Thursday, October 28, 2010

ట్రాఫికర్

 మంత్ ఎండింగ్ వస్తోంది..పండగ దగ్గరైంది...
టార్గెట్స్ పెరిగై..ట్రాఫిక్ పెరిగింది..
చెక్ పోస్టు పెట్టెయ్ -  దొరికినోణ్ణి పట్టేయ్ ...
లేని వన్నీ అడిగేయ్...దొరికినంత నొక్కేయ్..
 ఏ తప్పుకైనా యాభై .. దొరలాగా వదిలెయ్..




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

Monday, October 25, 2010

రకత చరితర...

రకత చరితర...

మనం పుట్టించకపోతే పదాలెలా పుడతాయి...ఆర్ జీ వీ సినిమా తీయకపోతే మనమేం మాట్లాడుకుంటాము. మామూలు మనుష్యులకొచ్చే ఆలోచనలు ఆయనకి రావనుకుంటా. దేవుడంటే నమ్మకం లేదు(ట). దెయ్యాలుంటాయో లేదో తెలీదు(ట). ఇలా చాలా ఉన్నాయి. శివ సినిమాతో ఇండస్ట్రీలోకొచ్చి ...కాల క్రమేణా కొన్ని సినిమాలు తీసి..కొండపై స్వామి వారి కిరీటం కొట్టేసే లెవల్లో అద్భుతమైన సినిమాలు తీసి..అందులో దేవుడున్నాడు అని చెప్పాడో లేదని చెప్పాడో అర్ధం కాలేదు.సడెన్ గా చక్రం అదీ వస్తుంది..మరి.. ఎవరి మీదో అలిగి..తెలుగు సినిమాకు దూరమైనాడు..

తరువాత ఫాక్టరీ ఒకటి పెట్టాడు.. కానీ అందులోంచి పొల్యూషను..వ్యర్ధ పదార్ధాలే ఎక్కువ వచ్చి అసలు ఉపయోగపడే ప్రోడక్ట్లు తక్కువ వచ్చినాయి. అని ఆయనదే ఉవాచ. నాకిష్టమొచ్చినట్టు తీస్తా చూస్తే చూడండి ...లేక పోతే లేదు.. అని ధైర్యంగా చెప్పగల దమ్మున్న ప్రొడ్యూసర్..డైరెక్టర్...ఆయన తీసిన దెయ్యం సినిమాలు...ఒక్కళ్ళే చూడగలిగితే ప్రైజ్ ఇస్తానన్నట్టుగానే ఆయన తీసిన ఆగ్ లాంటి సినిమాలు ఆయనొక్కడే లేదా ధియేటర్ మొత్తం మీద ఒక్క ప్రేక్షకుడే చూసిన సందర్భాలూ ఉన్నాయి.



నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

Saturday, October 23, 2010

దివాళీ

దివాళీ
హ్యాపీ దివాళి అంకుల్...ఎప్పుడూ పలకరించని మా పక్కింటి అబ్బాయి చెప్పగానే ఒక్క సారి ఆస్చర్యపోయా...క్రికెట్ బంతి మా బాల్కనీ లో పడితే ఇంక తిరిగి ఇవ్వనని నా మీద కోపం వాడికి...ఐనా ఎందుకు చెప్పాడో లే అని నేనూ హ్యాపీ దివాలి అన్నా..'ఢాం' అని పెద్ద శబ్ధం తో నా కాళ్ల దగ్గర పెద్ద శబ్ధం..ఉలిక్కి పడి ఆమడ ఎత్తు పైకెగిరి పడ్డా...పక్కన చూస్తే వాడు లేడు..

టీ వీ లో మంచి సినిమాలొస్తాయి చూద్దామంటే 100000వాలాట ఒకటే సౌండు...అసలే అపార్టుమెంటు...కూలుతుందేమోనని బెంగ.

