Thursday, February 26, 2009

స్లం ఓటర్ మిలియనీర్

స్లం ఓటర్ మిలియనీర్

అంటే స్లం లో ఉండే ఓటరు అమాంతంగా మిలియనీరు ఐపోతాడని కాదు..స్లం లో ఉన్న ఓటరులు కొన్ని మిలియనులు ఉన్నారని అర్ధం..ఎందుకంటే ఎన్నికలు దగ్గరకు రాగానే మన రాజకీయ నాయకులకు (వీళ్ళని ప్రజా నాయకులు అనలేము ఎందుకో ముందు ముందు చెబుతా)
వెంటనే స్లం ల మీద పడిపోతారు..సడెన్ గా వాళ్ళ కష్టాలు గుర్తొస్తాయి..వాళ్ల బాధలు కనపడతాయి..వాళ్ళకు ఇళ్ళు లేవని..పని దొరకట్లేదని..నీరు సరిగా అందదని గుర్తొస్తాయి..వెంటనే ఆయా స్లమ్ముల మీద దోమల్లా....ఈగల్లా..బొద్దింకల్లా వాలిపోతారు..అక్కడ ఉండే వాళ్ళలో వాళ్ళకి ఓట్లు కనిపిస్తాయి...కోట్ల ఆశలు కలిగిస్తాయి..ఇంక అంటే ప్రతిపక్షం వాళ్ళైతే పాలక పక్షం మీద విరుచుకుపడతారు.పాలక పక్షమైతే వీలైనన్ని వాళ్ళ పనులు చేసిపెట్టడమో...లేకపోతే మళ్ళీ అధికారంలోకి వస్తే చేస్తామని మాట ఇవ్వడమో చేసేస్తారు..ఇలా కొన సాగుతూ పోతుంది యవ్వారం....ఆస్కార్ అవార్డులు అసలు ఇవ్వాల్సింది వీళ్ళకేనేమో ? ఎందుకంటే

బెస్ట్ గ్రాఫికల్ ఫిల్మ్ అవార్డు....
నీటి ప్రాజెక్టుల గురించి తీసిన దాంట్లో వై ఎ "స్సారు" నడుచుకొస్తుంటే పచ్చని పైరు అలా పరుచుకుంటుంటుంది...అలానే సారు కనపడగానే నీటి ప్రవాహం తో డాము కళ కళ లాడుతుంది..సారు చెయ్యెత్తి కదిలిస్తుంటే అసేష ప్రజా వాహినీ పులకిస్తుంటుంది..కాబట్టి దిస్ అవార్డు గోస్ టొ దట్ ఫిల్ము...అంతే...

ఇక బెస్టు వాయస్ రికార్డింగు...
చంద్రబాబుని నల్లగా చూపిస్తూ సత్యపీఠం పేరుతో చెప్పిస్తున్న యాడ్ కి ఇవ్వాలేమో..

బెస్టు యానిమేషన్ ఫిల్ము

గుడ్డులోంచి పిల్ల బైటికొచ్చి ఎక్కిరించే యానిమేషను దానికి పోటీగా రుషి వచ్చి నక్కలుగా మార్చే యానిమేషను పోటీ పడుతున్నాయి రెండిటికీ టై పడింది..

బెస్టు అడాప్టెద్ స్క్రీన్ ప్లే

కౌన్ బనేగా కరోడ్ పతీ లాగా....ఇద్దరు కూర్చుని ప్రశ్న జవాబు కార్యకమంలో ప్రతిపక్షాన్ని రోడ్డుకీడ్చే సినిమా కి ఈ అవార్డు...

ఇలా చెప్పుకుంటూ పోతే అబ్బో చాలా అవార్డులు ఉన్నాయి....

ఇక ముందు ప్రజా నాయకుల గురించి చెబుతా నన్నాకదా..దాని గురించి చూద్దాం....నాకు ఎప్పుడూ ఒక డౌటు....

