Monday, March 31, 2008

ఏపి రియల్ ఫూల్...


ఏపి రియల్ ఫూల్...


మామూలుగా ఏప్రిల్ ఒకటో తారీకు నాడు ఫూల్ చేస్తారు కాని ఏంటో ఏపి అదే ఆంధ్ర ప్రదేశ్ రియల్ గా ఫూల్ అవుతోంది...రియల్ ఎస్టేట్ వల్ల ఐతే ఏంటి..ఇంకోదాని వల్లనైతే ఏంటి..మొత్తానికి తెలుగు ప్రజానీకం గొప్పగా ఫూల్ ఐపోతోంది..బడ్జెట్ చూపించి అబ్బో ఆంధ్ర గొప్పగా వెలిగిపోతోంది అంటుంది ప్రభుత్వం..అబ్బే తగలబడిపోతోంది అంటుంది ప్రతిపక్షం..
తెలంగాణ వస్తే మావల్లే అంటుంది.. తె ర స...అబ్బె మేమే తెస్తాం అంటుంది కాంగిరేసు.,..మేము సమైఖ్యాంధ్ర కే కట్టుబడ్డాం కాకపోతె ప్రజల అభీష్టం ప్రకారం నిర్ణయం తీసుకుంటాం అంటుంది తె దె పా...అసలు మేమే తెలంగాణా కోసం పోరాడేది అంటుంది భ జ ప...కానీ ఎవెరౌ తీసుకొస్తారో తెలీదు....ప్రజలకి
ఇక చిరంజీవి పార్టీ పెట్టేస్తున్నాడు..రేపో యెల్లుండో .అంటూ ప్రచారం...ఆయన మాత్రం జల్సా గురించి....చరణ్ గురించి తప్ప ఎక్కడా ఏమీ చెప్పడు...పార్టీ పెట్టక పోయినా సమర్ధించినందుకు ఈ మధ్య ఒకాయనకి ఉన్న పార్టీలో లీడర్గిరి పోయి తన కోటలో కూర్చుని చిరు పార్టీ లో తన కోట గురించి ఆలోచిస్తున్నాడు....
ఇలా చెప్పుకుంటూ పోతే మరి ఏపి రియల్ ఫూల్ అఔనా కాదా? మరిన్ని మరోసారి

Wednesday, March 26, 2008

ఢీ ....ఎస్.

రాష్ట్రంలో వై ఎస్ ని ఎదుర్కోవడానికి చాలామంది కలిసి వచ్చి,,,ఆయనకి కాలం కలిసి వచ్చి,,అధికారం దక్కించుక్కున్నరు డీ ఎస్.. క్రికెట్లో లాగా సీనియర్..జూనియర్ అంటూ ఈమధ్య వచ్చిన గొడవలు,,,,తెలంగాణా సమస్య,,,ఇవన్నీ కూడా కలిసొచ్చిన అంశాలే ...కలిసొచ్చే కాలానికి నడిచొచ్చిన పి సి సి పదవి....అనుకోవచ్చేమో..
అయినా సోనియా మాటకు ఎస్ అనేవాళ్ళకు ఈజీ గా పదవులు దక్కుతాయేమొ...?దేశానికి ప్రధాని ఎం ఎస్ అంటే మన్మోహన్ సింగ్ కాదు ..మేడం ఎస్...రాష్ట్రానికి ముఖ్యమంట్రి,,,వై ఎస్...అంటే చాలా మందికి అసలు తెలీదు...యేదైనా ఎస్ ఇప్పుడు పి సి సి ..డి ఎస్...డైరెక్ట్ గా ఎస్
ఎందుకంటే ఎస్ ఫర్ సోనియా.......
మన భారత అప్రధాన మంత్రి, రాష్ట్ర ముఖ మంత్రి,, (p)పొట్లాటలు (c)చివాట్లు, (c )చీత్కారాలు రాష్ట్ర అధ్యక్షుడు ( మీరు సరిగానే చదివారు..) ఎస్...ప్రెస్ పాలన భేషుగ్గా వుందని ఆమె కితాబు...కొస మెరుపు....

Friday, March 14, 2008

సోనియా గాలి బాట.....

