Monday, July 28, 2008

లోకల్ నాయకుడా

లోకల్ నాయకుడా


కొందరు రాజకీయ నాయకులని చూస్తే ఆస్చర్యమేస్తోంది..లోకల్ నాయకులైనా లోకనాయకులులా ఫీల్ అవుతుంటారు వీళ్ళు..మొన్న ఆబిడ్స్ లో ఏదో గందరగోళం..ఇళ్ళు పడగొడుతున్నారని..రాస్తా రోకో..బైఠాయింపు...జరిగాయి....గాలిలోకి కాల్పులు కూడా జరిగింది అయితే అది పోలీసులు చేసింది కాదు సదరు లోక నాయకుడు గారు చేసిందే....
లాఠీ చార్జీ జరిగింది...అదీ పోలీసులు చేసింది కాదు...ఆ లోక నాయకుడి సిబ్బంది చేసిందే...ఆ సిబ్బంది చితక్కొట్టింది మరెవరినో కాదు...సాక్షాత్తు బల్దియా అంటుంటారే ఆ మునిసిపాలిటీ సిబ్బందిని...ఆనాయకుని నమ్ముకున్నాయన్ని ఇబ్బంది పెట్టినందుకు...లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చి ఇరగదీసాడు ఆ లోక నాయకుడు..పోలీసులు కూడా లోపల కూచోబెట్టి మర్యాదగా మాట్లాడి విచారణ జరిపిస్తామన్నారు....తలలు పగిలిన వాళ్ళ పట్ల విచారం వ్యక్తం చేసారు కూడాను....
గాలిలో కాల్పులు జరిపిన ఆ నాయకుడి కి అలాంటి పరిస్థితి ఎందుకు కలిగిందో....ఎందుకు ఆయన కాల్పులు జరిపాడో.. అసలు అంగ రక్షకులు అప్పుడు ఏమి చేస్తున్నారో (సిబ్బందిని చితక్కొట్టే పనిలో ఉన్నట్టు సమాచారం)...తెలుసుకుని చెబుతారు త్వరలోనే ఒక పది పన్నెండేళ్ళలో//./

నయన తార


ఒకావిడ హీరోయిన్, ఒకావిడ హీరోయిన్ కం ఐటం సుందరి, ఇంకొక ఆవిడ ఐటం సంగ్ స్పెషలిస్టు...
తేడా అల్లా ఒకటే....హీరోయిన్ అని అన్నావిడకి కోటి దాకా పారితోషికం...ప్లస్ సకల సదుపాయాలు...ఎందుకంటే ఆవిడ కధానాయకురాలు కాబట్టి...నయనానికి అందంగా ఉంది కదా అని అనుకుంటుండంగానే ....కను విందు చేయడనికి నేను రెడీ అని బిల్లా కట్టుకుని మరి చెప్తోందీ పిల్ల...చంద్రముఖిలో గాలిపటాలెగరేసింది ఈ పిల్లేనా అని ఒకసారి డౌట్ వొస్తుంటుంది నాకు...బాగా తొందరగానే నేర్చేసుకుంది సినీ నాడిని....

నిషా కనులతో నుంచున్న మరో నాయిక బాలివుడ్డు లో ఒక్క మగాడు ' రాం ' అస్థానంలో ప్రదర్శనలిస్తూ ఉంటుంది .......తెలుగులోనూ ఒక్క మగాడుతో జత కట్టినా..అంతగా కలిసి రాక తన సామ్రాజ్యం ఎక్కడుందో వెతుక్కుంటోంది.....పారితోషికమూ మధ్యస్థంగా ఉంటుంది

ఇక ఎప్పటికీ 16 యేళ్ళ వయసే అని చెప్పే ఈ పచ్చబొట్ట్ల సుందరి..మ మత్తుఖాను..ఐటం సాంగు గర్లు గా వచ్చినా త్వరలోనే తెలుగు జనాల విశాల హ్రుదయం వల్ల ఇక్కడే ఒక గూడు వెతుక్కుంటూ..ఒక మంగతాయారు టిఫిన్ సెంటరు పెట్టి (కను) విందు చేస్తోంది..పారితోషికం మాత్రం పై ఇద్దరితో పోలిస్తే తక్కువే....

నాకు అర్ధం కానిదల్లా వాళ్ళ (అందాల) ప్రదర్శనలో తేడా ఏమీలేదు////దుస్తుల విషయంలోనూ పెద్ద తేడా యేమీ లేదు...వళ్ళు దాచుకోకుండా కష్టపడడంలోనూ టేడా లేదు....మరి పారితోషికం విషయంలోనూ...మర్యాద విషయంలోనూ ఆ టేడా యెందుకు అని?