మనకి ఇంతకు పూర్వం ఉన్న నాయకుల్లో టంగుటూరి ప్రకాశం పంతులు గారు, పొట్టి శ్రీ రాములు గారు, జయప్రకాష్ నారాయణ్, ఎన్ జీ రంగా లాంటి వాళ్ళు పాపం రాజకీయం అంటే ఏమిటో తెలీక ప్రజలకి సేవ చేసి చేసి వాళ్ళ కుటుంబాలని పట్టించుకున్నారో లేదో తెలీదు ఎందుకంటే ఇప్పుడు వాళ్ల కుటుంబ సభ్యులు ఎక్కడ ఉన్నారో తెలీదు...నాకు తెలిసినంత వరకూ వాళ్లు రాజకీయం లో ఐతే లేరు...ఎక్కడా పేర్లూ వినిపించవు
కానీ ఇప్పటి రాజకీయ నాయకులని చూడండి..ఎంచక్కా వేల కోట్ల ప్రాజెక్టులు చేసుకుంటూ,.....సమాంతర ప్రభుత్వాన్ని నడుపుతూ....ఇండస్ట్రీలు నడుపుతూ...నేరాలు చేస్తూ...చేయిస్తూ....హత్యలూ...మానభంగాలు కేసుల్లో దోషులుగా......ఇలా చెప్పుకుంటూ పోతే చరిత్ర చించేస్తే చిరగదు....చెరిపేస్తే చెరగదు అని ముత్యాల ముగ్గు లో రావుగోపాలరావు డవిలాగు గుర్తొస్తోంది......
ఏది అమైనా

మానిఫెస్టొ చూడ బహు చక్క గుండు
ఎలెక్షనైన పిదప నేత చిక్కక తిరుగుచుండు
నాయకులందు..రాజకీయ నాయకులు..ప్రజా నాయకులు వేరయా
విశ్వదాభిరామ విలువ నెరిగి ఓటైరా వేమ

Sunday, February 15, 2009

ఎన్నికల వాతావరణ విశేషాలు

ఎన్నికల వాతావరణ విశేషాలు

వార్తలవగానే , వాతావరణ విశేషాలు వస్తుంటాయి...అలానే ఇకనుంచి ఎన్నికల వాతావరణ విశేషాలుంటే బాగుంటుంది అనిపించింది..ఎందుకంటే ఏ పూట ఎవరు ఎవరితో కలిసున్నారో తెలియట్లేదు కాబట్టి...ఒక వేళ ఆంధ్ర మాప్ లో మన నాయకుల సారీ రాజకీయ నాయకుల ఫొటోలు పెట్టి దానిముందు ఒక అమ్మాయి నుంచుని ఇలా చెబుతుంటే ఎలా ఉంటుందో ఒక సారి ఆలోచించండి........ట్రుయ్యాం ట్రుయ్యాం ట్రుయ్యాం ఖంగారు పడకండి గుండ్రాలు తిప్పుతున్నా అంటే మిమ్మల్ని ఇమాజినేషన్ లోకి తీసుకెళుతున్నా.....రెడీ...వన్ టూ త్రీ...

ఆంధ్ర ప్రదేశ్ మాప్ ముందు అమ్మాయి..

ఈరోజు ఎన్నికల వాతావరణం చాలా వేడిగా ఉంది.....అసెంబ్లీ వద్ద నలభై డిగ్రీలుగా ఉండగా..పత్రికా ప్రకటనల వద్ద..యాభై రెండు నమోదైంది...రోడ్ షోలు నిర్వహించే ప్రదేశాలలో కూడా ఈరోజు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి..చిరంజీవి రోడ్ షో వద్ద 56 డిగ్రీలు నమోదు కాగా బాలకృష్ణ రోడ్ షో వద్ద 57 నమోదైంది...తె రా సా నిర్వహించిన బాకా సభలో అన్నిటికన్నా అధికంగా 60 డిగ్రీలు నమోదైంది...

