Sunday, September 28, 2008

ఇం 'ప్రెస్ మీట్ '

ఇం 'ప్రెస్ మీట్ '

అక్కడ బాగా హడావిడిగా ఉంది...షామియానాలు, కుర్చ్చీలు, మైకులు, ఒకటే హడావిడి..ఇంతకీ విషయం ఏమిటంటే అక్కడ ప్రెస్ మీట్ జరగబోతోంది..ఒక సినిమా తాలూకు విశేషాలు చెప్పడానికి...
సినిమా అద్భుతంగా వచ్చింది..ఇంత వరకూ తెలుగు తెర మీద ఇలాంటి సినిమా రాలేదు (తాను చూసి ఇన్ స్పైర్ ఐన కాపీ కొట్టిన ఇంగ్లీషు సినిమా తలుచుకుంటూ, దాని వసూళ్ళు లెక్కలు కడుతూ ) దర్శకుడు..తొలి పలుకులు...
మ్యూసిక్ చాలా బాగా వచ్చింది హీరో (లావుగా బొజ్జతో కదలలేని)బాడీ లాంగ్వేజ్ ద్రుష్టిలో పెట్టుకుని చేసా...గ్యారంటీగా సూపెర్ హిట్ అవుతుంది..(తాను డైరెక్టుగా దౌన్ లోడ్ చేసిన ఇంగ్లీష్ ఆల్బం మీద నమ్మకంతో) మ్యూసిక్ డైరెక్టరు



దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిల్మ్ చాలా హాపీ గా ఉంది..మంచి (ఎక్ష్పోజింగ్ కి) స్కోప్ ఉన్న సినిమా...హీరో సార్, డైరెక్టర్ సార్, ప్రొద్యూసర్ సార్ చాలా 'కోపరేట్" చేస్తున్నారు...(సబ్బు కంపేనీ ఆద్ నుంచి దిగుమతి ఐన బొంబాయ్ భామ)..
సినిమా అనుకున్న దాని కన్నా బాగా వచ్చింది (అంత చండాలంగా తీద్దామని అనుకోడం ఎందుకు ? బాగా వచ్చిందండం ఎందుకు ?) బాగా రిచ్ గా తీసాం (తప్పలేదు మరి). 100 ప్రింట్లతో రిలీజ్ చేస్తున్నాం. (కనీసం ఒక్క రోజు ఆడినా 100 రోజుల ఫంక్షన్ చేసుకోవచ్చు). గ్యారంటీగా సూపర్ హిట్ అవుతుంది. హీరో గారు బాగా "కోప"రేట్ చేసారు...(నెక్లెస్ రోడ్లో తీయాల్సిన హీరో నడిచే సీను న్యూజిలాండ్లో చేయించిన సీను గుర్తు చేసుకుంటూ) ప్రొడ్యూసరు..
ఇలా ఒకరిని ఒకరు పొగుడుకుంటూ రిలీజ్ డేటు అనౌన్స్ చేసారు...
సినిమా రిలీజ్ అయింది...ధియేటర్ దగ్గర..
కెవ్వు కేక..మా హీరో సినిమా సూపెర్ హిట్టు,,ఆయన మీద వొట్టు..రికార్డులన్నీ తిరగరాస్తుంది..హండ్రెడ్ డేస్ ఆడేస్తుంది..(ముందు రోజు నుంచీ తిండీ తిప్పలు లేకుండా కటౌట్లు కట్టి, దండలేసి,,సినిమా హాలుకి రంగులేసి, చొక్కా చిరిగినా టికెట్టు సంపాదించేసి,,పాటలకి ఈల వేసి, ఫైట్లకి కాగితాలెగరేసి ..సినిమా చూసి మెంటలెక్కేసి) అభిమాని ఉవాచ.... కట్ చేస్తీ..సినిమా రెండో రోజే గల్లంతు కానీ మళ్ళీ మనవాళ్ళు సక్సెస్ మీట్ అంటూ తయారు...ఏం చేస్తాం తప్పదు మరి,,,,

