Wednesday, September 29, 2010

ఇంజినీరింగ్ సీట్లమ్మా






 ఇంజినీరింగ్ సీట్లమ్మా ..ఇంజినీరింగ్ సీట్లున్నాయి.. మెకానికల్, ఎలెక్ట్రానిక్స్,కంప్యూటర్ సైన్సు..ఏ గ్రూప్ కావాలన్నా ఉన్నాయ్..ఏ కోటాలో కావాలన్నా ఉన్నాయి..రాంక్ తక్కువొచ్చినా ఇస్తాం...ఎక్కువొచ్చినా ఇస్తాం..రాంక్ రాకపోతే ట్రైనింగ్ ఇచ్చి మరీ ఇస్తాం..
 కొన్నాళ్లైతే ఇలాటి అరుపులు వినాల్సి వస్తుందేమో అని డౌట్ గా ఉంది.. కాలేజీలు ఎక్కువైపోయి..సీట్లు మిగిలిపోతున్నాయట..ఏటా ఎంతమంది ఇంజనీర్లు.డక్తర్లు బయటకొస్తున్నారో గాని..ఇంకా చాలా మంది రావడానికి వీలుగా ఉన్నాయి కాలేజీలు..ఐతే..అంతమంది స్టూడెంట్స్ లేరని వినికిడి..



నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark
Enhanced by Zemanta

Tuesday, September 28, 2010

ఊడ్చు మిషిన్

 ఊడ్చు మిషిన్



రోడ్లూడ్చు మిషిన్  లు వచ్చాయని రోడ్లు అద్దాల్ల మెరిసిపోతాయని ఓ మురిచిపోయారు.
అవి మునిసిపాలిటీ నిధులు ఊడ్చే మిషిన్ లే కానీ... రోడ్లు ఊడ్చేవి కావని తేలిపోయింది

చెత్తని కిందా మీదా కాకుండా డస్ట్ బిన్ను లో వేసే విదేశాల్లోనో,
మంచు కురిసిన రోడ్ల మీదైతే  ఇవి పని చేస్తాయేమో కానీ ఎక్కడ పడితే అక్కడ చెత్త వేసే మనం తిరిగే ఈ రోడ్ల మీద, ఎప్పుడూ గుంటలు పడి, రాళ్ళు తేలే మన రహదారులపైనా ఇవి ఎంతవరకు పనితనం చూపిస్తాయో ఆ భగవంతుడికే తెలియాలి.
కాంట్రాక్టరులు కొట్టేసే కమీషన్ లు పోయినా అర్ధరాత్రి నుంచీ తెల్లవారు ఝాము వరకూ రోడ్లూడ్చే వారి కడుపుకొట్టి ఎవరికో దోచిపెట్టే ఈ కొత్త మిషిన్ల కొనుగూలులో ఏదో మతలబు..
ఖచ్చితంగా స్కాములు జరిగి నిధులు ఊడవడానికి ఎంతో ఆస్కారమున్నట్టుగా ....

భవధీయుడి అనుమానం.



నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

Saturday, September 25, 2010

ఆదివారం..

 ఆదివారం..
లేటుగా లేచి...ఫూటుగా లాగించి....ఏం చెయ్యాలా అని ఆలోచించి....సాయంత్రం దాకా చించి చించి....  కాసేపు నిద్రించి..టైం వేస్ట్ ఐందని నిందించి...భోంచేసి..పడకేసి...మళ్ళీ మామూలుగా..మూలుగుతూ "మండే " పనికి.......




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

కామన్ వెల్త్ గేంస్

 కామన్ వెల్త్ గేంస్

ఢిల్లీలో ఏ గల్లీలో చూసినా ఇప్పుడు ఒకటే చర్చ.. రచ్చ..కామన్ వెల్త్ గేంస్ . వరల్డ్ కప్ క్రికెట్ కి ఇప్పట్నుంచే కౌంట్ డౌన్ లు.. రక రకాల చానెల్స్ లో యాడ్లు.. హడావిడి గా ఉంది యవ్వారం.