ఎవడో కావాలని వేసిన రాకెట్టు తో పైన ఆరేసిన బట్టలన్నీ కన్నాలు..

లక్ష్మీ బాంబు పేలడం వల్ల బీటలిచ్చిన కిటికీ అద్దాలు.నానా భీభత్సం..కానీ మరోఅ పక్క మళ్ళీ.హ్యాపీ దివాళీ అంటూ ఒకటే పలకరింపులు...ఎస్ ఎం ఎస్ లు..ఫోన్ కాల్సు..ఆ హా హ్యాపీ గానే ఉంది దివాళీ. ఎందుకంటే క్రాకర్సు కొందామంటే..ఆకాశం లో ఆగిపోయిన చంద్రయాన్ ఉపగ్రహం దగ్గర తచ్చాడుతున్న రేట్లు ...పంచదార దొరక్క చప్పబడిన స్వీట్లు..వరదల వల్ల కరకట్టలకి పడ్డ తూట్లు..ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నెన్నో విసేషాలు.

ఇది వరకైతే..ఎంచక్కా..కాగితాలు గొట్టాలు చేసి ఎండబెట్టి..బొగ్గు..సురేకారం, ఇంకా కొన్ని..సామాను తెచ్చి కలిపి .తారాజువ్వలు..మతాబులు..పిచ్చికలు..సిసింద్రీలు..సీమ టపాసులు..తాటాకు బాంబులు..వగైరా వగైరా..(వయాగ్రా అని చదవకండే) స్వయంగా తయారు చేసిన.చేసిన దీపావళి సామానుతో పక్కింటోళ్ళతో పోటీ పడుతూ..హాయిగా పాటలు పాడుతూ ..సరదాగా గడిచేది..ఇంట్లో అందరూ పూజ చేసి కొత్తబట్టలు కట్టుకుని ..ఆ రోజులే వేరు.

ఇప్పుడో..అసలు ఈ పండగ ఎందుకు చేసుకుంటున్నామో కూడా తెలీదు. ప్రజలను కాపాడడానికి భూదేవి దుష్టుడైన తన కుమారుణ్ణి...సత్యభామ అవతారంతో వధించి తద్వారా మనకి ఆనందమయ జీవితాన్ని అందించింది కాబట్టి...అమావాస్య చీకటి వదిలి కాంతులీనే వెలుగు ప్రసరించడానికి ఈ పండగ..ఏర్పాటైందని ఎందరీ తెలుసో...మరి.

మనం మాత్రం..వెలుతురొచ్చేవి వదిలేసి....చెవులు చిల్లులు పడే సౌండొచ్చే బాంబులు..లడీలు...దిక్కుమాలిన పేర్లు గుండెలవిసే సౌండ్లు..ఉన్న వాటితోనే




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

Saturday, October 16, 2010

బిల్"డప్పు

బృందావనం - బావగారూ బాగున్నారా పార్ట్ 2 - ఈ మధ్య రీ మేకులెల్లివైనాయి..ప్రేక్షకుల నెత్తిన కొట్టడానికి.. పాత సినిమా తీసుకుని మసాలా దట్టించి మీదకొదుల్తున్నారు. నిన్న నే బృందావనం చూశా.. ఆ మధ్య వచ్చిన బావగారూ బాగున్నారా గుర్తొచ్చింది. ఒకమ్మాయిని ప్రేమించి..ఇంకో అమ్మాయికి సాయం చేయడానికెళ్లిన హీరో ఇంట్లో అందరినీ (ఏ)మారుస్తాడు. బగీ జంపులు బదులు..సూమో జంపులు ఉన్నాయి...పరేష్ రావల్ బదులు ప్రకాష్ రాజ్ ఉన్నాడు.. సెకండాఫులో బ్రహ్మానందం ఎంట్రీ ఈ మధ్య సెంటిమెంటనుకుంటా. వెనకా ముందూ చూడకుండా ఇరగదీసేవాళ్ళు.. హీరో ఆగమంగానే ఆగి పోయి.. చెప్పే సోదంతా విని..ఫైటింగు చేయకుండా ...తన్నులుతినడం..హీరోయిజం..ఇద్దరు హీరోయిన్ లు కామన్. చివర్లో ఎవరిని చేసుకుంటాడో అని సస్పెన్సు.. పెడ్డెంటీయార్ ఎంట్రీ గ్రాఫిక్స్ ...జనాల కోసం..ఎప్పుడో ఒక సారి బాగుంటుంది కానీ ప్రతీ సారీ అంటే ?? ఒకటో రోజు నుంచే హిట్టైంది బాబూ అంటూ ఆ ప్రెస్సు మీట్లేంటో.. కలెక్షన్ల లెక్కలేంటో.. మరి అన్ని కోట్లకి.. వీళ్ళు టాక్సులు కడుతున్నార ? సినిమా చూసే మంకేమో ఎంటర్టైన్ మెంట్ టాక్స్ .. వాళ్ళకి మాట్రం వుండదేమో..?