Saturday, September 20, 2008

..సిక్స్ పాకు హీరోలూ, సెక్సీ హీరోయిన్లు

..సిక్స్ పాకు హీరోలూ, సెక్సీ హీరోయిన్లు ....
తెలుగు సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే...'కొత్త ' ఐడియా లతో వస్తున్న 'చిత్రాలని ' చూడాలంటే భయమేస్తోంది..సినిమాకి ఐతే వెళ్ళడం తప్పించుకోవచ్చు, కానీ,,ట్రైలర్ల పేరుతో ఇంట్లో టీవీల్లోవి ఏం చేద్దాం.
ఇదివరకు పండంటి సంసారం, పచ్చని కాపురం, నిండు గౌరవం లాంటి సినిమాలొచ్చాయి, తరవాత సంసారాలు పోయి, రాక్షసుడు, యమకింకరుడు, కిరతకుడులాంటి సినిమాలొచ్చాయి, తరువాత..నువ్వు నాకు నచ్చావ్, ప్రేమించుకుందామ్రా, కలిసుందామ్రా, ఇంకేదో చేద్దామ్రా లాంటి సినిమాలొచ్చాయి, ఇప్పుడు తిట్ల ట్రెండు అనుకుంటా...ఈడియట్, కంత్రి, పోకిరి, బలాదూర్,దేశ(హ)ముదురు, ఇలా తిట్ల సినిమాలొస్తున్నాయి..సెంటిమెంటు కూడా వర్కౌట్ అవుతోంది...ఎంత పెద్ద తిట్టో అంత పెద్ద హిట్టు....
ఇక ప్రస్తుత జెనెరషన్ బాడీలది..అవును మొహం తో నటించలేం కాబట్టి బాడీ లాంగ్వేజు అంటున్నారు..ఇది ఏమి లాంగ్వేజ్ప మరి, మనమెక్కడ నేర్చుకోవాలో..సిక్స్ పాకు హీరోలూ, సెక్సీ హీరోయిన్లు (హెరాయిన్ అనాలేమో?)...బలిసిన శరీరాల్ని...సుష్కింపచేసి..కండలు పెంచి..చొక్కాలు చించి.....గడ్డలు పెంచి...నీరసించి...కనిపిస్తున్న హీరోలు...ఆ సమయాన్ని కాస్త నటననేర్చుకోవడానికి....కాస్త మంచి సబ్జెక్టుల్ని వెతుక్కోవడానికి ఉపయోగిస్తే బాగుంటుందేమో..ఒక డైరెక్టరు ఒకహిట్టు ఇవ్వగానే వెంటనే ఆయనతో ఒక సినిమా అనేసుకోవడం.హడావిడిగా మొదలెట్టడం..ఒక హీరోయిన్ హిట్టవగానే ఆమెతోనే సినిమాలు చెయ్యడం..వాళ్ళకి విసుగొచ్చి బాంబేనో, చెన్నయ్యో, కేరళో పారిపోతే..సినిమా ఆపి కోటి పైగా ఇచ్చి ఆ పర భాషాకాంత ని తెచ్చి చెయ్యడం ఫాషన్ అయిపోయింది...జాతీయ అవార్డు అందుకున్న నటి చేస్తున్న చిత్రం అంటూ వచ్చిన ఒక సినిమాలో (అవార్డు వచ్చిన సినిమా కాదు) ఆమె కు నటించాల్సిన అవసరం లేని పాత్ర..ఒకట్రెండు పాటలు..ప్రేమ, ఇతరత్రా విషయాలు//మీకు జాతీయ అవార్డు వచ్చింది కదా మీకెలాంటి పాత్రలు ఇష్టం అంటే అన్నీ అలాంటి పవిత్రమైన పాత్రలు పరుత్తివీరన్ పాత్రలే వస్తున్నాయి...నాకు బబ్లీగా ఉండే పత్రలిష్టం ఎక్ష్పోసింగు అవసరమైనంత మేరకు చేస్తాను (ఎవరికి అవసరమైనంత వరకో మరి ??) అంటూ ప్రియంగా చెప్పింది ఒక భామా మణి.....
ఇంకా నేను తూనీగ పిల్లనే అనుకుంటున్నారు నేను "పెద్ద" దాన్నాయాను..గుర్తించండి..కావాలంటే ఎక్ష్పోసింగ్ చేస్తా(అప్పటికైనా గుర్తిస్తారనేమో) అని ఈనాడు ఒక బాల వర్ధమాన యువ నటి సెలవిచ్చింది///నేను మాటలు చెప్పను అంతా చేతలే అంటూ 'నయనా' నికి ఆనందం కలిగించే 'తార ', ఇటీవల 'విసాలా హ్రుదయం కల ఒక హీరోకి పోటీగా తన 'కండలని-గుండెలని ' ప్రదర్శించింది....ఆమె స్ఫూర్తికి "సెల్యూట్ " . యోగాభ్యాసం నుంచి హీరోయిన్ యోగం పట్టిన మరో చిన్నది కూడా వీలైనంత చిన్న దుస్తులే వేసుకుంటూ ఇటీవల పెంచిన తన పారితోషికానికి న్యాయం చేస్తూ..కనీసం కాస్ట్యూంస్ విషయంలోనైనా నిర్మాత కి నాలుగు డబ్బులు మిగులుస్తోంది....
ఇక రాబోయే సినిమాల్లో ఎలా వుంటారో..ఏమో? ఈ మదయ ఒక జోక్ చదివా ఆ సినిమాలో నగ్నంగా ఎలా నటించారు అని ఒక విలేఖరి హీరోయిన్ ని అడిగితే..ఏం చెయ్యను హీరో అలా కల గన్నాడు మరి అంటూ అమాయకంగా జవాబిచ్చిందిట..కధ డిమాండ్ చేసింది కాబట్టి ఏమైనా చెయ్యొచ్చు..కానీ నాకు అర్ధంకాని విషయం ఒకటుంది...కధకి మాటలొచ్చా అని..రైటర్ అనుకున్నది తెర మీదకి వస్తుందా అని..మధ్యలో ప్రొడ్యూసరు, డైరెక్టరు, హీరో ఇలా తలా ఒక చెయ్యి వేస్తారుకదా....హీరోయిన్ మీద కాదండీ కధ మీద...
ఇక రాబోయే సినిమాల టైటిల్సు ఇలా వుంటాయేమో?
వె ధ వ - వెయ్యేళ్ళు ధనముతో వర్ధిల్లు
శ్రీ రాముడు - ఈయనకి ఇద్దరు పెళ్ళాలు/ ఇద్దరు పెళ్ళాల ముదుల మొగుడు
లేచిపోదాం రా...కట్నాలు మిగులుద్దాం, కళ్యానం చేసుకుందాం
సిక్స్ పాక్ వీరుడు- సెక్సీ లుక్ చిన్నది