ప్రపంచ దేశాలు పాల్గొనే ప్రతిష్టాత్మక మైన ఆటలు గురించి..మాటలే కానీ పని-పాటలు సరిగా లేవని చాలమంది..అలిగి..తొలిగారని..ఓ భోగట్టా. మనకివి 'కామన్ ' అనీ.. ఐన ' కొందరికి 'వెల్త్  ' పెంచుకునేందుకే ఈ ఆటలనీ... పొలిటికల్ 'గేంస్ ' అనీ గుసగుసలు కూడా వినవస్తున్నాయి.

భారతీయ సినిమాకి ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ గెలిచేసిన రహ్మాన్ అనిదించిన సంగీతం కూడా పాశ్చాత్య ధోరణి..రణగొణ ధ్వనులతో ఉందని..వూవూ జలా తో వూది మరీ చెబుతున్నారు..జనాలు.

డోపుల్లో దొరికే తోపులు..కూలిపోయే బ్రిడ్జిలు..సగం పూర్తైన స్టేడియాలు..తో స్వాగతం పలుకుతున్నాం. ఎందుకంటే

లేట్  చేయడం  మనకి కామన్.. పెద్దల వెల్త్ బాగుపడడం ఖాయం...పొలిటికల్ గేంస్ లో మనదే విజయం..
 






నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

మొక్కు

 మొక్కు


మొక్క లేదా ..


ఐతే ఏ దేవుడు వరమిస్తాడు..?


అడగందే అమ్మైనా పెట్టదు
అడిగినా ప్రభుత్వానికి పట్టదు


పుట్టినపుడేసిన ఉయ్యాల నుంచ్చీ ఆఖర్న కాల్చే కట్టెదాక


చదువిచ్చిన పుస్తకం - నిదురిచ్చిన మంచం
పెళ్లి చేసిన మంటపం
వంట చేసే మంట నిచ్చిన అగ్గిపుల్ల
 తినే తిండి - ఉందే ఇల్లు - వాడే వస్తువులన్నీ


ఆ మొక్క వర ప్రసాదాలే


మరి నీ ఇంట మొక్క ఉందా ?


మొక్క లేదా .... ఐతే ఏ దేవుడు వరమిస్తాడు..







నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

Tuesday, September 21, 2010

అయ్యోధ్య

అయ్యోధ్య

రాముల వారు వేటకి వెళ్లినపుడు ఆయన వేసిన బాణం ఓ చిలుక కి తగిలిందట .. ఆ చిలుక ని చేతిలోకి తీసుకుని ఏమ్మా బాణం తగిలినప్పుడు అరవలేదే అన్నాడట.. అప్పుడు ఆ చిలుక -- ఏమని అరవను స్వామీ.. నాకేదైన కష్టం వస్తే..బధ కలిగితే రామా అని నీతో చెప్పుకునే దాన్ని...ఇప్పుడు నువ్వే బాణం వేస్తే నేనెవరికి చెప్పుకోనూ అంటూ ప్రాణం వదిలిందిట అందుకే అప్పటి నుంచి దానిని 'రామ చిలుక ' అన్నారట.. ఇప్పుడు పరిస్థితి అలానే ఉంది..అందరి కష్టం తీర్చే ఆ రాముడికే కష్టం వచ్చింది.. మరి ఆయన ఎవరితో చెప్పుకోవాలో.. ఎవరి పాలన ఐనా రామరాజ్యం లా ఉండాలి అంటుంటారు..మరి ఈ రాజ్యం లో రాముడి స్థానమేంటి ? అయోధ్య రామ జన్మ భూమా ? కాదా ? 
రేపో మాపో తీర్పు వస్తుందిట అయోధ్య గురించి.. తీర్పు ఏం వస్తుందో తెలీదు కాని ..తీర్పు వచ్చిన తరువాత ఏం జరుగుతుందో మాత్రం చెప్పేయ్యచ్చు. ఒకళ్లకి నచ్చిన తీర్పు వస్తే మరొకరు. హింసకు దిగుతారు..మరో కోర్టులో అపీల్ చేస్తారు. గొడవలూ జరుగుతాయి..ఆ విషయం మీద అసెంబ్లీలలో పార్లమెంటులో రభస జరిగి సభలు వాయిదాలు పడతాయి. ఇరువర్గాల మధ్య సయోధ్య లేనంతకాలం అయోధ్య భవిష్యత్తు మిధ్యే..

