Tuesday, March 30, 2010

బేచార్మినార్

 బేచార్మినార్

భగవంతుడి దృష్టిలో మనుష్యులందరూ సమానమే..కానీ మనిషి దృష్టిలోనే దేవుళ్ళందరూ సమానం కాదు. హజ్రత్ జయంతి చేసుకోవచ్చుకానీ హనుమత్ జయంతి చేసుకునే స్వతంత్ర్యం లేని హిందూ దేశమిది..వాహ్ మేరా భారత్ మహాన్. సారే జహాసె అచ్చా అంటూ ఇక్బాల్ రాసిన గీతాన్ని ప్రతీ భారతీయుడూ పాడుకుంటూనే ఉంటాడు..మా తుఝె సలాం అన్న రహ్మాన్ సంగీతాన్ని తనివి తీరా వింటూ ఆస్కార్ అందుకున్నప్పుడు జయహో నినాదాలూ చేసాడు..ఫక్రుద్దిన్ అహ్మెద్, జాకిర్ హుస్సేన్, అబ్దుల్ కలాం లు దేశాద్యక్ష్యులుగా సలాం లు అందుకున్నారు. కానీ పాత బస్తీలో హిందువు కు మాత్రం జై శ్రీ రాం అనే హక్కు లేదు.

బొంబాయి సినిమాలో హీరోయిన్ బురఖా తీసి చూసే సీను మీద దుమారం రేగింది కానీ ...హుస్సేను వేసిన దేవతా చిత్రాలమీద మాత్రం ఈగ కూడా వాలనీయరు. ఇవాళ ఈనాడు లో కూడా " ఒక వర్గం " మీద దాడి జరిగింది..ప్రార్ధనాలాయం మీద రాళ్ళు రువ్వారు అని రాసారు కానీ, హిందువుల మీద దాడి అని రాసే దమ్ము కూడా లేదు..అదే నింబ్నటి పేపర్లో ..బాబ్రీ మసీదు ధ్వన్సమౌతున్నప్పుడు అద్వానీ కళ్లలో ఆనందం కనిపించింది అంటూ ...చేసిన వ్యాఖ్యలు మాత్రం బాక్స్ కట్టి మరీ వేసారు..ఏమో రేపు నా బ్లాగుమీదా దాడి చెయ్యొచ్చు...చెప్పలేం





నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

Saturday, March 27, 2010

మరో "ఛ" రిత్ర...

మరో "ఛ" రిత్ర...


 పాటలు రి మిక్స్ లు చేస్తున్నారు...డాన్సులు రి మిక్సు చేస్తున్నారు..సినిమా పేర్లు పాతవి వాడుతున్నారు...ఇంకా ఇప్పుడు ఏకంగా సినిమా మొత్తాన్ని ఫ్రీ మిక్సు చేసేసి...మరఒ చరిత్ర సృష్టించామంటున్నారు...గ్రేట్ ...కొత్త ఐడియా..పైగా పైరసీ వద్దు అంటూ సినిమా విడుదల డేటునుంచీ రోడ్డున పడతారు.

అదేంటో...వాళ్ళ సినిమా రిలీజు అప్పుడు మాత్రమే ఈ పైరసీ గురించి గుర్తొస్తుందేమోఅ వాళ్లకి..ఆమధ్య మగధీర రిలీజప్పుడు..చరణ్, అల్లు అరవిందు, పవన్ కళ్యాణ్ ఇంకా చిరు అందరూ పైరసీ గురించి బోల్డన్ని టీవీల్లో చెప్పేసారు..తరువాత నాగ్ వాళ్ళబ్బాయి సినిమా గురించి జోష్ గా తనవంతు పైరసీ వ్యతిరేకం గా దంచేసారు...సినిమా కూడా త్వరగా దించేసే సరికి..వదిలేసారు..మళ్ళీ కొన్నాళ్ళు ఎవరూ వినపడలేదు...ఇప్ప్పుడు మళ్ళీ వాళ్ళ సినిమాలు రెడీ కాబట్టి మళ్లీ షురూ..లీడర్ టీం, మరో చరిత్ర టీం ఇలా అందరూ..మరి వాళ్ళ సినిమా లేనప్పుడూ పోరాడచ్చుగా...పట్టుకోవచ్చుగా..

