Sunday, June 29, 2008

'దిష్టి '

డివైడ్ అండ్ రూల్ ....ఇది బ్రిటీష్ వారి పాలనా పద్ధతి.... అప్పట్లో భారత ప్రజలనందరినీ ఒక్కటి కానీయకూడదని ప్రాంతాల వారీగా విభజించి పాలించడానికి ప్రయత్నించింది బ్రిటీష్ ప్రభుత్వం...

ఇక్కడా అంతే ప్రభుత్వ పాలనకు 'సాక్షీ' భూతం గా నిలవడానికి వెలసినదానికి దన్నుగా నిలవడానికి అన్నట్ట్లు ఈనాడు వార్తలు వ్రాసే వారి పై కక్ష కట్టి దుమ్మెత్తి పోయడమే కాకుండా సీరియల్సు కూడా తీసే దురద్రుష్టకర సంఘటనలు జరుగుతున్నాయి......ఒకటికి పదిసార్లు ఆలోచించి కానీ ప్రచురణలోకి వెళ్ళవు కాబట్టి ప్రజలు ఇంకా ఈనాడు కూడా పత్రికలు చదువుతున్నారు......ఒకటికి పదిసార్లు చూపించే టీ వీ లకన్నా అవి బెటరు అని ప్రజల నమ్మకం.

మొన్న ప్రముఖ హాస్య నటుడు ఆస్పత్రిలో జేరితే, పోయాడు అని చూపించారు..కాసేపు అయ్యాక పరిస్థితి విషమం అని రాశారు....రెండ్రోజుల తర్వాత ఆయన పోయాడు....సంతాపం లో కూడా కవిత్వం వెలగబోయడానికి మళ్ళీ రాని లోకానికి మల్లి, బట్టల సత్తికి మా నివాళి..అంటూ హాస్య కళాకారుడి కి సంతాపం చూపించిన వీడియో మాధ్యమాలు ....గంటకోసారి టీ ఆర్ పీ లు పెంచుకోవడానికి చిరంజీవి పార్టీ పెట్టేసరహో అని వూదరగొట్టే తప్పుడు న్యూసులిచ్చే చానళ్ళ కన్నా పత్రికలు చాల బెటరు....

అందుకేనేమో పత్రికలకి 'దిష్టి ' తగిలి ప్రాబ్లంస్ వస్తున్నాయి..

Friday, June 27, 2008

వన్ వే



సినిమాల నుంచి పాలిటిక్స్ అంటే హై వే లో ప్రయాణం కాదు....'రాజకీయం' - వన్ వే లాంటిది..ముందుకే తప్ప వెనక్కి వెళ్ళడం అనేది ఉండదు . అది సైకిలైనా, కారైనా, రైలైనా , ఒకటే రూలు ...

ఎన్నికల సందర్భంగా 'చిరు' గాలులు వీస్తున్న ఈ రోజుల్లో=== అందరూ ఆలోచించుకోవాల్సిన విషయం ఇది.. ముందు వెళుతున్న వాళ్ళని ఓవర్ టేక్ చేసుకుంటూ వెళ్ళాలి...మధ్యలో అలకల స్పీడ్ బ్రేకర్లు...ఫిరాయింపుల పంచర్లు రకరకాల అడ్డంకులు...వస్తుంటాయి...వాళ్ళు వెళ్ళడానికి మనల్ని తోసెయ్యడానికి కూడా వెనకాడని రాష్ డ్రైవర్లు కూడా ఉంటారు..ఈ రోడ్డులో ...రాజకీయ రాక్షస డ్రైవర్లు అనొచ్చేమో....

రిజిస్ట్రషన్ కొంచెం ఈజీనే ఎందుకంటే మనకిష్టమైనది కొంచెం కాస్ట్లీ ఐనా కూడా దొరుకుతుంది...పూజ చేయించి రోడ్డు మీదకి రావాలంటే మాత్రం కొన్ని కంపల్సరి...