Wednesday, September 17, 2008

హోమం లో మిడతలం మనం

హోమం లో మిడతలం మనం


ప్రేక్షకుల్ని సమిధల్ని చేసి, నిర్మాత పైసల్ని ఆజ్యంగా పోసి తీసిన ఒక సినిమా ఇటీవల వచ్చింది...ఫైటింగు, టేకింగు మాత్రమే కాదు మాత్రు దేవత అదే అమ్మ సెంటిమెంటు కూడా వుంది అంటూ ఆడ ఫాలోయింగు ఉన్న హీరోగారు ..అవును అమ్మ మీద వొట్టు చాలా కష్టపడి తీసాను అంటూ డైరెక్టర్ కం హీరో కం విలన్ గారు నొక్కి వక్కాణించారు, నిజమే నీ అక్క పిసికి చంపుతా అంటూ ఓ స్త్రీ మూర్తి పాడే సాంగు లో కూడా వుంది అక్క సెంటిమెంటు గురించి మర్చిపోయినట్టున్నారు వాళ్ళు, మంచి మహిళా చిత్రం అంటున్నారు..


చాలా కాలం క్రితం ' కత్తుల రత్తయ్య ' అనే సినిమా వచ్చింది..ఎస్ వీ ఆర్ ఖూనీలు చేసే రౌడీ అయితే, సీ. ఐ. డీ. బాలయ్య పట్టుకోవడానికి ట్రై చేస్తుంటాడు...తీరా చూస్తే బాలయ్య డాన్, ఎస్ వీ ఆర్ పోలీస్ అని తెలుస్తుంది..అలానే ప్రభాకర్ రెడ్డి పోలీస్ గా చెలామణి అయి క్రిష్ణ ని డాన్ గా చూపించే బాండ్ సినిమాలు వాచ్చాయి..

చాలా కాలం తరువాత నైజాం దాదాలని, రాయలసీమ రుస్తుం లని, గూండాలని, చితకతన్ని 'స్టేట్ రౌడీ' గా అవతరించింది పోలీసు ఇన్స్పెక్టర్ అని మెగా మూవీ కూడా వచ్చింది....ఆ తర్వాత 'పోకిరి'లా కనిపిస్తూ , కనిపించిన వాడినల్లా తంతూ, డాన్ లని వణికించే పండుగాడు వాళ్ళతోనే వుంటూ వాళ్లకి గుండెనొప్పి తెప్పించి 75 ఏళ్ళ సినీ రికార్డులు తిరగరాసింది క్రిష్ణమనోహర్ ఐ పీ ఎస్ అని ఒకటి, అదే 'ఖతర్నాక్' ఐడియాతో ఒక ఇడియట్ లాంటి వాణ్ణి చదివించి పోలీసుల్లో చేర్చి మరో డైరెక్టరూ చేసింది ...ఇప్పుడు మళ్ళీ అదే కొత్త పాయింటు చుట్టు కధ అల్లి హోమం ఎందుకు చేస్తారో అర్ధం కావట్లేదు...
కొసమెరుపు : మమైత్ లేని బాధ మమ(మై)త మోహన్ దాస్ తీర్చింది, ఇక ఐటం సాంగు కు సాక్షి ఎక్స్ట్రా...