వాళ్ళ పని తీరు మార్చుకుని..మన మీద ఎందుకు నెడతారో..
మరో చరిత్రని పాపం బాలచందర్ గారు వైజాగులో తీసేసి మమ అనిపించారు...వసూళ్ళూ చేసింది, అవార్డులూ గెలుచుకుంది..ఇప్పుడు ఆ స్టోరీని అమెరికా ఎందుకు పంపించారో ...ఉన్న మంచి పాటల్ని ఎందుకు "చిత్ర" హింస పెట్టారో..వాళ్ళకే తెలియాలి..ఖచ్చితంగా..పాత మరో చరిత్ర అంత గొప్పగా తీస్తాం అని ప్రకటించారు కూడా..ఐనా మాయా బజార్ లా ఆ మరో చరిత్రనే కలర్ చేసేస్తే బాగుండేదేమో..? ఏమిటో ఇదివరకూ సినిమా ఇక్కడ తీసి పాటలకోసం ఫారిన్ వెళ్లేవాళ్ళు..ఇప్పుడు సినిమా కూడా అక్కడే తీసేసి (వేలం) పాటలకోసం ఇక్కడకొస్తున్నారు. ఒక పక్క జేంస్ కెమరూన్ లాంటి వాళ్ళు మన రామాయణం నుంచి స్ఫూర్తి పొందుతుంటే మనం మాత్రం..........ఎటు పోతున్నామో అర్ధం కావట్లేదు.




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

Thursday, March 18, 2010

పంచాంగం పై రాజకీయ ప్రభావం

Tuesday, March 16, 2010

నంది వ్యర్ధనాలు

నంది వ్యర్ధనాలు
ఉగాది పండుగ రోజున లలిత కళా తోరణంలో  ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన నంది అవార్డుల కార్యక్రమం చూస్తే ఎంత ముచ్చటేసిందో..

ముఖ్యంగా మధ్యలో మొదలెట్టిన మాతెలుగు తల్లికి మల్లెపూదండ పాట..ఒక్కళ్ళూ లేవలేదు..ఆ సాంప్రదాయం ఇంకా మొదలవలేదనుకోండి..ఒక పక్క పాడుతుంటే వెనకాలకూర్చున్న నంది విజేతలు చెవుల్లో గుస గుసలు..ముసి ముసి నవ్వులు, సెల్ ఫోనుల్లో ఎస్ ఎం ఎస్ లు...ఆ పాట పాడిన నంది విజేత గాయనీ మణులకు ఆ పాట చూడకుండా రాదు, ఎవరు ఏ భాగం పాడాలో అవగాహన లేదు...ఒక్కొక్కళ్ళు ఒక్కో శృతిలో మొత్తానికి పాడేసి అమ్మయ్య అనుకున్నారు..మనసులో షిట్ అనుకున్నేరేమో కూడా...ఇప్పటికింకా నా వయసు,,రింగ రింగ రింగ రింగా లాంటివి గుర్తున్నప్పుడు ఈ ఒక్క పాట ఎందుకు గుర్తు లేదో..మరి...
ఇక హాస్యం పేరుతో వాళ్ళు చేసిన ఆ ఫీట్లేంటో ఆ భగవంతుడికే తెలియాలి. ఒకావిడ డాక్టర్ దగ్గరకొచ్చి రెండు వేళ్ళు చూపించి ఒకటి తాను, ఒకటి ఆవిడ లవరు అని...ఇంట్లో అంతా ఒప్పుకున్నా..వాళ్లాయనకి ఎలా చెప్పాలో అర్ధం కావట్లేదు అని ఒక ప్రభుత్వ కార్యక్రమం లో ..ముఖ్యమంత్రి సమక్షంలో చెప్పే జోకేనా అని ...