రాముడు బీజేపీ వాళ్ళకి మాత్రమే దేవుడో..వాళ్ళకి మాత్రమే హక్కు ఉందో తెలీదు కానీ కష్టం వచ్చినప్పుడే దేవుడు గుర్తొచ్చినట్టు... ఎలెక్షన్ వచ్చినప్పుడు మాత్రమే గుర్తెందుకొస్తాడో తెలీదు, కమలం రాత్రిపూట మాత్రమే వికసిస్తుంది..వీళ్ళూ అంతే ఎన్నికలప్పుడే వినిపిస్తారు-కనిపిస్తారు. పాపం సాధువులు, సన్యాసులు, మత ప్రచారకులు, వీళ్ళు రాముడి కోసం పోరాడుతున్నారో రాజకీయంలో పావులౌతున్నారో మరి వారి దివ్య దృష్టికే తెలియాలి. ఎందుకంటే.. కల్పాల కాలం కన్నా ముందు..3 యుగాల క్రితం జరిగిన రామాయణం తరువాత వచ్చిన ప్రళయాలతో నిజమైన ప్రదేశాలు ఎక్కడున్నాయో ? ఆలోచించాల్సిన ఒక ప్రశ్న ? త్రేతా యుగం - ద్వాపర యుగం దాటినాక కదా కలి యుగం వచ్చేది.

భారతీయులు అందునా హిందువులు శాంతికాముకులు - మన ఇంటికో - మనకో ప్రాబ్లెం వస్తే తప్ప పక్కవాడేమై పోయినా పట్టించుకోడు. చిన్ని నా పొట్టకు శ్రీ రామ రక్ష అన్నట్టు..జీవించేస్తుంటారు.
రాముడు మా గుండెల్లో నే ఉన్నాడు..కాబట్టి మేమిక్కడే పూజించుకుంటామంటారు.

రోడ్డు వైడెనింగు కోసం అడ్డమున్న హిందూ ఆలయాలనైతె పక్కన పెట్టేస్తుంది కాని.. మరో ప్రార్ధనాలయమో..సమాధో ఉంటే మాత్రం  ప్రభుత్వమే టచ్ మీ నాట్ అన్నట్టు వ్యవహరిస్తుంది..మరి ఇంత పెద్ద విషయాన్ని ప్రభుత్వం ఏం చేస్తుందో..80 శాతం పైగా ఉన్న హిందువుల మనోభావాలు-నమ్మకం-భక్తి-చర్త్ర కన్నా వాళ్ళకి ఓట్లే ముఖ్యం. అణు బిల్లు కోసం ఎవరితోనైనా పోరాడతాం కానీ మహిళా బిల్లుకో-ఈ అయోధ్య విషయానికో అంటే వాళ్ళ దగ్గర టైం లేదు మరి( ఇప్పట్లో ఎలక్షన్లు లేవు కదా!)

ఫలానా రామ సేతు ఉంది..అని..ద్వారక సముద్రంలో కనిపిస్తోందని.ఏ నాసా వాడో చెప్తే నమ్ముతాం కానీ.. ఎవరు నస పెడితే మాత్రం నమ్ముతామా..ఇక్కడ కూడా వాళ్ళే కనుక్కుని చెప్పాలేమో.. లేకపోతే టైం మిషన్ లో వెనక్కి వెళ్ళి..ఆ రాముణ్ణే ఇంకెక్కడో పుట్టమని చెప్పాలి. బాబర్ కి చెప్పలేం కదా.. 

చూద్దాం శ్రీ రామ రక్ష సర్వ జగద్రక్ష..





 





నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

Saturday, September 18, 2010

అవతార పురుషులు - రాజకీయ నాయకులు

భూకబ్జా చేసి న హిరణ్యాక్షుడు---సీతమ్మవారిని కిడ్నాప్ చేసిన రావణుడు..పక్కవాడి రాజ్యం లాగేసుకునే దుర్యోధనుడూ.. వీళ్లందరి రాక్ష గుణాలు కలగలసిన రాక్షస గణాలు ప్రస్తుత రాజకీయ నాయకులు....

"రా " క్షసత్వంతో
  జ " నాలకి "
  కీ " డుకలిగించే
"యం " త్రాంగం   అని ఎప్పుడో పరుచూరి బ్రదర్స్ అన్నారు. 