మహేష్ ఖలేజా కూడా చూసి దొబ్బించుకున్నా .... సారీ ఆ సినిమాలో ఆ డైలాగు అన్ని సార్లు వినీ వినీ అలా వచ్చేసింది.. అదేంటో హీరోకి ఇంకేదీ దొరకనట్టు అదో ఊతపదం(బూతుపదం) పెట్టారు. చాలా కాలం క్రితం అమితాబ్ బచ్చన్ ది మిస్టర్ నట్వర్ లాల్ అని ఒక సినిమా వచ్చింది.. అందులో దేవుడు వచ్చి పులినుంచి రక్షిస్తాడని ఎదురు చూస్తుంటారు ఒక కొండ మీద జనాలు.. అక్కడకి జేరిన అమితాబ్ నే దేవుడి గా చూస్తారు ఆ ప్రజలు... మొదట ఇష్టం లేక పోయినా వాళ్ళ కష్టాలు చూసి వాళ్ళని రక్షించే పనిలో పడతాడు అమితాబ్. ఆల్మోస్ట్ గా అదే మూల కధ తో నడిచిన ఈ సినిమాలో మగధీర చాయలు కూడా కనబడతాయి.కనీసం  రావు రమేష్ ప్లేసులో ఇంకెవరినన్నా చూపించినా బాగుండేది. సేం మగధీర లాగానే .. యంత్రాలు..మంత్రాలు వేసి... హీరో కనపడగానే కళ్ళల్లో దుమ్ము పడుతుంది..పక్షులు రెట్ట వేస్తాయి,,,, కుక్కలు మొరుగుతాయి.. అంటూ ఏవేవో చెప్తాడు.. ఇంక అనూష్క తన యాక్షన్ అంతా అరుంధతి లో చూపించేసింది కాబట్టి... మరో కోణం  లో టాలెంట్ చూపించే ప్రయత్నం చేసినట్టున్నారు.. అసలు త్రివిక్రం సంభాషణలు అంటే పంచ్ కామెడీ కోసం చూస్తారు జనాలు.. కానీ ఇందులో మరో రూపం లో వున్నాయి డైలాగులు.. అమెరికా లో ఈ సినిమా చూసినప్పుడు ధియేటర్ లో ఉన్నది మేమందరం కలిపి 34 మంది..ఇది నిజంగా నిజం.. కానీ మర్నాడు పేపర్లలో..సైట్లలో చూస్తే అమెరికాలోనూ అద్భుతం గా ఆడేస్తోంది..కలెక్షన్ల వర్షం అనీ బిల్"డప్పు " .. ఎంటో.. ఈ లెక్కలు..తొక్కలు కాకుండా సినిమా కధ ..కధనం మీద ఎప్పుడు కాన్సంట్రేట్ చేస్తారో మనవాళ్ళు. వీళ్ళందరూ సినిమాలో కన్నా ఈ ప్రెస్ మీట్ లలో నే ఎక్కువ నటిస్తారేమో... ఆ సీన్ అద్భుతం గా వచ్చింది..జనాలకి ఈ పాట నచ్చింది...చాలా కష్టపడి తీసాం..అంటూ.