తెలంగాణాకు మేము వ్యతిరేకం కాము అని ముఖ్యమంత్రి ప్రకటించడంతో (సోనియా)గాంధీ భవన్ వద్ద కొంచెం చల్లని గాలులు వీస్తున్నాయి...

తెలుగు దేశం నుంచి కొందరు నాయకులు ప్రజా రాజ్యం లోకి మారడం తో ఎన్ టీ ఆర్ భవన్ వద్ద మూడో హెచ్చరిక పతాకం ఎగురవేయడం జరిగింది..ఆ యా నాయకులకు వలస వెళ్ళడం ప్రమాదకరమని పార్టీ నాయకులు సూచించారు..


నాయకుల చూపులు ప్రస్తుతం సీటుపవనాలు వైపూ చూస్తున్నాయి..సీటు ఎటు వుంటే అటు నాయకులు ప్రవహించే ప్రమాదం ఉండడంతో ప్రతీ ఒక్కరీ ఈ ఖరీఫ్(ఖరీదు) సీజన్ లో ఏదో ఒక రకంగా రాయితీలపై సీట్లు ఇస్తామని హామీ ఇస్తున్నట్టు తెలుస్తోంది...

రాబోయే నలభై ఎనిమిది గంటల్లో ఎం ఐ ఎం.,,,బీ జే పీ లు తమ గేట్లని ఎత్తనుండడంతో అంతటా ఉత్కంట నెలకొంది....

ఎవరు ఎన్ని వరాల వర్షాలు కురిపించినా , లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ఓటర్లు సారాలో మునిగిపోవడం ఖాయమని...వాగ్దానాలు నిజమౌతాయని నమ్మి వోట్లు నాటిన వారికి పైరు చేతికొస్తుందన్న(ప్రభుత్వం చెప్పిన పని చేస్తుందని ) నమ్మకం లేదని వాతావరణ కేంద్రం సూచిస్తోంది...

ఎన్నికలలోపల నాటిన వాటికి ఎలక్షన్ సమయంలో (వెద)జల్లే ఎరువులు ఉపయోగపడగలవని ముందు జాగ్రత్త పడమని వాతావరణ కేంద్రం హెచ్చరిస్తోంది...


ఎలా ఉంది వాతావరణ సూచన....

