చేస్తున్నావ్ అంటే ఆమె ఖంగారుగా బాగున్న అంటూ కేక పెట్టింది..మీరు మారీడా అంటె అవునన్న ఆమెకి నెక్ష్ట్ ప్రశ్న నీకు పిల్లలా అని దానికి ఆమె అవును పెద్దబ్బయి అమెరికాలో ఎం ఎస్ చేస్తున్నాడు అమ్మాయి ఇంజినీరింగ్ ఫైనల్ అంటూ ఏకరువు పెట్టింది....కెవ్వు కేక
మరో రాజుగారైతే గురూ వారాంతం కదా సరదాగా మందు కొట్టండి కాకపోతే లిమిట్ లో ఉండండి అంటూ ఫ్రీ సలహా ఒకటి ప్రసాదిస్తారు

ఇక ఉల్లాసంగా ఉచ్చాహంగా అంటూ వత్తులు లేకుండా ఆడో మగో అర్ధం కాకుండా ఆసాంతం అరిచే యాంఖరాలు మరో ఇస్ చానెల్లొ....ఇక సితిలో ఉన్న మరో చానెల్ అది తెలుగో మరాఠివొ మరోటో అర్ధం కాదు.....మధ్యఒలో గాంధీ బందరు పోరు యెందుకు ? యెందుకంటే ఆయన పుట్టిందీ పోరు బందరు అందుకే ఆయన మూడు బందర్ (అంటే కోతిట) గురించి చెప్పారు అంటూ తమ అతి తెలివి ప్రదర్సించి ఆ తిక్క ప్రశ్నలకి చెత్త సమాధానాలిచ్చిన వాళ్ళకి అమ్ముడుపోని సీడీలో.........ఆడని సినిమాటిక్కెట్టో ఇచ్చి మరీ సత్కరిస్తారు/...అమ్మా అయ్యా మీ కార్యక్రమాలకోసం దయచేసి తెలుగు తో ఆడుకోకండి.....ఎఫ్ ఎం రేడియో జాకీల్లారా తెలుగు నేర్చుకోండి...తెలుగు బతికించండి.......

Wednesday, November 7, 2007

ఒకటికి మూడు ఫ్రీ

పండగ సీజన్ వచ్చింది కదా...మూడు కొంటే ఒకటి ఫ్రీ రోజులు పోయి ఒకటి కొంటే మూడు ఫ్రీ రోజులొచ్చాయి...తెలుగు సినిమాలు కూడా అంతే..ఒకటి కి మూడు ఫ్రీ కాన్సెప్ట్ తో వస్తున్నాయి..కావాలంటే ఈ ధారావాహిక ఫాలో అవండి..

ఫాక్షన్ సినిమాలు..




గ్రా మ సిం హం



హీరో కాశీ లోనో, కేరళ లోనో, కన్యాకుమారి లోనో అంట్లు తోముతూనో, కార్లు కడుగుతూనో, ఉంటాడు..బాగా కడుగుతున్నాడని, యెదురుగా ఉన్న ఒక హీరోయిన్ ప్రేమిస్తుంది...అడుక్కుతింటున్నా హీరో కాబట్టి అమెరికాలో పాటలు పాడుకుని...పెళ్ళి మంటపం దాకా వస్తారు....అప్పుడు 40 టాటా సూమోలు వచ్చి ఆగుతాయి మంటపం ముందు.. అందులోంచి 80 జతల మగ కాళ్ళూ, ఒక జత ఆడ కాళ్ళూ దిగుతాయి.. ఆ పెళ్ళీ ఆపి అతను హోటల్ లో క్లీనర్ కాదని, కడపలో లీడర్ అని చెప్పి అందరినీ కడప రైలు యెక్కిస్తారు..అక్కడ ఈలోపల ఈ పాప తో ఫ్లాష్ బాక్ లో పాటలు, ప్రేమలు.. అయిపోయి.....క్లైమాక్స్ లో కొత్త రకం ఆయుధం పట్టి విలన్లు అందరి పని పట్టి ....చంపడం పాపం నరకడం ఘోరం అన్న సూక్తి తో సినిమా సమాప్తమౌతుంది.....
ఇందులో హీరో గారికి విలన్ ని చంపడానికి కత్తులక్కర్లేదు..కంటి చూపు చాలు....గొడ్డళ్ళక్కర్లేదు--గోళ్ళు చాలు...ఉరి తాడు అక్కర్లేదు....మొలతాడు చాలు.....