ఇక్కడ లైసెన్సు (lie-sense)అంటే అబద్దం చెప్పగల సెన్సు వుండాలి అదీ ప్రజలతో...సాధారణంగా ఎన్నికలప్పుడు,,,అసాధారణంగా వచ్చే బై ఎలక్షన్లప్పుడు....అసెంబ్లీలోనూ...ఎక్కడైనా..ఎప్పుడైనా,,,అలవోకగా లై అంటే అబద్ధం చెప్పగలిగే సెన్సు ఉండాలి....అప్పుడు హాయిగా ఏబండైనా నడపొచ్చు..అంటే ఏ పార్టీలోనైనా...రాష్ట్రంలో నైనా ...కేంద్రంలోనైనా ఓ కే

కులాలు, మతాలు, గ్రూపులు..లాంటి కాలుష్యం ఎప్పుడూ చెక్ చేసుకుంటూ అన్నీ సరైన పాళ్ళలో వున్నాయా లేదా చూసుకుంటుండాలి
పార్టీ రధం కదలాలంటే దానికి పెట్రోలు చాలా అవసరం...అది కొత్త బండి ఐతే ఎక్కువ తాగుతుంది....బండి పాతదైన కొద్దీ మైలేజిలో ..పికప్పులో కొంచెం తేడా వస్తుంది.....

లంచాలడిగే కానిస్టేబుళ్ళలా కాంట్రాక్టులడిగే జనాలు...ఆఫీసర్లు....చాలామందినే ఖుష్ చెయ్యాలి...పిడివాదాలు, విడి వాదాలు లాంటి టోల్ గేట్లు..దాటాలి...

మనమొక్కళ్ళమే కాదు
మన వెంట వచ్చే బళ్ళు కూడా మనతో సమానంగా రాగలిగితేనే ఈ రిలే రేసులాంటి సవాలు గెలవగలిగేది...

Saturday, June 21, 2008

ఆగస్టులో 'అధినాయకుడు ' చిరు కొత్త సినిమా



అధినాయకుడు









చిరు చిరు రైలు వతోంది వచ్చేదాక ఆగండి ఆగినాక ఎక్కండి ఎసెంబ్లీ దగ్గర దిగండి...జో జో వోటరూ ఏడవకూ ,,కొత్త సీ ఎం చూపిస్తా......చక్కని సినిమా చూపిస్తా
ఇది ప్రస్తుతం ఆంధ్ర ప్రజానీకం పాడుకుంటున్న కొత్త పాట....
ప్లాట్ఫాం మీదున్నాం రైలు కోసం ఎదురు చూస్తున్నాం అని ఒకరు
సామాన్య మానవుదికి జల్సా చేసే హక్కు లేదా ? అందుకే కామన్ మాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అంటూ ఒకరు...
అన్నయ్య ఆగస్టు లో మాట్లాడతారు అని ఒకరు...
మన తర్వాతి సినిమా ఏంటొ తర్వాత మాట్లాడదాం ప్రస్తుతం యువతరానికి స్వాగతం చెబుదాం అంటూ అసలు నాయకుడు.....
ఇలా ఒక దాని వెంట ఒకటి గ్రీన్ సిగ్నల్ ఇస్తునే ఉన్నారు... ఒక పక్క ఎక్కడో ట్రైనింగు సెక్షనులు కూడా నడుస్తున్నాయని సమాచారం.....
కానీ నాకో డౌటు....అసెంబ్లీ కి వెళ్తాను అపోసిషనులో కూర్చోను...పార్లమెంటుకెళతాను....పదిమందితో వెళ్ళలెను అక్కడ ఆ సిమ్హాసనం ఆ ఇంద్రుడిది ఇక్కడ ఈ సిమ్హాసనం ఈ ఇంద్రసేనుడిది అనుకుంటున్న మన అన్నయ్య కి అభిమానులు ఎలా సహాయ పడతారో అర్ధం కావట్లేదు...
రాజసేఖర్ ని చేస్ చేసిన రోజున తప్పు మావాళ్ళ వైపు ఉంది కాబట్టి తల వంచుకు పోతున్నా అని చెప్పాల్సి వచ్చింది.. ఇప్పుడు కూడా అభిమానుల అత్యుత్సాహం వల్ల ఈ సినిమా ఫ్లాప్ అయితే .....మరో సినిమా రిలేస్ కి ఐదేళ్ళ దాకా టైము పడుతుంది అన్న విషయం అన్న తమ్ముళ్ళు గుర్తించారో లేదో తెలీదు...
అందరివాడుగా ఏదో చేద్దామనుకునే మంచి మనసున్న మనిషి ని అప్పుడే రాజకీయ కురు వ్రుద్ధులు అంత సీను లేదు,,,ఒక్క కులానికే పరిమితం....అంటూ తమ టలెంట్ చూపిస్తున్నారు....
కంటి చూపునిచ్చే చల్లని ఐడియాని కూడా చిన్న చూపు చూసే ఈ రాజకీయాలు,,,, రక్త దాహాన్నే తప్ప రక్త దానాన్ని ఎరుగని ఈ నాయకుల కుటిల తత్వాలూ సినిమా బయట ఎంతవరకు సరిపడతాయో మన మేస్త్రీ కి.....
అప్పట్లో రాజకీయాలు ఇంత దరిద్రంగా లేవు....ప్రజలు దరిద్రం అనుభవిస్తూ ఎప్పటిలాగానే ఉన్నా రాజకీయాలు మాత్రం దరిద్ర రేఖనుంచి చాలా దిగజారిపోయాయి...
తెలంగాణా కావాలి అని వద్దని రభస చేసేవాళ్ళు, అధికారం ఉన్నదే సొంత వాళ్ళ కోసం అనుకునే వాళ్ళు .. అధికారం కోసం సొంతవాళ్ళు పరాయి వాళ్ళు అనిలేని వాళ్ళు,,,సొంతం కోసం జనాన్ని వేరు చేసే వాళ్ళూ ఇలాంటి లక్షణాలు మరి మనకి సరిపడతాయో లేదో....
కులాల వారీగా, ప్రాంతాల వారీగా, పార్టీల వారీగా, కుటుంబాల వారీగా,, పంచుకునే రాజకీయ రాబందుల మధ్యలోకి రాబోతున్న కొత్త కపోతం..........శాంతి ని ప్రసరింప చేయాలని కోరుకోవడం తప్ప మరో ఆలోచనేమీ లేదు... ఒక్క సారి రావాలంటే వంద సార్లు ఆలోచించాలి....
రా అంటే రాక్షసత్వం తోజ అంటే జనానికి కీ అంటే కీడు కలిగించేయం అంటే యంత్రాంగమే రాజకీయమంటే అని యెప్పుడో పరుచూరి వారన్నారు...మరి