ఇక అవార్డులు తీసుకోవడానికి వచ్చిన వాళ్ళు, పాత తరం నిర్మాత శ్రీ తిలక్ గారు మాట్లాడుతుంటే ఒకటే నవ్వులు..వారీ నే చెప్పొచ్చేదేటంటే..ఇప్పటి టెక్నాలజీలు, సదుపాయాలు, లేని రోజుల్లో ఒక తపస్సులా భావించి, ప్రజలకి ఉపయోగపడే సందేశాత్మక చిత్రాలు, తీసిన నిర్మాత ఆయన ,ఎంతో మంది నూతన నటులకు అవకాశాలిచ్చిన మార్గదర్శి, ఇప్పటిలా ఒక్క సినిమా తో హిట్టు డైరెక్టరైపోయి....చిన్న సినిమాలు తీయడం మానేసి,,కొన్ని ఫట్టు సినిమాలు తీసి కనుమరుగైపోయే కొత్త దర్శకుడు కాదు..తల్లా పెళ్ళామా లాంటి చిత్రాలని తీసిన మహానుభావుడాయన.

ఇక కుటుంబ కధా చిత్రాలలో అవార్డు పొందిన రెడీ చిత్రం అద్భుతం..మొదటి సీనే పెళ్ళి లోంచి పెళ్ళి కూతుర్ని ఎత్తుకు పోవడం, ఆవిడ వీళ్ళ గాంగుతో జీపులో  తిరిగి తిరిగి, అడవిలో దారి తప్పి, మేన మామ ల ఇంటికి జేరి....అక్కడ హీరో హీరోయిన్ కలిసి వాళ్ళని వెధవల్ని చేసి అందుకు హీరో తల్లి తండృలని కూడా వాడుకుని పెళ్ళి చేసుకునే అద్భుతమైన కధ ఉన్న కుటుంబ కధా చిత్రం. ఒక వేళ ఆ కాటగిరీలో సినిమాలు ఎంట్రీలు రాకపోతే మిగతా కేటగిరీల్లా వదిలెయ్యచ్చుగా ఏదో ఒకటి ఇచ్చెయ్యాలా...

మంచి సినిమాలు నంది అవార్డు సినిమాలకు సబ్సిడీ ఇవ్వాలి 20 లక్షలు ఇస్తే బాగుంటుంది అని భరద్వాజ గారు కోరారు..అయ్యా మంచి సినిమాలు ఎవరు తీయాలి, జనాలా..మీరా? జనాలు హీరోలు, హీరోయిన్ ల కోసం మాత్రమే కాదు కధ కధనం కోసం కూడా చూస్తారు అని చెప్పడానికి పాపం బంగారు నంది గెలుచుకున్న గమ్యం చాలేమో..పెద్ద పెద్ద హీరోలు నటించిన సినిమాలకు అవార్డులు రావు మనదగ్గర.

మళయాళం లో సూపర్ స్టారులు మోహన్ లాల్, మముట్టి ఆర్ట్ సినిమాలు అని పిలవబడే కధల సినిమాల్లో నటిస్తారు కాబట్టి వాళ్లకి నేషనల్ లెవల్ అవార్డులు వస్తాయి..అదే మన దగ్గర ?????

ఇమేజి పక్కన పెట్టి రుద్ర వీణ, స్వయం కృషి లాంటివి చేసినప్పుడు చిరంజీవి కి వచ్చింది అవార్డు, ఎంతసేపూ జనం చూస్తారు అందుకే తీస్తున్నాం అనే సినిమాలు ఎన్ని ఆడుతున్నాయి అసలు జనాలని ఎవరు అడుగుతున్నారు..మీరు తీసేసి మా మీదకి తోసేస్తే ...మేము చూస్తే అది హిట్టు లేదా ఫట్టు ...ఈ మధ్య కలెక్షన్ ల కోసం తీసిన బికినీ ల సినిమాల్లో (బిల్ల, ద్రోణ, సాధ్యం )ఎన్ని ఆడాయి నిజంగాఅ....అష్టా చమ్మాలో హీరోయిన్ ఏమి ఎక్ష్పోస్ చేసిందని చూసారు మీరనే ఆ జనం...కాబట్టి మీరు శంకర్ దాదా అయినా శంకరాభరణమైనా కొత్తదనం, కోరుకుంటారు జనం..మున్నాభాయి లో సంజయ్ దత్ చెంప మీద కొడతాడు కాన్సర్ అని అప్పుడే తెలిసిన పేషంటు. అది ఆ పేషంట్ మానసిక పరిస్థితి కి నిజమైన రూపం...మరి అది శంకర్ దాదాలో చూపించగలిగారా? ఇమేజి...అక్కడ ఆ సీను లో చిరంజీవిని ఎవరో అనామకుడు కొడితే జనం ఊరుకోరు అని..అదే హీరో లారీలలో వచ్చే పక్క ప్రొఫెషనల్ రౌడీలౌ వేల మందిని ఒక దుడ్డు కర్రతో బాదేసి చొక్కా నలగకుండా కళ్లజోడు తియ్యకుండా చితక్కొట్టి ఒక పెద్ద డైలాగు కొట్టేసి హీరోయిన్ (వీలైతే ఆ విలన్ చెల్లి) తో పాట పాడుకోవడానికి వెళ్ళిపోతాడు. అదీ మన క్రియేటివిటీ..



నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

Monday, March 15, 2010

తేనెలొలుకు మన తెలుగు భాష


                                             
తేనెలొలుకు మన తెలుగు భాష
వెన్నెలచందముగ వెలుగు భాష.

వేల వత్సరముల ప్రాచీన భాష
వేద భూమిపై వెలసిన భాష

పదహారణాల పసందైన భాష
పద్యాల పదునున్న హృద్యమైన భాష

రామాయణమందించిన కవయిత్రి మొల్ల భాష
భారతమ్ము రచియించిన కవిత్రయమ్ము భాష

వేంకటేశ్వరుని కొలిచిన అన్నమయ్య భాష
శ్రీ రాముని కీర్తించిన త్యాగయ్య భాష

భద్రాచల రాముని సేవించిన కంచెర్ల గోపన్న భాష
శతకములో బతుకు బాట చూపిన యోగి వేమన్న భాష

పంచదార భాష, పాల బువ్వ భాష
తేనె లొలుకు భాష..ఎంకి కులుకు భాష  మన తెలుగు భాష

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ

శ్రీ వికృతినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు
కస్తూరి ఫణి మాధవ్




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

Friday, March 12, 2010

ఫన్చాంగ శ్రవణం

                 ఫన్చాంగ శ్రవణం
 
 శ్రీ గురుభ్యోనమ:
కేవలం ప్రతీ రోజూ మారిపోతున్న రాజకీయ సమీకరణాల వల్ల అస్తవ్యస్తమౌతున్న ప్రజా జీవితానికి రిలీఫ్ కోసం సరదాకి వ్రాసిన శీర్షిక, భవిష్యత్తు తెలిపే పంచాంగాన్ని అగౌరవ పరచడం ఏమాత్రం కాదు. ఇందులోని వ్యంగ్యాన్ని ఆస్వాదించి..అశీర్వదిస్తారని ఆశిస్తూ వికృతి నామ సంవత్సర ఫలితములు...రాజకీయ సామాజిక ఫంచాంగ శ్రవణము


ముఖ్య మంత్రి రోశయ్య
సోనియా శుభదృష్టి వల్ల ముఖ్యమంత్రి పదవి దక్కినా...ఏడో ఇంట్లో ఉన్న కేసీ ఆర్ వల్ల నిత్యం సమస్యల తో తలనొప్పిగా ఉంటుంది...కొన్ని ఇతర కారణాల వల్ల ఇంటి పోరూ తప్పదు.."శ్రీ కృష్ణ "జపం..తో పాటు ప్రణబ్ మంత్రం...చిదంబర దర్శనం, సోనియాలయం పర్యటన, చేస్తూ ఉంటే ఫలితం ఉండవచ్చు..


రాజపూజ్యం : రాజ యోగం
అవమానం: గాంధీ భవనం
ఆదాయం: అనుభవం
వ్యయం: అనారోగ్యం



చంద్రబాబు నాయుడు
హైటెక్ పూజలు చేసి...పల్లె మాతను పట్టించుకోకపోవడం వల్ల కోల్పోయిన రాజ్యం. తెలంగాణా నాయకుల వక్ర దృష్టి వల్ల మరింత నష్టం... మూడో ఇంట బాలయ్య, ఐదో ఇంట ఎన్ టీ ఆర్ ఉండటం వల్ల కొంత వరకూ లాభమే అయినా ప్రస్తుతం..జే ఏ సీ వెంట కొందరు నాయకులుండడం వల్ల రోశయ్య లాగానే ఇంటి గండం ఎదుర్కునే అవకాశం..

