Monday, January 11, 2010

చిన చేపను పెద చేపా..

 చిన చేపను పెద చేపా..

చిన చేపను పెద చేప..పెద చేపను పెను చేపా..
చిన మాయను పెద మాయ..పెద మాయను పెను మాయా.
చిన న్యూసును పెద న్యూసు..పెద న్యూసును పెను న్యూసుఇది సత్యం..ఇది తధ్యం...ఇది ఖర్మం...


మోహన్ బాబు ఇలా అన్నారు...?, గవర్నర్ గారి రాసలీలలు, రాజశేఖరుని హత్యలో రిలయెన్స్ హస్తం...లగడపాటి కిడ్నాప్...కే సీ ఆర్ పరిస్థితి విషమం..యూనివెర్సిటీ లో పోలీసుల దౌర్జన్యం...

ఏంటో అసలే దొరికింది దొరికినట్టు పగలగొట్టి..విరగ్గొట్టి..గొడవలు చేసి మంచి ఊపు మీదున్న వాళ్లకి
డెన్ గా ఖాళీ వచ్చే సరికి కొంచెం చికాగ్గా ఉన్నారు. ఏదో మీడియా దయ వల్ల రోజుకో దొమ్మీ, గొడవ, బద్దలు కొట్టే కార్యక్రమాలకి ఆటంకం లేకుండా జరిగిపోతోంది. 

మామూలుగా పండగలకి ఆఫీసులకి..స్కూళ్ళకి శెలవులిస్తారు. కానీ మన రాష్ట్రం లో (పేరు చెప్పడానికి భయంగా ఉంది) బందుల మధ్యలో ఆఫీసులు పనిచేస్తున్నాయి. ఏ క్రిస్మస్సో, సంక్రాంతో వస్తే..బందులకి శలవులిస్తున్నారు బడా నాయకులు.
పండక్కి..సినిమాల్లేవు..షికారులు లేవు..షాపింగు లేదు,,ట్రాన్స్పోర్ట్ లేదు..
ఎక్కడ చూసినా ఒకటే మాట ..పాట
బందే మాతరం..బందే మాతరం
తిడతాం కొడతాం..కనిపించిందల్లా పగలగొడతాం
కలిసుంటే కొడతాం..విడిపోతే తిడతాం అంటూ అబ్బో గందరగోళం.

సంక్రాంతి పండగొస్తోందంటే...సందడి గా ఉండే రోజులు పోయాయి.

విదేశీయులతో పోరాడినట్టు..స్వరాష్ట్రీయులతో పోరు అవసరం లేదుకదా..వాళ్ళూ మన భాయిలే కదా.పోరాటం ప్రభుత్వం తో....పక్క జిల్లాలవారితో కాదు.

సంక్రాంతి లక్స్మి కి ముగ్గుతో స్వాగతం...పలుకుదాం...ఆంధ్రప్రదేష్ ముగ్గు మీద...కాలేసి చెరపకుండా..
గంగిరెద్దుల్లా తలలాడించే అమాయక ప్రజలని మోసం చేసే రాజకీయ నాయకుల కుతంత్రాలకు మోసపోకుండా,...
వాళ్ళూ వాళ్ళూ కుమ్మక్కై మనల్ని గొబ్బెమ్మల్ని చేస్తున్నారన్న వాస్తవాల్ని తెలుసుకుందాం.
చరకా సోనియా చేతిలో..ఉన్నదని చెబుతూ ...గాలి పటాల్ల ఎగురుతూ ఏదో ఒక చెట్టుకు తగులుకునే అవకాశవాదుల  మాటలు నమ్మకుండా.
మనకి శుభం కలిగించే సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు...
 



నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

Thursday, January 7, 2010

గ్లాస్ బ్రేకింగ్ న్యూస్ - టీ వీ 2010

గ్లాస్ బ్రేకింగ్ న్యూస్ - టీ వీ 2010

2020 మ్యాచుల ఈ రోజుల్లో ప్రభుత్వము..పార్టీలు కలిసి కూడా మనతో అల్లాంటి ఆటలే ఆడుతున్నాయి.
ఎంచక్కా బియ్యం..ఆఫ్ సెంచరీ నాటవుట్
కందిపప్పు సెంచరీ నాటవుట్
ఇప్పుడే దిగిన బస్సు "యువరాజ్"లా ఎడా పెడా బాదుడు స్టార్టు..దెబ్బకి బంతి(మనం) ఎక్కడ పడతున్నామో కూడా తెలియట్లేదు.

ఒకప్పుడు..ఐదేళ్ళు ఉండే ప్రభుత్వాలు..ఈ మధ్య త్వరగా మారిపోతున్నాయి..ప్రస్తుతం..ప్రాంతాల కుమ్ములాటల్లో పని లేని వాళ్ళు కూడా చేరి..పని కోసం ఎదురుచూసే అభాగ్యులకు పని లేకుండా బంద్ చేస్తున్నారు. అసలు పోరాడేది ఎందుకో, ఎవరి కోసమో, ఎవరితో అన్నది అర్ధం కాక అమాయకులు దిక్కులు చూస్తున్నారు. ఏ నిరసనైనా ..ఏ గొడవైనా వెంటనే బలయ్యేది మాత్రం ఆర్ టీ సీ బస్సే..అదేంటో పాపం. పగిలిన/కాలిన బస్సులు చూసి చూసి ఎప్పుడో చిన్నప్పుడు రాసుకున్న కవిత
బస్సు ఆవేదన
 
సమయానికి గమ్యం చేర్చడం నాలక్ష్యం
కావాలని చెయ్యను ఏనాడూ ఆలస్యం

నింపుకుంటూ ట్యాంకు నిండా డీజిలు
చేస్తూ పోతా ప్రతి చోటా మజిలీలు

నే తడతాను ప్రతీ గ్రామం తలుపు
నిను తిరుగుతాను ప్రతీ చిన్న వూరి మలుపు

నే తట్టుకుంటా జడివానా వడగాలులని
నే కోరుకుంటా నా ప్రయాణికులంతా క్షేమంగా జేరాలని

కులమత బేధం, జాతి వివక్ష లేదు నాకు
అందరినీ సమంగా చూడడం లో లేదు సాటి నాకు

ఇంత చేసిన నేను ఎప్పుడైనా పది పైసలు పెంచమంటే

పగిలేను నా అద్దం
అది ఎనిమిది కుటుంబాల ప్రారబ్ధం
(ఒక బస్సు మీద ఎనిమిది కుటుంబాల జీవితం ఆధారపడుతుంది)


ఎక్కడో ఏదో జరిగితే చేస్తారు నా వళ్ళు హూనం
అది నీకూ నాకే కాదు యావజ్జాతికీ అవమానం

-------------
మా నాన్న గారు ఆర్ టీ సీ లో పని చేసి రిటైర్ అయినారు..న్యూస్ చానెల్ లో పగిలిన బస్సు చూసినప్పుడల్లా ఆయన కళ్ళలో కనిపించే నీటిపొర చూసి .. ఇది రాస్తున్నా...నా మీద కోపమొస్తే నన్ను తిట్టండి...మరో బస్సు మీద మీ ప్రతాపం చూపకండి.




REFRESH YOUR MINDS WITH
http://funcounter.info

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Best CD Rates