Wednesday, June 18, 2008

దశాపచారం

ద్రుశ్యావతారం అనాలో మరేమనాలో అర్ధం కాలే... ఆ సినిమాని గొప్ప విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నటుడు కమల్ హసన్ పాపం మొదలు పెట్టినప్పుడు అనుకున్నది తెరమీదకి రాలేదోమో అనిపించింది.. బామ్మ గా భామనే సత్యభామనే లో వేసిన ఆ వేషమే బాగుంది అనుకుంటా ఏమిటో చపాతి పిండి పులిమినట్ట్లు ఆ మేకప్పు పై కప్పు కి సున్నం వేసినట్టు... అన్ని పిండి ముద్దలే ..భారతీయుడిలోనె కొంచెం అసహజం గా ఉంది అనుకుంటే ఇప్పుడు పదిరెట్లు ఎక్కువ....అయింది...

హాలివుడ్డు కళాకారులు లేని రోజుల్లోనే శివాజి గణేశన్, నాగేశ్వర రావు, సంజీవ్ కపూర్ లాంటి వాళ్లు తొమ్మిది రకాలుగా వేశారు..

మొన్నామధ్య మల్లీస్వరి సినిమాలో వెంకటేష్ ఒక పాటలో రక రకాలుగా కనిపించాడు.. అసలు కమల్ ఇంతకు మునుపు వేసిన అప్పు, మైకేల్ మదన కామరాజు, సత్యమే సివం, భమ రుక్మిణి. అమావాస్య చంద్రుడు స్వాతిముత్యం లాంటి 10 వేషాలు వేసినా బాగుండేది...


ఏంటొ శివాజి లో డైలాగు గుర్తొస్తోంది,, నాన్న గుంపుగా రావడం కాదు

Tuesday, June 10, 2008

"A" వార్డు సినిమాలు..