మరేమనాలో తెలియలేదు...ఇందిరా పల్లెబాట..రాజీవ్ నగర బాట ....మరి సోనియా గాలి బాట.....పాపం రాజీవ్ బతికున్నన్నాళ్ళూ బొట్టు పెట్టిందో లేదో నాకు తెలీదు కానీ .....ఈమధ్య బొట్టెట్టుకోవడం మాత్రం ఎక్కువైంది...సరే అది ప్రజల మనోభీష్టం కాబట్టి మనమేమీ అనకూడదు....
కానీ ఆంధ్ర ప్రదేశ్ లో నాయకులే లేనట్టు... అసలు ఈ విమానాశ్రయం విషయంలో అంతా సోనియా దయే అన్నట్టు...అసలు రాజీవ్ పూర్వాశ్రమంలో పైలట్ అవడం వల్లే హైద్రాబాద్ కి విమానాశ్రయం వచ్చినట్టు....ఆ దండోరా యేమిటో.......కనీసం ప్రతిపక్షనాయకుడైనందుకైనా చంద్రబాబుకి మర్యాద ఇవ్వకుండా తూ తూ మంత్రంగా జరిపిన సభ సోనియా పూజ తో రాజీవ్ నామస్మరణతో అక్కడ కూడా రుణాల మాఫీలూ.....ఇందిరమ్మ పధకాలు గూర్చి చెప్పి అంతర్జాతీయ స్థాయిలో ప్రచారం మొదలెట్టిన నాయకులకే తెలియాలి.....
అన్న ఎన్ టీ ఆర్....పేరు పెట్టడానికి పాపం వాళ్ళకి...చేతులు రాలేదు....పి వి పేరు కనీసం రోడ్డుకైనా పెట్టారు..సంతోషం.....దానికి కూడా రాజీవ్ పేరు పెట్టుంటే అది కూడా ఈపాటికి తయారయ్యేదేమో....
పదేళ్ళ పిల్ల సోనియా (రాజకీయాల్లో ఆమె వయసు) చేతుల మీదుగా సుమ్షాన్ బాద్ విమానాశ్రయం ప్రారంభోత్సవం లో ఏకైక ఆనందం దియా మిర్జా చీరకట్టులో రావడం.......
మొత్తానికి ఆంధ్ర ప్రదేష్ నాయకులను గాలికి వదిలేసి .........అనుకున్నది కానిచ్చేసారు....

Sunday, March 9, 2008

మనం ఇలా చూద్దామనుకుంటే, నాకు ఇలాగిష్టం అంటూ బిళ్ళ కట్టుకు మరీ చెబుతోందీ కలకత్తా చిన్నది...మడికట్టుకునే వేషాలు నాకు ఇష్టం లేదు..ఐటం సాంగులకి ఎవరూ పిలవటంలేదు అని పాపం ఆ పాప బాధ పడుతోంది..మహిళా దినోత్సవం సాక్షిగా ఇలాంటి వాళ్ళని ఏమనాలో తెలియట్లేదు..సభలకి సమావేసాలకే కాదు... సినిమా ధెయేటర్లకి కూడా పొట్టి గౌనులతో వస్తున్న....హీరోయిన్లారా.....మీకు దణ్ణం పెడతాం,,,,,దయచేసి...ఆడతనానికి...మచ్చ తీసుకురాకండి...పచ్చబొట్టులు కనపడాలని...తాపత్రయపడకండి....
ఇక మరో విషయం....అన్ వాంటెద్ 72 అంటూ ఈమధ్య వచ్చిన గర్భ నిరోధక మాత్రలు....పాపం యువతను పెడత్రోవ పట్టిస్తున్నాయని అంతా వాపోతున్నారు...దిక్కుమాలిన సినిమాలు,,,క్లబ్బులు,,,,పబ్బులు........కాలేజీల్లోకూడా....తలచుకుంటేనే అసహ్యంగా ఉంది.....ఈమధ్య ఈ మాత్రల గురించి,.,,,పేపర్లలో, రడియొల్లో...వీలైన చోత్లా చెబుతున్నరు...నిన్న మావారు సరైన ప్రికాషన్ తీసుకోలేదు...పొద్దున్న మా ఫ్రెండు చెప్పింది ఈ మాత్రల గురించి థంక్ యు అన్ వాంటెడ్ 72 అంటూ....మహిళా దినోత్సవం సాక్షిగా..
ఇక లోక్ సభలోనూ షరా మామూలే....మహిళా బిల్లు లేకుండానే,,,,,,,మహిళా దినోత్సవం గడిచిపోయింది.......
గుడ్డిలో మెల్ల యేమిటంటే...ఇంకా ప్రభుత్వం ఒక లేడీ కనుసన్నలలో నడవడం....అఫ్ కోర్స్ ఆవిడ రాజీవ్ భార్య .........
సోనియా విదేసీయురాలు..బహిష్కరించండిసానియా బట్టలు బాగాలేదు తిరస్కరించండిభుట్టో పాపం చచ్చిపోయింది కాబట్టి బతికిపోయిందితస్లీమాలు...మమతా లు,,,నిరంతరం చర్చల్లో వుండే మహిళలే....
హిల్లరీ గెలుస్తోందట...కొసమెరుపు......
యేది యేమైనా మేరాభారత్ మహాన్
ధనానికి దాసోహంఆడదానిపై వ్యామోహంతానే గొప్ప అనే అహంఅవసరానికి మాత్రమే స్నేహం
ఇక్కడి జీవ జనుల లక్షణం జాగ్రత్త మాట మార్చగలరు తక్షణం