మనకి ఆయన చంపక్కర్లేదు--సినిమా చూస్తే మనమే పోతాం....
(మీకు 3 సినిమాలు గుర్తుకు వస్తే బాధ్యత నాది కాదు....చిన్ని క్రిష్నుడిది )

ఇది ఒకటికి మూడు ఫ్రీ లో ప్రధమ భాగం...ఇంకా అనేకం ఉన్నాయి...

ప్రస్తుతానికి

ధన త్రయోదశి..నరక చతుర్దశి.....దీపావళి శుభాకాంక్షలు.....మీ ఫణి మాధవ్...,..

Tuesday, November 6, 2007

చాల్లే నోర్ముయ్


కాళ్ళు నొప్పుట్టేలాగా తిరిగి తిరిగి సంపాదించిన అధికారం ఇది....నోళ్ళు నొప్పుట్టేదాక తిడతాం పడంది.....అని ఇందిరా మానస పుత్రుడు..పంచెకట్టుతో పచ్చచొక్కా ఆయన్ని తిడుతుంటే....పేరుకు స్పీకర్ ఐనా కూచోండి తప్ప వేరే యేమీ మాట్లాడని స్పీకర్ ...ఇతర ప్రతిపక్షాలూ ముందర ఇంతటి అవమానం జరిగిందంటూ వాపోతున్న బాబూ .........లేశమాత్రం గూడా యేమీ జరగలేదు... అంతా ఉట్టిదే అంటున్న పెద్దాయన రోశయ్య మాటల గారడీ చూసి పాపం అసెంబ్లీ ముందున్న గాంధీ యెందుకు నాయనా నన్నిక్కడ కూచోపెట్టారు అని బాధ పడుతున్నట్టుంది.....పైగా ఆయన ముందు మన వాళ్ళు మౌన వ్రతం.....

Monday, November 5, 2007

"ఆటో" గ్రాఫ్ డిజిటల్ మెమొరీస్



హైదరాబాడ్ ఆటో వాళ్ళతో ఇబ్బంది పడని వాళ్ళెవరూ లేరేమో.. ఆటో అటొస్తావా అంటే ఇటు వెళ్తాననే ఆటో సుల్తానులే యెక్కువ.... మీటరు మీద యెక్కువ అడగని వాడు పాపాత్ముడు.. లీటరు పెట్రోలు రేటు పెరిగింది అని ..డాలరు రేటు పడిపోయిందని ....కారణం యేదైనా దారుణం గా రేట్లు పెంచే ఆటోమేటిక్ జీవులు.... .... ప్రస్తుతం డిజిటల్ మీటర్లు పెట్తుకోమంటే పెట్టుకోమంటున్నారు...అది వారి జీవితంలోని చాలా నంబర్లు తారుమారు చేస్తుందట....ఖర్చు కూడా భరించలేమంటున్నారు పాపం పేద ఆటోవాలాలు....ఇన్నాళ్ళూ మిమ్మల్ని మేము భరించలేదు..హాఫ్ రిటన్లు.....మీటర్ మీద ఎగస్ట్రాలు.. .ఇప్పుడు మీ దాకా వచ్చాక తెలిసినట్టుంది.........ఆర్టీసీ ని నమ్మలేని వాళ్లు ..ముఖ్యంగా ముసలి వాళ్ళూ ...ఆడ పిల్లలు....చిన్న పిల్లలూ అధార పడేది ఆటోల మీదే జాలీ నాలీ లేకుండా ఆడుకున్న అన్నలారా డిజిటల్ మాటర్ త్వరగా తేల్చి.......,మీటర్ ఉన్న మీ ఇమేజ్ ని కిలో మీటర్ పెంచుకోండి.....ఆటోమాటిచ్ గా హీరోలైపోండి ...........

Saturday, November 3, 2007

జీతాల రోజు




నెల రోజుల పని తనానికి గుర్తుగా సంబరంగా అందుకునే రోజు ....కాక పోతే ఆ రోజు మాత్రమే మన దగ్గర ఉండే ఆ డబ్బు మర్నాటెకే మరొకరికి ఇచ్చేయాలని గురుతుకు రాక ఇలానే ఆనందిస్తాం

ఒకటో తారీఖుకే జీతం మొత్తం అప్పులోడి సొంతం
పప్పు ఊప్పు పాలవాడి ఖాతా అంటూ ఇల్లాలి రాద్ధాంతం


నిండా మునిగాక చలేంటి అని మన సిద్ధాంతం

చలో విలువల్లేని వలువ్వల్లో వళ్ళు దాచుకుని మళ్ళీ అప్పు కి సిద్ధం

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Best CD Rates