Saturday, September 13, 2008

ఎందరో బ్లాగానుభావులు అందరకీ 'వంద' నములు...



ఎందరో బ్లాగానుభావులు అందరకీ 'వంద' నములు...

తొంబైతొమ్మిదో రన్ దగ్గర బాట్స్ మెన్ లా నా వందవ పోస్టు దగ్గర నేనూ చాలా టైము తీసుకున్నా..అసలు నేనేనా 100 వ్రాసింది ? అని డౌటు కూడా వస్తోంది..అఫ్ కోర్స్ అందులో కొన్ని పండగ శుభాకాంక్షల్లాంటి ఎక్స్ ట్రా రన్నులు కూడా ఉన్నా అవీ ఈ ఖాతాలోకి చేరి వంద పూర్తి అయ్యాయి..
నా బ్లాగోగులు చూస్తున్న వారందరికీ పేర్లు తెలీక పోయినా క్రుతగ్న్యతలు.. బాగున్నాయంటూ ప్రోత్సహించిన వారికి, ప్రతిస్పందించక పోయినా చూసినవ్వుకున్న వారికీ, నచ్చక పోయినా చెప్పని వారికి, ఎందరో బ్లాగానుభావులు అందరకీ వందనములు...
అసలు బ్లాగంటే తెలీదు, కనీసం ఈమైలు కూడా తెరవడం కాదుకదా...క్రియేట్ చేసుకోవడం కూడా రాని నేను..బ్లాగడం అంటే ఈనాడు చలవే,,నాలో ఏవో కదిలే కొన్ని విషయాలు..ఎవరికి పంపినా ప్రచురుణ కావట్లేదు..ఎలా అనుకుంటుంటే ఈనాడులో బ్లాగుల గురించి చదివా...మా ఆఫీసులో ఒకాయన ఆయనా ఫణే..ఆయన బ్లాగులు..విధములు, విధి విధానాలు., ఖాత తెరుచుట, కథలు వ్రాయుట, మొదలైన విషయాల గురించి బ్లాగ్న్యానోదయం కావించారు..
అలా మొదలైన నా ఫన్ కౌంటరు.లో ఎన్నో విషయాలు చర్చించాను....నచ్చితే నలుగురికి చెప్పమన్నాను, నచ్చకపోతే నాకు చెప్పమన్నా..కూడలి, తేనెగూడు, జల్లెడ లాంటి వారు దత్తత తీసుకుని మాలాంటి పిల్లబ్లాగుల్ని పోషిస్తున్నందుకు, పిత్రువాత్సల్యం చూపిస్తున్నందుకు, వారికి, పుట్టుకనిచ్చినందుకు..గూగుల్ తల్లికి, చదివరులకు, బ్లాగుమిత్రులకు, అందరికీ ధన్యవాదాలు....మీ ఆశీర్వాదం ఉంటే ధన్యుణ్ణి....
ఏమిటోయ్ వీడి గోల అనుకోకండి మొదటి సారి వందమార్కులు తెచ్చుకున్న స్కూలు పిల్లాడిలా, వంద రన్నులు చేసిన క్రికెట్ ఆటగాడిలా, వంద బంగారుపతకాలు సాధించిన వాడిలా, వందరోజులు ఆడిన సినిమా నిర్మాతలా, వంద రాంకు వచ్చిన ఎంసెట్ విద్యార్ధిలా, ఇలా వంద ఉపమానాలు రాయాలని వుంది కానీ మాటలు రాద్దామంటే మీటలు నొక్క బడట్లేదు.,,.

Wednesday, September 3, 2008

గన్ పతి - 2



పరమ శివుడు ఇచ్చిన గన్ను..పార్వతీ దేవి ఇచ్చిన దన్ను కొండంత అండగా....తన వాహనమైన మూషికం మీద భూలోకం బయలుదేరాడు వినాయకుడు...



మూషికా ..ఇంకా భూలోక విషయాలు ఏమిటి?