Wednesday, March 5, 2008

శివ శివా




శివ రాత్రి తో చలి శివ శివా అంటూ పోతుంది అంటారు పెద్దలు,, కాని ఇప్పుడు జరుగుతున్న రాజకీయాల వేడి వల్ల ఆ చలి ఎప్పుడో పోయింది అనిపిస్తోంది....

కె చి ఆర్ రాజీనామాలు,,,, మధు యాష్కీ పై గోనె విసిరిన నకిలీలల వల.....జల్సా ఆడియో కార్యక్రమంలో చిరు సందేసంతో తలెత్తిన సందేహాలూ నా తర్వాతి సినిమా వస్తుందా రాదా తర్వాత మాట్లాడుకుందాం, ప్రస్తుతం యువతరం వెనుక నడుస్తా,అంటూ సందేహాత్మక సందేశాత్మకంగా మాట్లాడిన తీరూ, చిదంబర రహస్యం అను పేరుగల ఎన్నికలల బద్జెట్టూ,, ఆంధ్రా ని పట్టించుకోకుండా తమిళనాడు కి వరాలిచ్చిన లాలూ రైలూ అబ్బో ఈమాసం లో అన్నీ విసేషాలే.....

చాలా చోట్ల చూశా... శివాలయాల దగ్గర పూజ టికెట్ల కన్నా రైతు బజార్లు, పండ్ల మార్కెట్టుల దగ్గర పుచ్చకాయల, అరటిబండ్ల దగ్గరే ఎక్కువ లైనులున్నాయి...దేవుడికన్నా రూపాయి తక్కువకి అమ్మే షాపాయినే గొప్పగా కనిపిస్తున్నాడు..అసలే శలవలు కూడా ఇవ్వని ఆఫీసుల గొడవ, ట్రాఫిక్కు చిక్కుముడి,,,పరీక్షల సీజను,,,ఆహా అన్నీ కలసి వస్తే మధ్య తరగతి మానవుడి ని ఆ దేవుడే కాపాడాలి...

దీనికి తోడు.. అసలు శివరాత్రి 5 తారీకున చేసుకోవాలి అర్ధరాత్రి చతుర్దశి వుంది అని ఒక మఠం వారంటే ఠాట్ వీల్లేదు 6 నే చేసుకోవాలి అదంతే అని మరో దేవస్తానం వారు హుకుం జారీ చెస్తారు...ఏరోజు జాగారం చేయాలో తెలీక ఇక ఏరోజైతే మన తెలుగు చానెళ్ళలో సినిమాలు వేస్తారో ఆరోజే శివరాత్రి అని ఆ పళ్ళు తింటూ ఆ సినిమాలు జల్సా కార్యక్రమాలూ చూసుకుంటూ శివ శివా అనుకుందాం.....

`

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Best CD Rates