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి
Share/Save/Bookmark

Saturday, September 11, 2010

గ్రీన్ గణేశా

సున్ని పిండి తో తయారైన చిన్నారి బాలకుడు
తల్లి మాట కోసం తండ్రి పై దండెత్తిన గడసరి పాలకుడు
మూషిక వాహనం పై వెడలిన గజముఖుడు
విఘ్నాల తొలగించే సకల గణ నాయకుడు
మట్టి ప్రతిమలో ఇమిడిపోయే కొండంత  దేవుడు
పత్రి పూజ తో ఫలమందించే వినాయకుడు

గ్రీన్ గణేశా అనే నినాదం తో సైకత శిల్పి సుదర్షన్ పట్నాయక్ చిత్రించిన సైకత గణపతి...

పే రెంట్స్ :




పే రెంట్స్ :
చదువు"కొనె" ఈ రొజుల్లో ర్యాంక్  ల కోసం బ్యాంక్ బ్యాలెన్స్  లు కరగబెట్టుకుంటున్న నేటి పేరెంట్స్ ,,,,they pay rents for their children education
మొన్న నే  అమ్మాయికి 10 వేల డొనేషన్ తో LKG లొ చేర్చిన ఓ తండ్రి ఆవేదన,,లోంచి వచ్చే ఆక్రందన,,   



ప్రస్తుతం,,lkg  నుంచె "బరువు" బాధ్యతలు పెరిగిపొతున్నై....కేజీల బరువున్న పుస్తకాలు..మూడో క్లాసు నుంచే కంప్యూటర్ పాఠాలు..కలలు రాకపోయినా కళ్ళజోడు ఖాయం..e-chaduvulaki 


  



నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/Bookmark

Friday, September 10, 2010

గన్ పతి - 2

గన్ పతి - 2



పరమ శివుడు ఇచ్చిన గన్ను..పార్వతీ దేవి ఇచ్చిన దన్ను కొండంత అండగా....తన వాహనమైన మూషికం మీద భూలోకం బయలుదేరాడు వినాయకుడు...



మూషికా ..ఇంకా భూలోక విషయాలు ఏమిటి?



ఏమి చెప్పమందువు స్వామీ...పూర్వం ప్రతి ఇంట కొలువై..బియ్యం పప్పులు,,ఏవి దొరికితే అవి తిని హాయిగా ఉండేవాళ్ళం..ఇప్పుడు పెరిగిన సాంకేతిక నైపుణ్యాల వల్ల.మా కొరకు బోనులని,,,పిల్లులుని, ఏకంగా రక రకాల విష పదార్ధాలని తయారు చేసి మమ్మల్ని మట్టు పెడుతున్నారు..కొన్ని చోట్ల ఐతే మాకోసం తయారు చేసిన విష పదార్ధాలను..ఋణ బాధలు భరించలేని రైతన్నలు ప్రాణాలు తీసుకోవడానికి ఉపయోగించుకుంటున్నారు.. ఆ పాపం మాకు తగులుతుందేమోనని భయంతో ప్రాణ రూపం వదిలి..ప్రాణం లేని వస్తు రూపం పొంది..ప్రతి ఇంటా బయటా కంప్యూటర్ అనే యంత్రం మునే మీరుగా భావించి..మౌస్ రూపంలో బతుకీడుస్తున్నాము.....తండ్రీ....



మూషికా బాధ పడకు..అదంతా కలి ప్రభావము... అదిగో భూలోకం దగ్గరకొచ్చింది...అదిఓ భాగ్యనగరం..మాకు అత్యంత ప్రియమైన నగరం..



అవును స్వామీ ప్రస్తుతం భాగ్యనగరం చాలా 'ప్రియమైన ' నగరం..!



అదేమి మూషికా..నీ భావం ,మాకర్ధం కాలేదు..స్వామీ భాగ్యనగరం ప్రస్తుతం మహానగరం గా గుర్తింపు పొదింది..అందుకే అక్కడ ప్రతీ దానీ ధరలు పెరిగి ప్రస్తుతం ప్రియమైననగరంగా గుర్తింపు తెచ్చుకుంది..అంతర్జాతీయ విమానాశ్రయాలూ, ఇంకా వివిధ అంతర్జాతీయ ప్రాజెక్టులు, సాఫ్ట్ వేర్ కంపెనీలు రాక వల్ల భూమి విలువ పెరిగి బాగ ప్రియమైంది స్వామీ భాగ్యనగరం.