ఏమి చెప్పమందువు స్వామీ...పూర్వం ప్రతి ఇంట కొలువై..బియ్యం పప్పులు,,ఏవి దొరికితే అవి తిని హాయిగా ఉండేవాళ్ళం..ఇప్పుడు పెరిగిన సాంకేతిక నైపుణ్యాల వల్ల.మా కొరకు బోనులని,,,పిల్లులుని, ఏకంగా రక రకాల విష పదార్ధాలని తయారు చేసి మమ్మల్ని మట్టు పెడుతున్నారు..కొన్ని చోట్ల ఐతే మాకోసం తయారు చేసిన విష పదార్ధాలను..ఋణ బాధలు భరించలేని రైతన్నలు ప్రాణాలు తీసుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు.. ఆ పాపం మాకు తగులుతుందేమోనని భయంతో ప్రాణ రూపం వదిలి..ప్రాణం లేని వస్తు రూపం పొంది..ప్రతి ఇంటా బయటా కంప్యూటర్ అనే యంత్రం మునే మీరుగా భావించి..మౌస్ రూపంలో బతుకీడుస్తున్నాము.....తండ్రీ....



మూషికా బాధ పడకు..అదంతా కలి ప్రభావము... అదిగో భూలోకం దగ్గరకొచ్చింది...అదిఓ భాగ్యనగరం..మాకు అత్యంత ప్రియమైన నగరం..



అవును స్వామీ ప్రస్తుతం భాగ్యనగరం చాలా 'ప్రియమైన ' నగరం..!



అదేమి మూషికా..నీ భావం ,మాకర్ధం కాలేదు..స్వామీ భాగ్యనగరం ప్రస్తుతం మహానగరం గా గుర్తింపు పొదింది..అందుకే అక్కడ ప్రతీ దానీ ధరలు పెరిగి ప్రస్తుతం ప్రియమైననగరంగా గుర్తింపు తెచ్చుకుంది..అంతర్జాతీయ విమానాశ్రయాలూ, ఇంకా వివిధ అంతర్జాతీయ ప్రాజెక్టులు, సాఫ్ట్ వేర్ కంపెనీలు రాక వల్ల భూమి విలువ పెరిగి బాగ ప్రియమైంది స్వామీ భాగ్యనగరం.



మరి బాగా సంపాదిస్తున్నారుగా ప్రజలు హాయిగా ఉన్నారా ? మా మీద భక్తి ప్రపత్తులు పెరిగాయా....
ఎక్కడ స్వామీ..వారికి అంత తీరికేదీ ? వూరు చివర ఉద్యోగాలు..దారి అంతా ట్రాఫిక్ జాములు, కాలుష్యం, రేషన్ కోసం పడిగాపులు, నీటికోసం ఎదురుచూపులు, పిల్లల చదువు కొనుగోలూ, ఇలా బాధలు అధికమై తీరిక ఏదీ మీ గురించి పట్టించుకోవడానికీ ?అదిగో స్వామీ భాగ్యనగరం వచ్చేసాం..జాగ్రత్త స్వామి?



ఇంతలో రవీంద్రభారతి కూడలి దగ్గర పోలీసు ఆపాడు స్వామిని..



ఎమయ్యా ! ఆగాగు.. ఏమిటి రెడ్ సిగ్నల్ జంప్ చేస్తున్నావ్..ఏమిటి అంత స్పీడు ? హెల్మెట్ట్ ఏది ?
హెల్మెట్టా ? అనగా నేమి..



శిరస్త్రాణం .స్వామీ (ఎలుక చెప్పింది)ఇదిగో ఉందిగా...కిరీటం చూపించి అమాయకంగా చెప్పడు స్వామి.



పోలీసు : అన్నట్టు సీట్ బెల్ట్ ఏది ?



గణపతి : అది ఎందులకు



పోలీసు.: నువ్వు వెళ్తుంది ఫోర్ వీలర్ మీద..అంటే ఇదిగో నాలుగు కాళ్ళున్నాయిగా అందుకు..అంటూ ఎలుక నాలుగు కాళ్ళు చూపించాడు



గణపతి: వీడి అసాధ్యం కూలా.ఇప్పుడేమి దారి మూషికామూషికుడు : స్వామి తమ జంధ్యం చూపండి నాగులే కాబట్టి నల్లగా ఉండి బెల్ట్ అనుకుంటాడు అన్నట్టు మీ బెల్ట్ కూడా నాగులే కదా దెబ్బకి వొదులుతుంది వాడి తిక్క..



గణపతి చూపించిన జంధ్యం చూసి పోలీసు మూర్చిల్లగా...."బతుకు దేవుడా" అనుకుంటూ బయట పడ్డారు..మూషిక, వినాయకులు...