సమ్మక్క సారలమ్మలను మొక్కుకుని..యాగం చేసి నాగం ముక్కుకు తాడెయ్యకపోతే మరింత నష్టం వాటిల్లే ప్రమాదం.


రాజపూజ్యం : ఎన్ టీ ఆర్ ట్రస్ట్ భవనం
ఆందోళనం: తెలంగాణా నాయకుల శిబిరం
ఆదాయం : బాలయ్య తో వియ్యం
వ్యయం: తెలంగాణా విషయంలో కయ్యం



చిరంజీవి
సినీ మతం నుంచి, రాజకీయం వైపు మతం మార్చుకోవడం వల్ల, ప్రేక్షక దేవుళ్లు కరుణించినట్లుగా .ఓటరు దేవుళ్ళు పట్టించుకోకపోవడం వల్ల కొంత గందరగోళ పరిస్థితుల్లో ఉన్నారు..."గురువు"(అల్లు ) బలహీనమవడం వల్ల "మిత్ర " బేధాలు, "పూర్వ " జన్మ పుణ్యం వల్ల "సంతానం " లో మగధీరుల వల్ల లాభం,



రాజపూజ్యం : ప్రేక్షక హృదయాల్లో
అవమానం: అసెంబ్లీ ఎన్నికల్లో
ఆదాయం: మగధీర వసూళ్ళు
వ్యయం : రాజకీయ సవాళ్ళు

కే సీ ఆర్
తెలంగాణా తల్లి విగ్రహ ప్రతిస్టాపన వల్ల కొంత మంచి జరిగినా., వాస్తవ దోషాల వల్ల కొన్ని అపశృతులు,

(ని)గ్రహ దోషాల వల్ల ఆహార లోపం కలిగినా అదీ లాభదాయకమే. (నిరాహార దీక్ష)
ఇతర గ్రహాలన్ని కలిసి జే ఏసీ కూటమి గా మారడం వల్ల కూడా కొన్ని లాభాలు కలుగ వచ్చు, కానీ విద్యార్ధుల్లో ఆవేశాలు.ప్రాణ నష్టం ,"ఖాకీ"ల పట్ల జాగ్రత్తతో వ్యవహరించాలి, లగడపాటి లాంటి వాళ్ళతో చిన్న చిన్న చికాకులు.


రాజ పూజ్యం: NIMS లో నిరాహార దీక్షా శిబిరం
అవమానం: ఢిల్లీలో కేంద్ర కమిటీ వ్యవహారం
ఆదాయం: జే ఏ సీ సపోర్టు
వ్యయం: శ్రీకృష్ణ కమిటీ రిపోర్టు

 http://sujanaranjani.siliconandhra.org


నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

Wednesday, March 10, 2010

అమ్మ గెలిచింది..

 ఇంట్లో అందరికన్నా పొద్దున్న ఎవరు లేస్తారు, అమ్మ, లేదా భార్య. పాలు తీసుకోవడం దగ్గరనుంచీ..వంటచేసి..క్యారేజి సిద్ధం చేసి, ఆఫీసు/స్కూలు వేళకి టిఫిన్ రెడీ చేసి...అందరూ వెళ్లాక..ఇల్లు వాకిలి సద్దుకుని, పూజ పునస్కారం చేసి.. బట్టలు, అంట్లు..సంగతి చూసి, సాయంత్రానికి కావాల్సిన ఏర్పాట్లు చేసుకుని, రైతు బజారు కి వెళ్లి కూరా నారా తెచ్చుకుని, కొట్లో వెచ్చాలు సరుకులు తీసుకుని, పండగొస్తోందంటే కావాల్సిన ఏర్పాట్లు చేసి,,,ఇలా చెప్పుకుంటూ పోతే..ఇంటిమొత్తాన్ని సమ్ర్ధించే స్త్రీ దేశాన్ని సమర్ధించడానికి పనికి రాదా? ఇన్నాళ్ళూ ఎదుకని ఈ వివక్ష చూపిస్తారో.