Friday, February 13, 2009

వేలంవెర్రిడే

వేలంవెర్రిడే
వేలంవెర్రిడేకి స్వాగతం..సుస్వాగతం..ప్రేమించుకోవడానికి ఒక రోజు..ప్రేమను తలుచుకోవడానికో..తెలుపుకోవడానికో..పంచుకోవడానికో..దేనికో అర్ధం కావట్లా..
అసలు ఈరోజు ఎందుకు పుట్టింది.
క్లాడియస్ అనే రాజు గారు సైనికుల్ని పెళ్ళి చేసుకోవద్దు అని ఆంక్ష పెడితే అది నచ్చని సైంట్ వేలంటైన్ అనే ప్రీస్టు ఎవరికీ తెలియకుండా పెళ్ళిళ్ళు జరిపించేవాడు..ఒక సారి పట్టుబడి ఉరి శిక్షకు గురి అయ్యాడు..జైల్లో ఉన్నప్పుడు జైలరు గారమ్మాయితో స్నేహం కుదిరి మంచి మాటలు చెబుతూ ఉండడం వల్ల మంచి మిత్రుడయ్యాడు చివరకి ఫిబ్రవరి 14న ఉరి తీయబడ్డాడు..ఉరితీతకు ముందు ఆ జైలరు గారమ్మాయికి పంపిన లేఖలో ప్రేమతో నీ వేలంటైన్ అని చివరిమాటగా వ్రాశాడు అందుకని ఆయన అంటే ఇష్టపడే వాళ్ళూ ఆయన వల్ల పెళ్ళి చేసుకున్న వాళ్ళు అందరూ ఆయన మీద గౌరవం కొద్దీ ఆరోజుని వేలంటైన్స్ డేగా జరుపుకోవడం రివాజుగా మారింది..ఇది నాకు తెలిసిన చరిత్ర....
అయితే అసలు ఆయన త్యాగానికి విలువ నిచ్చి జరుపుకుంటున్నారా ఈ ప్రేమికుల రోజుని..డేటు గుర్తుంది కదా అని జరుపుకుంటున్నారా అని అర్ధం కావట్లేదు..గులాబీలు, గ్రీటింగు కార్డులు, గిఫ్టులు లాంటివి ఇచ్చిపుచ్చుకోవడమేనా లేక భవిష్యత్తు గురించి ఆలోచన వుందా అన్నది అనుమానమే.. అమ్మా నాన్న లకి తెలియకుండా ఏదో ఒకటి చేసి అమ్మాయి అబ్బాయి కలిసి ...పార్కులకి,,హోటళ్ళకి, పబ్బులకి, సినిమాలకి షికార్లకి తిర్గడం...కాదు ప్రేమ అంటే..సైంట్ వేలంటైన్ కూడా ప్రేమించుకున్న వాళ్ళకి పెళ్ళి చేసాడు కానీ వదిలెయ్యలేదు తిరగమనలేదు...పెళ్ళి అనేది బాధ్యత ని గుర్తుచేస్తుంది..భవిష్యత్తుని నిర్దేసిస్తుంది...బంధాన్ని బలపరుస్తుంది...ఊరికే తిరిగి....తిరిగి..అలిగి..విసిగి...మధ్యలో మారిపోయే ప్రేమలు నిలబడవు...e-తరం అబ్బాయిలూ అమ్మాయిలూ ఒకరినొకరు ఏమి చూసి ఇష్టపడుతున్నారో..అది ప్రేమో ఇంకోటో సరిగ్గా తెలుసో లేదో అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే..చూడ్డానికి బాగున్నారనో..మంచి పని చేసారనో..బాగా మాట్లాడతారనో..మంచి చదువుందనో ..ఒకేఅ రకమైన టస్టు ఉందనో..ఇలా ఏదో ఒక క్వాలిటీ చూసి ప్రేమ అనుకునే ఒకరకమైన ఫీలింగులో పడి అది ఏమిటో తెలిసే లోపలే పెళ్ళీ,,,కొన్నాళ్ళకే అపార్ధాలూ అలకలు..లుక లుకలూ,..పెటాకులూ...
కావాలంటే పెళ్ళయ్యాక భార్య భర్తని>>>>భర్త భార్యని ప్రమించవచ్చు>>>ప్రస్తుతం అమ్మా నాన్నలని ప్రేమించండీ మీ చదువుని..లక్ష్యాన్ని ప్రేమించండి..సమాజాన్ని ప్రేమించండి...ఇంక ఓల్డేజి జోముల్లోకి వెళ్ళకపోతే మీ తాతా< అమ్మమ్మ< నానమ్మలని ప్రమించండి///దేశాన్ని ప్రేమించండి///ఆ తరువాత పెళ్ళి చేసుకోండి అప్పుడు ప్రతీ రోజూ ప్రేమికుల రోజే...సైంట్ వేలంటైంకి అదే నిజమైన నివాళి....