లకడీ కపూల్ మీదుగా ఖైరతా బాదులోని తన భారీ విగ్రహం చూద్దమని వెళ్తున్న స్వామికి అక్కడి ట్రాఫిక్ జాం చూసి మూర్చ వచ్చినంత పనైంది...చిన్న సందు దొరికితే ఇరికించేసే ఆటోలూ, అదే పనిగా హారన్ కొడుతూ రొద చేశే కార్లు...విపరీతమైన జనంతో నిండు గర్భిణిలా తెగ పొగ వుదులుతూ..ముక్కుతూ మూలుగుతూ కదులుతున్న ఆర్టీచీ బస్సులు, ఆంబులెన్స్ కి కూడా సైడు ఇవ్వకుండా..ఆగిన ట్రాఫిక్ లో ఇరుక్కున్న స్వామికి రెండున్నర గంటల తరువాత కానీ ఖైరతాబాదు జేరలేక పోయాడు... హు మానవుడికి పాప్ పరిహారం కోసం మళ్ళీ నరకం అవసరం లేదనుకుంటా..ఆ యముడు పెట్టే బాధల కన్నా ఈ బాధలు తక్కువేమీ కాదు..మరణించిన తరువాత కంటే మరణానికి ముందే అన్ని శిక్షలు ఇక్కడే అనుభవిస్తున్నాడు పాపం మానవుడు..



స్వామి భావం పసిగట్టిన మూషికం ..మరీ అల ఫిక్స్ ఐపోకండి స్వామీ..ఇంకా చాలా చూడాలి తమరు ఈ పది రోజుల్లో..అంటుండంగానే రైలు గేటు పడింది...మరలా ఆగింది మూషికం..



రైలు కోసం ఆగిన కొన్ని చిన్న వాహనాలు..గేటు కింద నుంచీ దాటుకుని వెళ్తున్నారు..కనుచూపు మేరలోనే రైలున్నా ఒక్క నిమిషంలో నే అది వెళ్ళిపోతుందని తెలిసినా వాళ్ళు చేసే ఆ పని చూసి స్వామ్మికే భయం వేసింది.



ఇంతలో కాలిమీద ఏదో తడి..చూస్తే తన పారాణికన్నా ఎర్రగా మరో డిజైను...అది ఏమా అనుకుంటుండగా..సారీ బాస్ చూసుకోలేదు......అంటూ మరికొంచెం పక్కగా ఊసాడు తన నోట్లోని పాను పరాగ్ ని తన సరాగానికి మురిసిపోతూ... oka maanavuDu



హా! హతవిధీ !! అనుకుంటుండగా ముక్కులదిరే వాసన...అది ఏమి వాసనో స్వామి పొడవాటి ముక్కు కూ అర్ధం కాలేదు..అన్ని వైపులా ఆ వాసన తప్పీంచుకోవడానికి తన తొండాన్ని తిప్పే ప్రయత్నం చేశారు స్వామి....ఎటు తిప్పినా ఏదో ఒకీ వాసన తొండాన్ని తాకుతోంది..మొదటి సారిగా తొండం అంత పొడవుగా ఉన్నందుకు బాధ కలిగింది స్వామికి.....మూషికుడు ఇది పసిగట్టి ..స్వామీ అది ఆ పక్కనుంచి వస్తున్న మూత్ర శాల వాసన..ఈటుపక్కనుంచీ వస్తున్న చైనీసు నూడుల్స్ మసాలా ఘాటు..ఇటు ఆ కోడి మాంసపు దుకాణపు వాసన...అదిగో అక్కడ పొంగి పొర్లుతున్న డ్రైనేజీవనది నుంచి వచ్చే వసన..ఆ పక్కన ఉన్న కుళ్ళిన పళ్ళ వాసనతో కలిసి వస్తున్న కంపు స్వామీ మనం ఈ ప్రాంతం దాటినా ఆ వాసన మనల్ని వదలదు స్వామీ అన్నాడు...
ఆ వాసనలకి కళ్ళు బైర్లు కమ్మిన స్వామి ..మూషికా చీమూ- రక్తం కలిసిన వైతరిణి దాటడం అయినా సులభమేమో కానీ..ఈ భాగ్ య(మ)నగరం లో రహదారి దాటడం చాలా కష్టం,....ఏదో నవరాత్రులు పూజ చేసినారన్న ఆనందంలో కాలుష్య మయమైన టాంకు బండులో ముంచినా భరిస్తున్నా కానీ ఈ భాగ్యమ నగరంలో జీవించడం మనుష్యుల వల్లే కానీ ఇ దేవతల వల్ల కాదు..పద మన భారీ విగ్రహం దగ్గర జనాలని ఆసీర్వదించి మనమూ టాంకు బండు వద్ద వేచి వుందాం ఎలాగు నిమజ్జనం రోజున భక్తజనం వస్తారు కాబట్టి అక్కడనే ఆ ఆనందం పొందుదాం...అంటూ ముందుకు కదిలాడు స్వామి..