ఈప్పుడు రిజర్వేషన్ బిల్లు సఫలమైనందుకు సంబరపడుతున్నారు కానీ..రబ్రీ వెనక లాలూ లాగా,,భార్య వెనక భర్త నిలబడి చేయిస్తారో నిజంగా అధికారం వాళ్లకే వదిలేస్తారో వేచి చూడాల్సిందే..

ఏది ఏమైనా భారత మాతకి జై..ఇంట్లో అక్క, చెల్లి, అమ్మ, భార్య గా ఉన్న స్త్రీ కి జై..ఆల్ మోస్ట్ గా మన భారత దేశంలో చదువుల తల్లి, ధనానికి లక్ష్మి, ధైర్యానికి కాళీ ఇలా అందరూ దేవతలే ప్రతీకలు మనం మాట్లాడే భాష కు మాతృ భాష అనే పేరు..ఆ ఆది శక్తికి జై....


నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

Monday, March 8, 2010

ముగ్గురు యదవలు,,,,

ముగ్గురు యదవలు,,,,త్రీ ఈడియట్స్...


 


నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

Thursday, March 4, 2010

"ఆ" శ్రమ జీవితం

 "ఆ" శ్రమ  జీవితం
 ఒక సారి ఒకతను చెట్టుకింద కాళ్ళు జాపుకుని తాపీగా ఉన్నాట్ట, దారిన పోయే దానయ్య ఏం నాయన అలా ఖాళీగా కూర్చోకపోతే ఏదైనా పని చేసుకోరాదా అన్నాట్ట, దానికి ఆ బద్ధకస్తుడు పనిచేసి ఏం సాధించాలి అని అడిగాట్ట, దానికి ఆ దానయ్య అదేంటి నాయనా అలా అంటావ్, పని చేస్తే డబ్బులొస్తాయి, ధనం సంపాదిస్తే సుఖంగా  కాళ్ళు జాపుకుని హాయిగా ఉండొచ్చు అన్నాట్ట దానికి ఆ బద్ధకస్తుడు ఇప్పుడు నేను చేస్తున్నదదే..నీ పని చూసుకో అన్నాట్ట.
ప్రస్తుతం కొన్ని సంఘటనలు చూస్తుంటే అలానే కనిపిస్తోంది. కష్టపడి చదువుకుని, పోటీలు పడి ఉద్యోగాలు సంపాదించి,,,పని చేసి డబ్బులు సంపాదించి, అన్ని సౌకర్యాలు సమకూర్చుకునే సరికి..వయసు కాస్తా అయిపోయి అవి అనుభవించడానికి సమయం దొరకని పరిస్థితి ఏర్పడుతుందనో ఏమో కొంతమంది హాయిగా ఆశ్రమాలు ఏర్పాటు చేసుకుని రకరకాల పనులు చేసేస్తున్నారు. అసలు వీటిలో ఎన్ని నిజాలో...ఏవి కావోకూడా ప్రశ్నార్ధకమే. ఎందుకంటే ఈ టీ వీలనీ నమ్మలేము. ఇది వరకు నారదుణ్ణి ఆడిపోసుకునే వాళ్ళు కానీ పాపం ఆయనకి కళ్యాణం కాకపోయినా...లోక కళ్యాణం కోసం ఏవో పనులు చేసేవాడు..కానీ ఈ టీ వీ చానెళ్లు ఒక్క రోజులో ఏదో ఒక సంచలన వార్త అంటూ ప్రసారం చేసి..జనాల జీవితాలని అస్తవ్యస్తం చేస్తున్నారు.

ఏదైనా ఒక ఆధారం దొరికితే సంబంధిత వివరాలు కూడా తెలియక ముందే ప్రత్యక్ష్య ప్రసారమనో,, చర్చ అనో..ఎక్స్క్లూజివ్ అనో ప్రసారం చేసి పారేసి..తరువాత మేమే బయటకు తీసింది అని చంకలు గుద్దుకుంటారు.