మరి బాగా సంపాదిస్తున్నారుగా ప్రజలు హాయిగా ఉన్నారా ? మా మీద భక్తి ప్రపత్తులు పెరిగాయా....
ఎక్కడ స్వామీ..వారికి అంత తీరికేదీ ? వూరు చివర ఉద్యోగాలు..దారి అంతా ట్రాఫిక్ జాములు, కాలుష్యం, రేషన్ కోసం పడిగాపులు, నీటికోసం ఎదురుచూపులు, పిల్లల చదువు కొనుగోలూ, ఇలా బాధలు అధికమై తీరిక ఏదీ మీ గురించి పట్టించుకోవడానికీ ?అదిగో స్వామీ భాగ్యనగరం వచ్చేసాం..జాగ్రత్త స్వామి?



ఇంతలో రవీంద్రభారతి కూడలి దగ్గర పోలీసు ఆపాడు స్వామిని..



ఎమయ్యా ! ఆగాగు.. ఏమిటి రెడ్ సిగ్నల్ జంప్ చేస్తున్నావ్..ఏమిటి అంత స్పీడు ? హెల్మెట్ట్ ఏది ?
హెల్మెట్టా ? అనగా నేమి..



శిరస్త్రాణం .స్వామీ (ఎలుక చెప్పింది)ఇదిగో ఉందిగా...కిరీటం చూపించి అమాయకంగా చెప్పడు స్వామి.



పోలీసు : అన్నట్టు సీట్ బెల్ట్ ఏది ?



గణపతి : అది ఎందులకు



పోలీసు.: నువ్వు వెళ్తుంది ఫోర్ వీలర్ మీద..అంటే ఇదిగో నాలుగు కాళ్ళున్నాయిగా అందుకు..అంటూ ఎలుక నాలుగు కాళ్ళు చూపించాడు



గణపతి: వీడి అసాధ్యం కూలా.ఇప్పుడేమి దారి మూషికామూషికుడు : స్వామి తమ జంధ్యం చూపండి నాగులే కాబట్టి నల్లగా ఉండి బెల్ట్ అనుకుంటాడు అన్నట్టు మీ బెల్ట్ కూడా నాగులే కదా దెబ్బకి వొదులుతుంది వాడి తిక్క..



గణపతి చూపించిన జంధ్యం చూసి పోలీసు మూర్చిల్లగా...."బతుకు దేవుడా" అనుకుంటూ బయట పడ్డారు..మూషిక, వినాయకులు...



లకడీ కపూల్ మీదుగా ఖైరతా బాదులోని తన భారీ విగ్రహం చూద్దమని వెళ్తున్న స్వామికి అక్కడి ట్రాఫిక్ జాం చూసి మూర్చ వచ్చినంత పనైంది...చిన్న సందు దొరికితే ఇరికించేసే ఆటోలూ, అదే పనిగా హారన్ కొడుతూ రొద చేశే కార్లు...విపరీతమైన జనంతో నిండు గర్భిణిలా తెగ పొగ వుదులుతూ..ముక్కుతూ మూలుగుతూ కదులుతున్న ఆర్టీచీ బస్సులు, ఆంబులెన్స్ కి కూడా సైడు ఇవ్వకుండా..ఆగిన ట్రాఫిక్ లో ఇరుక్కున్న స్వామికి రెండున్నర గంటల తరువాత కానీ ఖైరతాబాదు జేరలేక పోయాడు... హు మానవుడికి పాప్ పరిహారం కోసం మళ్ళీ నరకం అవసరం లేదనుకుంటా..ఆ యముడు పెట్టే బాధల కన్నా ఈ బాధలు తక్కువేమీ కాదు..మరణించిన తరువాత కంటే మరణానికి ముందే అన్ని శిక్షలు ఇక్కడే అనుభవిస్తున్నాడు పాపం మానవుడు..



స్వామి భావం పసిగట్టిన మూషికం ..మరీ అల ఫిక్స్ ఐపోకండి స్వామీ..ఇంకా చాలా చూడాలి తమరు ఈ పది రోజుల్లో..అంటుండంగానే రైలు గేటు పడింది...మరలా ఆగింది మూషికం..