"A" వార్డు సినిమాలు..

సినిమాలు రెండు రకాలు...ఎవార్డు సినిమాలూ...... " A " వార్డు సినిమాలు...
"A" వార్డు సినిమాలు..
ఇంట్లోంచి పరుగు పెట్టి లేచిపోవు విధానాలు...ఆవస్యకత, సాధ్య అసాధ్యాలు..కష్టాలు-నష్టాలు..వంటివి
ఇంటినుంచి పారిపోయి 12 ఏళ్ళ తరువాత వచ్చి తండ్రిని చూసి కూడా తన చిట్టిప్రియురాలు గురించి అడిగి వెళ్ళిపోయి స్మగ్లింగ్ కేసులో జైలుకెళ్ళి అక్కడ నుంచి తప్పించుకుని టీ వీ లో కనిపించినా కూడా హాయిగా తిరిగి తను చంపాలనుకున్న వాడి ఇంట్లోనే తిరిగే బుజ్జి ప్రేమ కధలు....అన్నల్లో కలిసిపోయిన తమ్ముడు జల్సా గా తిరుగుతూ సరసాలాడే సినిమాలు
భక్తిరసంగా ఉండాల్సిన చిత్రంలో టబ్బులో బత్తాయి రసం కురిపించే పండురంగడు వంటి చిత్ర రాజాలు..
ఇలా చెప్పుకుంటూ పోతే 'ఆ రేంజ్ సినిమాలు.. ధియేటర్ల నిండా ఉన్నాయి...ఏ సి ఉన్నా లేకున్నా ఫాన్స్ మాత్రం ఫుల్లు.
ఇక ఎవార్డు సినిమాలు:
పాపం అమాయకులు తీసే ఈ సినిమాలు ఆడవు..కనీసం ఎవార్డులు కూడా రావు.. నంది రాలేదని కుంలి పోయిన ఆయనకి జాతీయ ఎవార్డు వస్తుంది..పోన్లే సార్ మనవాళ్ళకి హిందీ నాయకులు...తమిళ దర్శకులు..ముంబాయి సంగీత దర్శకులు చేశేవి తప్ప మన తెలుగు సినిమాలు అర్ధం కావేమో.. అందుకే జాతీయ స్థాయిలో అయినా వస్తున్నాయి కనీసం కొన్నాళ్ళ కైనా మారుతారేమో అని హోప్ ......

Wednesday, June 4, 2008

కారు పంక్చర్

ఎన్నికల జోరు ఐపోయింది....మళ్ళి మామూలు రాజకీయాలు...వోడిపోయినోళ్ళందరూ గెలిచినోళ్ళ మోసం వల్లే ఇదంతా అని రచ్చ...గెలిచేదాక ఇది రిఫరెండం కాదు.. అని ఇప్పుడు రిఫరెండమే అంటూ మాట మార్పు... ప్రజలు మా వైపే ఉన్నారంటూ బిల్డప్పు....

నైతిక భాద్యత అంటూ రాజీనామాలు....బతిమలాటలు..మళ్ళీ మామూలే,,,,,,ఎక్కడో రైలు పడిపోతె రాజీనామ చేసారట లాల్ బహదూర్ శాస్త్రి...మరి ఈ నాటి నాయకులు?

అసలే హడావిడిగా ఉంటే మధ్యలో రైలు వస్తోంది అంటూ కొత్త నినాదం....

కారు పంక్చర్ ఐ మెల్లగా వస్తుంటే సైకిల్ జోరు పెరిగింది..చెయ్యి మామూలే...ఇందిరమ్మ దయవల్ల గెలిచి ఆనందంగానే ఉంది....మధ్యలో సత్తా పరీక్షించుకోవడానికి బరిలోకి దిగిన ఆయన మాత్రం నారాయణ మంచి ప్రభుత్వం మంచి నాయకులు అంటూ అమాయకంగా ప్రచారం చేసినందుకు ఏమి జరుగుతుందో చూసి ఇప్పటికైనా రాజకీయాలు తెలుసుకుంటాడేమో ?

ఇక కమలం ? ఏం అనాలోకూడా అర్ధం కావట్లేదు...

రైలెప్పుడొస్తుందో ఏమొ ?


Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Best CD Rates