ఆ మధ్య ప్రకాష్ రాజ్ కి ఎవరో ఒక రాజకీయ నాయకురాలికి పెళ్లి చేసేసింది ఈ మీడియా. ఒక వేళ వాళ్ళు చేసుకున్నా అది వ్యక్తిగత వ్యవహారం. ఇంతా చేసి ప్రస్తుతం ఆ న్యూసు ఏమైపోయిందో తెలీదు. ఇక మాఫియాలు, తీవ్రవాదులు మరో రకం వాళ్ళు అందరూ ప్రత్యేక ఇంటర్వ్యూలకి వీళ్లకి దొరుకుతారు..పోలీసులకి దొరకరు..మరి వీళ్లకి దొరికిన వాళ్ళని కెమేరాలతో షూట్ చేసి రేటింగు పెంచుకుంటారే తప్ప షూట్ ఎట్ సైట్ ఉన్న వాళ్ళగురించైనా పోలీసులకి చెప్పరు.పొద్దున లేస్తే వీళ్ల చానెళ్ళలో సమాజాన్ని మారుద్దాం రండి అని స్లోగన్ లు..ఈ కామ కేళీలు తప్ప వీళ్ళకి ఇంకేమీ దొరకవా..అని ఓ డౌటు.


అసెంబ్లీ సమావేసాలు జరుగుతున్నాయి. అసలు ప్రజల సమస్యలేమిటి..దాన్ని ప్రజా ప్రతినిధులు ఎలా చర్చిస్తారు/చర్చించాలి, సభా సమయమేంటి. అక్కడ జరుగుతున్నదేమిటి. ప్రజల ప్రయోజనాలకి ...వ్యక్తిగత దూషణలకి వీటిలో దేనికి సమయం కేటాయిస్తున్నారు..ఎందుకిలా జరుగుతోంది..ఒక వేళ అలా జరగకుండా ఉండాలంటే ప్రజలేమి చెయ్యొచ్చు. లాంటి చర్చల్లాంటివి..ప్రజలకి అవగాహన పెంచేవి ఎందుకు ప్రసారం చెయ్యరు.?
మర్డరు ఎలా జరిగిందీ, బ్యాంకు దోపిడీ ఎలా జరిగిందీ, ఇలాంటివి మాత్రం పనికట్టుకుని చూపిస్తారు..
ఇక ఆశ్రమ జీవితాల్లోకొస్తే..
అసలు..అశ్రమం లో ఉన్న స్వామీజీలు,  దైవాంశ సంభూతులని,  వాళ్ళే దేవుళ్ళని వాళ్ల చుట్టూ ఉండే మేనేజర్లు(అనుచరులు అనాలేమో ) ప్రచారం చేస్తుంటే మటుకు ఎందుకు ఆకర్షితులౌతారు. అది బలహీనత,  చేసే తప్పులు, కష్టపడకుండా సంపాదించడానికి దగ్గరి మార్గాలు కావాలని, మనకి చేతకానిది ఏదో పొందాలని స్వార్ధం ....దాన్ని వాళ్ళు సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు డబ్బులు దండుకుంటుంటే,  కొందరు..రాసలీలలు సాగిస్తున్నారు, కొందరు ఇంకో పని చేస్తున్నారు.

సర్వం పరిత్యాగం చేసే వీళ్ళకి డొనేషన్ లు ఎందుకు?
ఎంత డబ్బు కడితే జబ్బు నయమౌతుంది?
 ఎన్ని లక్షలు ఇస్తే మోక్షం లభిస్తుంది?
ఈ మాత్రం ఆలోచించని అమాయకులున్నన్నాళ్ళూ
అలాంటి వారు "నిత్యానందం "గానే ఉంటారు.
 గంగా జలం పేరుతో గంజాయి తాగిస్తునే ఉంటారు..
ప్రజలారా మారాల్సింది మనం.....




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

రాహుల్ మనసులో మాట

 రాజకీయాల్లోకి రాకుండా పెళ్ళి చేసుకుని ఉంటే నీ అంత కొడుకుండేవాడేమో...అందరూ ప్రధాని పదవి గురించి మాట్లాడుతున్నారు కానీ ప్రధానం గురించి పెళ్ళి గురించి పట్టించుకోరు. ప్చ్ ఏం చేస్తాం.అందుకే నాన్న ఇటలీ వెళ్ళి మరీ పెళ్ళి చేసుకున్నాడు..నేనూ అలానే చెయ్యాల్సింది..



నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Best CD Rates