Tuesday, September 2, 2008

'గన్'పతి

వినాయక చవితి శుభాకాంక్షలతో



'గన్'పతి



అది కైలాసం....శివుడి మెళ్ళో పాము ఆకలిగా ఉండి ప్రసాదం కోసం చూస్తోంది..ఈలోగా వచ్చిన వినాయకుడి ఎలుక...ఏం మామా భోజనం అయిందా అంటూ పలకరించింది...ఇంకా లేదు...స్వామి తిన్నాకే నాకు..ఆయనకి భోజనం అదీ అక్కర్లేదు...నీ భోజనం అయిందా అంది...దానికి ఎలుక మా స్వామి దగ్గర ఆ ప్రాబ్లం లేదు..ఆయన కి ఆహారం ఇష్టం. అందుకే నాకు ఫుడ్డు కి కొదవ లేదు...అదిగో మాటల్లోనే మా స్వామి వస్తున్నాడు అంది వినాయకుడు రావడం చూసి,,,,,
వినాయకుడు వస్తూనే..తల్లికి, తండ్రికి నమస్కరించి..అమ్మా వినాయక చవితి వస్తోంది..నేను అలా భూలోకం వెళ్ళి ఓ పది రోజులు ఉండొస్తానమ్మా..అన్నాడు..దానికి పతి సేవలో ఉన్న ఆ పార్వతి ఉలిక్కి పడి..నాయనా వినాయకా..ప్రతి సంవత్సరం వెళ్తూనే వున్నావు కద నాయనా..ఈసారికి వద్దులే...నీ పుట్టిన రోజు ఇక్కడే కైలాసంలో జరుపుకుందాం..నువ్వు ఎక్కడికీ వెళ్ళకు అని కంటనీరు పెట్టుకుంది...
దానికి పశుపతి ..అదేమి పార్వతీ అలా అంటావు...విఘ్నేశ్వరుడు ప్రతి సంవత్సరమూ..తన జన్మదినము భూలోకమునే కదా జరుపుకుంటాడు...మరి ఈ సారి వద్దనెదవేమి.? మరీ అంత దిగులుగా ఉంటే మనమూ వెళ్ళివద్దాం...అన్నాడు శివుడు....
తల్లి ప్రేమ మీకేమి అర్ధం అవుతుంది లేండి...నా కుమారుడు ఏమన్నా రాక్షసులతో యుద్ధానికి వెళతానన్నాడా..లేక తపస్సుకు వెళతానన్నాడు... వెంటనే పంపడానికి..వెళ్ళేది భూలోకానికి..అందుకే నా దిగులు...అంది పార్వతి...
అదేమి పార్వతీ అంత మాట అంటివి..భూలోకమున అందరూ మన భక్తులేగా...పైగా ప్రతి సంవత్సరం మన కుమారుడి జన్మదినాన్ని అత్యంత వైభవంగా ఊరూరా.... వాడ వాడల జరుపుకుంటారు కూడాను...తిరుపతి లడ్డు వలే మన కుమారుడు ధరించిన లడ్డుకు వేలం పెట్టి - వెల కట్టి మరీ వైభోగాలు జరుపుతారు....
ఏమి చెప్పను స్వామీ..మనవాడి పుట్టిన రోజు జరుపుతామని బలవంతంగా డబ్బులు లాగుతారు కొందరు...ఆ డబ్బుతో అడ్డమైన పనులూ చేస్తారు...కొందరైతే పందిరి వేసి మన కుమారుడి విగ్రహం పెట్టి పూజలు చేసి...అక్కడే సాం'స్క్రుతక' కార్యక్రమాలు జరుపుతారు...అవి ఎంత క్రుతకంగా ఉంటాయో..మనకి అంతుపట్టదు....'అ' అంటే 'అమ్మ', 'ఆ' అంటే 'ఆవు' లు పోయి... అ అంటే అమలా పురం..ఆ అంటే ఆహా పురం అని, ఆకలేస్తే అన్నం పెడతా అంటూ అర్ధం లేని పాటలు..అర్ధనగ్నపు ఆటలు ఆడతారు,,,,ఇవే కాక రాత్రి కాపలా అని చేసే కార్యకలాపాల చిట్టా నేను చెప్పలేను...చతుర్ముఖ పారాయణం..తీర్ధం....ప్రసాదం పేరుతో పేకాట..మందు..ఇంకా సర్వ పాపాలకూ ఒడిగడతారు...నిజంగా నిష్టగా చేసేవారూ లేకపోలేదు..కానీ ఇలాంటి వారు చేసే పాపం మన వాడికి తగులుతుందేమోనని నా భయం..