రైలు కోసం ఆగిన కొన్ని చిన్న వాహనాలు..గేటు కింద నుంచీ దాటుకుని వెళ్తున్నారు..కనుచూపు మేరలోనే రైలున్నా ఒక్క నిమిషంలో నే అది వెళ్ళిపోతుందని తెలిసినా వాళ్ళు చేసే ఆ పని చూసి స్వామ్మికే భయం వేసింది.



ఇంతలో కాలిమీద ఏదో తడి..చూస్తే తన పారాణికన్నా ఎర్రగా మరో డిజైను...అది ఏమా అనుకుంటుండగా..సారీ బాస్ చూసుకోలేదు......అంటూ మరికొంచెం పక్కగా ఊసాడు తన నోట్లోని పాను పరాగ్ ని తన సరాగానికి మురిసిపోతూ... oka maanavuDu



హా! హతవిధీ !! అనుకుంటుండగా ముక్కులదిరే వాసన...అది ఏమి వాసనో స్వామి పొడవాటి ముక్కు కూ అర్ధం కాలేదు..అన్ని వైపులా ఆ వాసన తప్పీంచుకోవడానికి తన తొండాన్ని తిప్పే ప్రయత్నం చేశారు స్వామి....ఎటు తిప్పినా ఏదో ఒకీ వాసన తొండాన్ని తాకుతోంది..మొదటి సారిగా తొండం అంత పొడవుగా ఉన్నందుకు బాధ కలిగింది స్వామికి.....మూషికుడు ఇది పసిగట్టి ..స్వామీ అది ఆ పక్కనుంచి వస్తున్న మూత్ర శాల వాసన..ఈటుపక్కనుంచీ వస్తున్న చైనీసు నూడుల్స్ మసాలా ఘాటు..ఇటు ఆ కోడి మాంసపు దుకాణపు వాసన...అదిగో అక్కడ పొంగి పొర్లుతున్న డ్రైనేజీవనది నుంచి వచ్చే వసన..ఆ పక్కన ఉన్న కుళ్ళిన పళ్ళ వాసనతో కలిసి వస్తున్న కంపు స్వామీ మనం ఈ ప్రాంతం దాటినా ఆ వాసన మనల్ని వదలదు స్వామీ అన్నాడు...
ఆ వాసనలకి కళ్ళు బైర్లు కమ్మిన స్వామి ..మూషికా చీమూ- రక్తం కలిసిన వైతరిణి దాటడం అయినా సులభమేమో కానీ..ఈ భాగ్ య(మ)నగరం లో రహదారి దాటడం చాలా కష్టం,....ఏదో నవరాత్రులు పూజ చేసినారన్న ఆనందంలో కాలుష్య మయమైన టాంకు బండులో ముంచినా భరిస్తున్నా కానీ ఈ భాగ్యమ నగరంలో జీవించడం మనుష్యుల వల్లే కానీ ఇ దేవతల వల్ల కాదు..పద మన భారీ విగ్రహం దగ్గర జనాలని ఆసీర్వదించి మనమూ టాంకు బండు వద్ద వేచి వుందాం ఎలాగు నిమజ్జనం రోజున భక్తజనం వస్తారు కాబట్టి అక్కడనే ఆ ఆనందం పొందుదాం...అంటూ ముందుకు కదిలాడు స్వామి..