మొదటి రెండు రోజులూ ఎలాగూ జనాలు చూస్తారు..అభిమానులు .. ఇంకా యూతు... చాలా మంది చూస్తారు...అందుకు హౌసు ఫుల్లు ఖాయం.. మరి రెండో వారం నుంచీ జనాలు ఎక్కడున్నారో వెతుక్కోవాల్సిందే.. అభిమానులకి కూడా నచ్చట్లేదంటే లోపం ఎక్కడుందో మన హీరోలూ...నిర్మాతలూ..దర్శకులూ ఆలోచించుకోవాల్సిన విషయం..

ఇవాళ పొద్దున హిందీ లో హం అనే సినిమా వచ్చింది.. హీరో తన తమ్ముళ్ళతో ఎక్కడో ఒక మారు మూల గ్రామం లో సాధారణ జీవితం గడుపుతుంటాడు... అనుకోని పరిస్థితులలో తన గతం చెప్తాడు.. ఆ గతం లో అతనో పోర్ట్ కూలీ..అన్యాయం చేసే ఒక ధనికుణ్ణి..అతని సైన్యాన్ని తుదముట్టించే డాన్ రేంజ్... ఫ్లాష్ బాక్ తరువాత ..మళ్ళీ ఆ ప్లేసుకెళ్ళి జనం కోసం విలన్ లని తుద ముట్టిస్తాడు.. ఇదీ స్టోరీ... మీకు ఒక బాషా, ఒక సమర సిమ్హా రెడ్డి, ఒక నరసిమ్హ నాయుడు, ఒక ఇంద్ర, లాంటివన్నీ గుర్తొస్తున్నాయ...గుడ్... వీటన్నిటికీ రచయిత ఒక్కరే.. చిన్ని కృష్ణ..
అదీ మన సత్తా..







నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

Monday, October 4, 2010

కామన్ v/s వెల్త్




 కామన్ వెల్త్ గేములు ఆరంభం అదిరింది . ఆటలకన్నా ముందు పాటల కార్యక్రమం చాలా బాగుందిట..
మన ఆంధ్రుడు పతకం గెలిచేసి..పతాకం పాతేశాదు కూడా..మరి ఆకాశంలో మెరిసే స్టార్లు ఏం తెస్తారో చూడాలి..
కాస్ట్లీ ఆటలు   ఆడేవాళ్లు, కోట్లు సంపాదించే వాళ్ళు, యాడ్లలో కనిపించేవాళ్ళకి ఉండే ఆదాయం..గుర్తింపు ఈ " కామన్ " ఆటగాళ్ళకు ఉంటుందా...
వీళ్ళు ఏకలవ్యులుగా ఉండిపోతారా...అర్జునులుగా గుర్తింపబడాతారా ఎప్పటికైనా ? వైట్ అండ్  సీ ..






నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

Saturday, October 2, 2010

రూల్స్


 

రూల్స్ 

రూల్స్ అనేవి బ్రేక్ చేయడానికే అని మన ధృఢ అభిప్రాయం.
పాటించడానికే అన్నది పక్క దేశాల ఆచారం 
రోడ్డు సిగ్నళ్ళు పాటిస్తే యాక్సిడెంటులుండవు 
మనం పాడు చేయకపోతే రోడ్లు ఇలా తయారవవు
పక్కదేశాల ఇస్టైళ్ళు-దినాలేకాదు..మంచి పద్ధతులు కూడా అనుకరిస్తే 
మనదేశంలో ఉన్న ప్రతిభకి ప్రతీ వాడూ చేస్తాడు నమస్తే 




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Best CD Rates