Monday, February 9, 2009

మిలియనీర్ స్లం డాగ్

మిలియనీర్ స్లం డాగ్
అసలే ఈ పేరు మీద రభస జరుగుతుంటే ఈ విషయం గూర్చి మాట్లాడాలంటే కొంచెం ఇదిగానే ఉంది కానీ ప్రస్తుతం జరిగే విషయాలు అల్లానే ఉన్నాయి
ఓకే మన స్లం డాగ్ మిలియనీరు గురించి మాట్లాడుకుందాం
మన ముందున్నారు మిలియనీరుగా ఉండి ప్రస్తుతం స్లం పొజిషన్ కి పడిపోయిన అసత్యం డ్రామ లింగరాజు గారు ...చెప్పండి డ్రామ రాజు గారు మీరు అసత్యం డ్రామ లింగ రాజు గా ఎలా మారారు
అంటే చిన్నప్పుడు 10 మార్కులు వస్తే 70 మార్కుల కింద మార్చి చూపించే వాణ్ణి..అలా పెంచి చూపించడం ఆ వయసులో అలవాటైంది...ఆ తరువాత రాంకులు బాంకు లు అని లేకుండా అన్నీ అలా పెంచడం అలవాటైంది..
చాలా కాలం క్రింద బిజినెస్ పెట్టా అప్పుడు లక్ష వస్తే పది లక్షలు అని చెప్పి ఐ టీ కట్టే వాణ్ణీ దాంతో బాంకుల్లో లోన్లు పుట్టేవి..వాటితో మరిన్ని బిజినెస్సులు పెట్టా..మానాన్న గారి పేరుమీద ఒకటి..నా పేరు మీద ఒకటి ..మా అబ్బాయి పేరు మీద ఒకటి ఇలా పెంచుకుంటూ పోయా..ఐతే దానిలోది దీనికీ దీనిలోనిది దానికీ వాడడం వల్ల ఎందులో ఎంత సొమ్ము పెట్టానో నాకే అర్ధం కానంత కంఫ్యూజన్ అయింది...సొమ్ములైతే ఎక్కడ ఎలాగోలా ఏదో ఒకటి చెయ్యొచ్చు...ప్రాజెక్టులు అలా కాదు కదా అందుకే ఎలాగూ తెలుస్తుందని నేనే చెప్పేశా...ప్రస్తుతం సీ బీ ఐ కి లెక్కలు చెబుతున్నా....
సాధారణం గా ఇలాటివి జరిగినప్పుడు గుండె నొప్పి లేదా ఇంకోటి ఏదైనా వచ్చి నింసు లాంటి చోట చేరతారు కదా ఇక్కడ అలా జరగలేదేమిటి,
అంటే ఇక్కడ నేను తప్పించుకోవాలీ..లేదా లెక్కలు మార్చాలీ అంటే ఆ పని చెయ్యాలి..నాకు ఆ అవసరం లేదు ..పైగా నేను బయటకి వచ్చి ఏ పత్రికకో పేపరుకో టీ వీ కో ఏమీనా చెప్తే చాలామందికి గుండెనొప్పి వచ్చే ప్రమాదం ఉంది అందుకే నాకు గుండె నొప్పి రాలేదు..
మీ ఎంప్లాయీస్ పరిస్థితి ఏంటి?
అందరూ తక్కువ జీతాలిచ్చే టైములో ఎక్కువిచ్చాం కాబట్టి ఇప్పుడు తగ్గినా..ఇవ్వకపోయినా చెల్లుతుంది...అంతే కాదు ప్రాజెక్టులు లేకపోయినా పని చేసినంత బిల్డప్ ఇచ్చరుకదా అందుకు ఇప్పుడు అనుభవిస్తారు..ఐనా ఏమి పరవాలేదు కాల్ సెంటరు వాళ్ళె ఎస్టీడీ బూతులు ఎట్టుకుంటారు..జావా స్పెషలిస్టులు స్క్రిప్టులు రాసుకుంటారు ఇలా ఎవరికొచ్చిన పని వాళ్ళు చేసుకుంటారు..హై టెక్కు ఉద్యోగాలంటే నే అంత కదా..మాదా పూరు జనాలు మళ్ళీ వాళ్ళ ఊర్లెళతారు అంతే..

Sunday, February 1, 2009

annamayya laksha gala sankeertanaarchana

please convey this message to as many people as u can to make this event a great success.
may lord venkateswara bless u


Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Best CD Rates