దేవీ మానవులు చేసే పాప పుణ్యాలకు - మనకు సంబంధం లేదు...వారి పాపం వారికే తగులుతుంది..నువ్వు భయపడనవసరంలేదు..అని వూరడించాడు పరమేశ్వరుడు...
స్వామీ నా అసలు భయం అది కాదు..స్వామీ....భూలోకమున తీవ్రవాదుల భయం ఎక్కువ అయింది...ఎక్కడ పడితే అక్కడ బాంబులు పెడుతున్నారు...అహార స్థలాలు..విహార స్థలాలు ..అని లేకుండా ఎక్కడపడితే అక్కడ బాంబులు పేలుస్తున్నారు..అంతే కాదు ప్రతిసారి విగ్రహ నిమజ్జనం లో ఏదో జరుగుతుందని వినడం రివాజుగా మారింది....ఆ హుస్సేను సాగరంలో నీరు ఇప్పటికే విషతుల్యం అయింది....ఇలా చాలా భయాలున్నాయి స్వామీ...అంది పార్వతి
పార్వతీ ఎందుకు నీకు భయము?...ఆ తీవ్ర వాదులు పూర్వ జన్మలో రావణ..దుర్యోధనాది రాక్షసుల బంటులు..వారి వారి కర్మ ననుసరించి ఇలా జన్మించి పూర్వ జన్మ వాసనల వల్ల 'కలి' ప్రేరేపితులై అలా ప్రవర్తించుచున్నారు...వారి సమయం ఆసన్నమైనప్పుడు వారి పాపం 'వారిని' కూడా బాంబు రూపమునో, ఎన్ కౌంటర్ రూపమునో వారిని దహించివేస్తుంది..ఇక మన కుమారుడి విషయం అంటావా..అతను పుట్టుకతోనే మ్రుత్యుంజయుడు..నా చేతిలో మరణించి..తిరిగి జన్మ పొందినవాడు...అంతే కాదు చంద్రుడి ద్రుష్టి తగిలి ఉదరం పగిలినా తిరిగి మామూలుగా అయిన మన బిడ్డడు...మూషికాసురుడిని ఒక దంతంతో అణిచి వాహనం చేసుకున్నవాడు...గణాధిపత్యం వహిస్తూ విఘ్నాలకు నాయకుడైనవాడు..అట్టి కుమారుడి గూర్చి ఎట్టి చింతా వలదు..
స్వామీ నా భయము మన కుమారుడి గూర్చి కాదు స్వామి! వినాయకుడి పూజ కోసం తాపత్రయ పడే భక్త జనం గూర్చి...కుమారుడి పట్ల భక్తి పారవస్యం లో, ఆ తీవ్రవాదుల పన్నిన కుట్రకు గురి అవుదురేమో అని నా భయం స్వామీ....అమాయకులైన ఆ ప్రజలు మన వల్ల ఇక్కట్లకు గురికాకూడదు అని నా అభిప్రాయం ప్రభూ..
ఆహా దేవీ నిజం గా .'జగజ్జనని' అనిపించావు...ముల్లోకాలకూ తల్లివైనందుకు నీ పిల్లల గురించిన బాధ్యతకు ముగ్ధుడినైనాను..ఇంత కాలం రాక్షసులు మాత్రమే శత్రువులు అనుకున్నాను......ఇప్పుడు అర్ధమైనది...అసలు పాపాత్ములెవరో...వారి భరతం పట్టుటకు మన పుత్రునికి ఇదిగో అత్యంత ఆధునికమైన ఆయుధం ఇది. దీనిని 'గన్' అందురు ఒలంపిక్ మహాయజ్ఞమున అబినవ 'బింద్రా' కు బంగారు పతకము సాధించిన 'గన్' ఇది. దీనిని ఒక్క సారి మీట నొక్కిన వేలాది గుళ్ళు వర్షంలా కురిసి తీవ్రవాదులు అంతమౌదురు..దీనిని ధరించి భూలోకమునకు వెళ్ళి తన పుట్టిన రోజు ఆనందముగా జరుపుకుని, లోక కళ్యాణము చేకూర్చి తిరిగి వచ్చును మన కుమారుడు...
'గన్' ధరించు వాడు కాబట్టి ఇకనుంచి మన కుమారుడు 'గన్'పతి అని పిలువబడతాడు...సర్వేజనా సుఖినోభవంతు....

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Best CD Rates