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/Bookmark

'గన్'పతి

'గన్'పతి

వినాయక చవితి శుభాకాంక్షలతో


'గన్'పతి



అది కైలాసం....శివుడి మెళ్ళో పాము ఆకలిగా ఉండి ప్రసాదం కోసం చూస్తోంది..ఈలోగా వచ్చిన వినాయకుడి ఎలుక...ఏం మామా భోజనం అయిందా అంటూ పలకరించింది...ఇంకా లేదు...స్వామి తిన్నాకే నాకు..ఆయనకి భోజనం అదీ అక్కర్లేదు...నీ భోజనం అయిందా అంది...దానికి ఎలుక మా స్వామి దగ్గర ఆ ప్రాబ్లం లేదు..ఆయన కి ఆహారం ఇష్టం. అందుకే నాకు ఫుడ్డు కి కొదవ లేదు...అదిగో మాటల్లోనే మా స్వామి వస్తున్నాడు అంది వినాయకుడు రావడం చూసి,,,,,
వినాయకుడు వస్తూనే..తల్లికి, తండ్రికి నమస్కరించి..అమ్మా వినాయక చవితి వస్తోంది..నేను అలా భూలోకం వెళ్ళి ఓ పది రోజులు ఉండొస్తానమ్మా..అన్నాడు..దానికి పతి సేవలో ఉన్న ఆ పార్వతి ఉలిక్కి పడి..నాయనా వినాయకా..ప్రతి సంవత్సరం వెళ్తూనే వున్నావు కద నాయనా..ఈసారికి వద్దులే...నీ పుట్టిన రోజు ఇక్కడే కైలాసంలో జరుపుకుందాం..నువ్వు ఎక్కడికీ వెళ్ళకు అని కంటనీరు పెట్టుకుంది...
దానికి పశుపతి ..అదేమి పార్వతీ అలా అంటావు...విఘ్నేశ్వరుడు ప్రతి సంవత్సరమూ..తన జన్మదినము భూలోకమునే కదా జరుపుకుంటాడు...మరి ఈ సారి వద్దనెదవేమి.? మరీ అంత దిగులుగా ఉంటే మనమూ వెళ్ళివద్దాం...అన్నాడు శివుడు....
తల్లి ప్రేమ మీకేమి అర్ధం అవుతుంది లేండి...నా కుమారుడు ఏమన్నా రాక్షసులతో యుద్ధానికి వెళతానన్నాడా..లేక తపస్సుకు వెళతానన్నాడు... వెంటనే పంపడానికి..వెళ్ళేది భూలోకానికి..అందుకే నా దిగులు...అంది పార్వతి...
అదేమి పార్వతీ అంత మాట అంటివి..భూలోకమున అందరూ మన భక్తులేగా...పైగా ప్రతి సంవత్సరం మన కుమారుడి జన్మదినాన్ని అత్యంత వైభవంగా ఊరూరా.... వాడ వాడల జరుపుకుంటారు కూడాను...తిరుపతి లడ్డు వలే మన కుమారుడు ధరించిన లడ్డుకు వేలం పెట్టి - వెల కట్టి మరీ వైభోగాలు జరుపుతారు....
ఏమి చెప్పను స్వామీ..మనవాడి పుట్టిన రోజు జరుపుతామని బలవంతంగా డబ్బులు లాగుతారు కొందరు...ఆ డబ్బుతో అడ్డమైన పనులూ చేస్తారు...కొందరైతే పందిరి వేసి మన కుమారుడి విగ్రహం పెట్టి పూజలు చేసి...అక్కడే సాం'స్క్రుతక' కార్యక్రమాలు జరుపుతారు...అవి ఎంత క్రుతకంగా ఉంటాయో..మనకి అంతుపట్టదు....'అ' అంటే 'అమ్మ', 'ఆ' అంటే 'ఆవు' లు పోయి... అ అంటే అమలా పురం..ఆ అంటే ఆహా పురం అని, ఆకలేస్తే అన్నం పెడతా అంటూ అర్ధం లేని పాటలు..అర్ధనగ్నపు ఆటలు ఆడతారు,,,,ఇవే కాక రాత్రి కాపలా అని చేసే కార్యకలాపాల చిట్టా నేను చెప్పలేను...చతుర్ముఖ పారాయణం..తీర్ధం....ప్రసాదం పేరుతో పేకాట..మందు..ఇంకా సర్వ పాపాలకూ ఒడిగడతారు...నిజంగా నిష్టగా చేసేవారూ లేకపోలేదు..కానీ ఇలాంటి వారు చేసే పాపం మన వాడికి తగులుతుందేమోనని నా భయం..
దేవీ మానవులు చేసే పాప పుణ్యాలకు - మనకు సంబంధం లేదు...వారి పాపం వారికే తగులుతుంది..నువ్వు భయపడనవసరంలేదు..అని వూరడించాడు పరమేశ్వరుడు...
