Saturday, May 29, 2010

భాగ్యన ''గరం "

 భాగ్యన ''గరం '  

రిం ఝిం రిం ఝిం హైదరాబాద్...రిక్షా వాలా జిందాబాద్..బాలు పాట బ్యాక్ గ్రౌండ్ లో వినిపిస్తోంది..
హైదరాబాద్ ..హైదరా బ్యాడ్ గాను..హైరానాబాద్ గానూ ఉన్న ఈ రోజుల్లో ఆ పాట ఎందుకో ఎక్కట్లేదు. పైగా పాపం రిక్షావాలాలు ఇప్పుడు జిందాబాదూ కాదు..ఒక్క ఎలక్షన్ టైములో తప్ప.

బయటకెళితే పది నిమిషాల్లో కాకి రంగుకు మారేల ఉన్న ఎండ..ఒకప్పుడు చమట పట్టని నగరం గా ఉన్న భాగ్య నగరం ఇప్పుడు..అన్ని రకాలుగా చమటలు కక్కిస్తున్న భాగ్య న గరం గా మారింది.

అందమైన కట్టడం చార్మినార్ దగ్గర కెళదాం అంటే.. ఏ క్షణాన ఏమి జరుగుతుందో అర్ధం కాని వ్యవహారం

టాంకు బండు...ప్రస్తుతం వేడెక్కి...బందులకి సెంట్రల్ స్పాట్ గా మారింది..

జూ లో జీవాలు ఎలా ఉన్నాయో తలుచుకుంటేనే బాధేస్తోంది..కొండ మీద బిర్లా వెంకటేస్వరుడికి.....జయ విజయుల తో పాటు...పోలీసుల రక్షణ కల్పించాల్సిని పర్స్థితి ..

ఎప్పుడు బందో, ఎప్పుడు గొడవలౌతాయో..ఎక్కడ బాంబు పెట్టారో...అసలే అయోమయం ..ఇక ఆ పైన ఆటో వాళ్ల రేట్లు చూస్తే..ఆస్థులమ్మాల్సిన అవసరం అనిపిస్తుంది..

సినిమా కెళ్దామన్నా భయం..భారం..బోరింగ్..




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

Saturday, May 8, 2010

మదర్స్ డే -అమ్మ కోసం ఒకరోజు. కనీసం ఒక రోజు..

మదర్స్ డే
ఔను మదర్స్ డే ...అమ్మ కోసం ఒకరోజు. కనీసం ఒక రోజు..

మనం భూమి పైకి రావడానికి 9 నెలల ముందు నుంచే మనల్ని కాపాడ్డం మొదలెడుతుంది..
తాను నొప్పులు భరిస్తూ మనకి జన్మ నిస్తుంది..(మరి భరించే వాడు భర్త అని ఎందుకు అంటారో?)..
మనకి ఆకలి వేయక ముందే పాలిచ్చి..లాలిస్తుంది..
మన కి భాష రాక ముందే అన్నీ తెలుసుకుని ... అందిస్తుంది..
మనకి బడిలో చదువు రాకముందే ఎన్నో నేర్పిస్తుంది..
మనకి స్నేహితులు రాకముందే మనతో స్నేహం చేసి ఆడిస్తుంది....



పొద్దున్న మనం లేచే సరికే ఇల్లు వాకిలీ శుభ్రం చేసి.నీళ్ళు పట్టి, కాఫీ పెట్టి, టిఫిన్ చేసి పెట్టి, క్యారేజీ కట్టి, రెడీ గా ఉంచుతుంది..

మనం జీవితం లో ముందుకెళ్ళడానికి తాను వెనకే ఉండి..పోతుంది...వృద్ధాశ్రమంలో..

అందుకేనేమో మదర్స్ డే..అమ్మ కోసం ఒకరోజు..కనీసం ఒకరోజు.. 


నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

Friday, May 7, 2010

రాబోయే కాలం లో కాబోయే ఐటెం సాంగ్

 రాబోయే కాలం లో కాబోయే ఐటెం సాంగ్

తలుచుకుంటే ఎక్కిళ్ళు
కలుసుకుంటే వేవిళ్లు
నీ చూపు మహా ఘాటురా
నీ వాటం మహా నాటురా

పరదాలన్నీ మూసేసి
పరువాలన్నీ పరిచేసీ
సరదాకి సరసమాడితే
సరసానికే సరదా పుట్టేనురా



నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

Saturday, May 1, 2010

సం'దేశం'

సం'దేశం'




భువన మండలం
లో
భరతావనిలో

కష్ట జీవులు
నిష్ఠవీరులు


క్షేత్రాలన్నీ క్షాళణ చేసీ
ధాన్యాలన్నీ రాశులు పోసీ
తిండి పెట్టగా
పస్తులుండగా

భూస్వాములంతా తింటూ
మీ కష్టాల్ తీరుస్తామంటూ

వారి కష్టం సొమ్ముచేసుకుంటుంటే
వారి కాష్టం గాలికొదిలేస్తుంటే

పేదలందరి కడుపుమండగ
అందరు కలిసి కన్నెర చేయగ

గడగడ లాడగ భువనమండలం
ఏర్పడే ఓ హవన కుండలం..

ఆ 'కాష్టం' ఆర్పే నాధుడు ఏడోయ్
వారి 'కష్టం' తీర్చే యోఢుడు ఏడోయ్
అందుకే ఓ యువతా!
పేదకోసమై పాటు పడు
కనీసం ఆవిధంగానైనా బాగుపడు

మహా కవి శ్రీ శ్రీ కి అంకితం



నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

Sri Sri Satha Jayanthi

Sri Sri Satha Jayanthi

నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Best CD Rates