స్వామీ నా అసలు భయం అది కాదు..స్వామీ....భూలోకమున తీవ్రవాదుల భయం ఎక్కువ అయింది...ఎక్కడ పడితే అక్కడ బాంబులు పెడుతున్నారు...అహార స్థలాలు..విహార స్థలాలు ..అని లేకుండా ఎక్కడపడితే అక్కడ బాంబులు పేలుస్తున్నారు..అంతే కాదు ప్రతిసారి విగ్రహ నిమజ్జనం లో ఏదో జరుగుతుందని వినడం రివాజుగా మారింది....ఆ హుస్సేను సాగరంలో నీరు ఇప్పటికే విషతుల్యం అయింది....ఇలా చాలా భయాలున్నాయి స్వామీ...అంది పార్వతి
పార్వతీ ఎందుకు నీకు భయము?...ఆ తీవ్ర వాదులు పూర్వ జన్మలో రావణ..దుర్యోధనాది రాక్షసుల బంటులు..వారి వారి కర్మ ననుసరించి ఇలా జన్మించి పూర్వ జన్మ వాసనల వల్ల 'కలి' ప్రేరేపితులై అలా ప్రవర్తించుచున్నారు...వారి సమయం ఆసన్నమైనప్పుడు వారి పాపం 'వారిని' కూడా బాంబు రూపమునో, ఎన్ కౌంటర్ రూపమునో వారిని దహించివేస్తుంది..ఇక మన కుమారుడి విషయం అంటావా..అతను పుట్టుకతోనే మ్రుత్యుంజయుడు..నా చేతిలో మరణించి..తిరిగి జన్మ పొందినవాడు...అంతే కాదు చంద్రుడి ద్రుష్టి తగిలి ఉదరం పగిలినా తిరిగి మామూలుగా అయిన మన బిడ్డడు...మూషికాసురుడిని ఒక దంతంతో అణిచి వాహనం చేసుకున్నవాడు...గణాధిపత్యం వహిస్తూ విఘ్నాలకు నాయకుడైనవాడు..అట్టి కుమారుడి గూర్చి ఎట్టి చింతా వలదు..
స్వామీ నా భయము మన కుమారుడి గూర్చి కాదు స్వామి! వినాయకుడి పూజ కోసం తాపత్రయ పడే భక్త జనం గూర్చి...కుమారుడి పట్ల భక్తి పారవస్యం లో, ఆ తీవ్రవాదుల పన్నిన కుట్రకు గురి అవుదురేమో అని నా భయం స్వామీ....అమాయకులైన ఆ ప్రజలు మన వల్ల ఇక్కట్లకు గురికాకూడదు అని నా అభిప్రాయం ప్రభూ..
ఆహా దేవీ నిజం గా .'జగజ్జనని' అనిపించావు...ముల్లోకాలకూ తల్లివైనందుకు నీ పిల్లల గురించిన బాధ్యతకు ముగ్ధుడినైనాను..ఇంత కాలం రాక్షసులు మాత్రమే శత్రువులు అనుకున్నాను......ఇప్పుడు అర్ధమైనది...అసలు పాపాత్ములెవరో...వారి భరతం పట్టుటకు మన పుత్రునికి ఇదిగో అత్యంత ఆధునికమైన ఆయుధం ఇది. దీనిని 'గన్' అందురు ఒలంపిక్ మహాయజ్ఞమున అబినవ 'బింద్రా' కు బంగారు పతకము సాధించిన 'గన్' ఇది. దీనిని ఒక్క సారి మీట నొక్కిన వేలాది గుళ్ళు వర్షంలా కురిసి తీవ్రవాదులు అంతమౌదురు..దీనిని ధరించి భూలోకమునకు వెళ్ళి తన పుట్టిన రోజు ఆనందముగా జరుపుకుని, లోక కళ్యాణము చేకూర్చి తిరిగి వచ్చును మన కుమారుడు...
'గన్' ధరించు వాడు కాబట్టి ఇకనుంచి మన కుమారుడు 'గన్'పతి అని పిలువబడతాడు...సర్వేజనా సుఖినోభవంతు....




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/Bookmark

Wednesday, September 1, 2010

జగన్నాటక సూత్రధారి

 గోపికల చీరలు దోచిన వాడే...కాపాడమన్న వారికి చీరలిచ్చి కాచాడు..
ధర్మాన్ని బాధించిన వారిని . శిక్షించేది నేనే అని . గీత లో బోధించాడు,,
పదహారు వేలమంది..భార్యలున్న బ్రహ్మచారి..దుష్ట శిక్షణకై వెలసిన చక్రధారి - జగన్నాటక సూత్రధారి




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/Bookmark

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Best CD Rates