Saturday, July 26, 2008

అజంతర్ మంతర్

సరిగ్గానే చదివారు, సరిగ్గానే అర్ధం అయివుంటుంది కూడాను.. మన క్రికెట్ గురించే ఆ మాట
ఒకప్పుడు కాలేజీకి బంకు కొట్టి, ఆఫీసుకు సెలవు పెట్టి..మరీ టీవీకి కళ్ళు అప్పగించి చూసేవాడిని మాచులని..తరువాత కొంచెం కొంచెం కళ్ళు తెరుచుకున్నాయి...
చివరి బంతి వరకూ వెళ్ళి వోడిపోయిన మాచులు చూసి...సస్పెన్స్ సినిమాలా ఫీలయ్యేవాడిని..తరువాత అసలు సగం మాచు కాగానే మనది కాదు మాచు అన్నట్టు ఆడి వోడిన మాచులు చూసి...ఎందుకిలా అని మధన పడేవాడిని.....సలవు పెట్టి కూర్చున్న రోజున మాచు వర్షం వల్ల ఆగిపోతే ఉసూరుమనిపించేది..పాకిస్తాను మీద గెలిచిన రోజున సంబరంగా ఉండేది...ఆ రోజులు పోయయి..
20-20 వరల్డు కప్పు గెలిచాక..మన వాళ్ళు ప్రతీ మాచి అది వండే అయినా టెస్టైనా 20 వోవర్ల లోపే ఆడాలేమో అన్నట్టుగా ఆడి ..వోడి రికార్డులు స్రుష్టిస్తుండడం చూసి..ఆ సచ్చినోల్లు.......తిట్టడం కాదు సచిన్ వాళ్ళు అని నా వుద్దేశ్యం కాకపోతే బాధలో అలా వచ్చేసింది.. టైగర్లు...అనిపించుకున్న మహా అనుభవులు..మహానుభావులు..యువరాజులు....అంతా పేరున్న ఆటగాళ్ళే....మరి మాచులు చూస్తే నిన్న మొన్న వచ్చిన జంతర్ మంతర్ బంతులకి దాసోహం అంటుంటే కోట్ల మంది అభిమానాన్ని కోట్ల ఆస్తులుగా మలుచుకున్న బోర్డు..ఆటగాళ్ళకి ఏమీ అనిపించదా అనిపిస్తుంటుంది...మా బాటింగు బాగొలేదు ....సీరీస్ పోయింది...కాని ప్రస్తుతం రబోయె సీరీస్ గురించే మా ఆలోచన అంటూ భుజాలెగరేసి చెప్పే కప్టన్ని చూస్టే టీవీ కి తలబాదుకోవాలనిపిస్తుంది..ఎంతైనా మనం డబ్బు పెట్టి కొన్న టీవీ కదా అందుకే ఆ ప్రయత్నం మానుకుని తరువాత సీరీస్ లో అయినా బాగా ఆడతారని ఎదురు చూడ్డం అలవాటైపోయింది.......
ఆస్ట్రేలియాని చూసి నేర్చుకోండి..ఆస్ట్రేలియాని చూసి నేర్చుకోండి.. అని పదే పదే చెప్తుంటే....మనవాళ్ళు నిజంగానే నేర్చుకున్నారు....' ఆట మధ్యలో తిట్టడం ' , పబ్బులకి డిస్చోలకి వెళ్ళడం...గొడవలు పడడం...లాంటివి వాటిని ఇంకాస్త పదునుపెట్టి మనవాళ్ళనే కొట్టడం దాకా పి హెచ్ డీ కూడా చేసేశారు..మనవాళ్ళు....
మొండిస్ లాంటి బౌలర్ కొత్త అంటారు కానీ దేశానికొకడుంటాడు...లీ అనో....తన్వీర్ అనో...నెల్ అనో.....మొండిగా ఆడడం మానేసి వాళ్ళు బాగా ఆడుతున్నారు అనో వాళ్ళ బౌలింగు కష్టం అనో అనడం ఎందుకు...?
దిక్కుమాలిన ప్రయోగాలు కూడా ఎక్కువైపోయాయి..ఎప్పుడో ఒక సారి అంపైరు పొరబాటు చేసాడని...టీవీ రీప్లేలు మొదలయ్యాయి...ఇప్పుడు ఆ స్థాయి కూడా దాటి...ఆటగాళ్ళే 3 అంపైర్ ని అడగచ్చట..ఇంక అంపైరెందుకు దండగ...బాలు వేసి టీవీ అంపైరు వైపు చూస్తే సరి..అన్నట్టు మర్చిపోయా.. బాలు వేసేముంది మన స్వెట్టర్లు..టోపీలు...కళ్ళజోళ్ళు మొయ్యడానికి స్టాండు ఉండాలిగా..........
పాపం అంపైర్లు.........

Thursday, July 24, 2008

రబ్బరుకు పూసిన పన్నీరు

చూద్దాం రాద్దాం అనుకుంటుంటే కాలం గడిచిపోతోంది...ఎన్నో రాద్ధాంతాలూ జరిగిపోతున్నాయి..జరిగిపోయాయి..మొన్నా మధ్య దశాపచారం రాస్తే సగమే ఉందన్నారు... సినిమా నే సగం సగం అనిపించింది నాకు..

అసలు నా ద్రుష్టిలో
మైకేల్ మదన కామ రాజు లో 4 కారెక్టరులు, అప్పు 1, భామనే సత్య భామనే 1, సాగర సంగమం 1, అమావాస్య చంద్రుడు 1, ఇంద్రుడు-చంద్రుడు లో రాయుడు 1, తెనాలి లో 1 ...వెరసి 10 వేషాలు వేసి కధ అల్లినా బాగుండేదేమో అని... ఎందుకంటే రబ్బరు తొడుగుల అవసరం లేని ఆర్టిస్టు కమల్...కాలివుడ్డు, బాలివుడ్డు,టాలివుడ్డు,హాలివుడ్డు లోని వుడెన్ ఫేసుల్లా కాదుకదా ..

కాక పోతే ఏ విగ్రహం తో కధ మొదలైందో ఆ విగ్రహాన్ని చివరి వరకు కానీ, చివర్లో కానీ పట్టించుకోక పోవటం బాధ వేసింది,,,,విగ్రహం మీద చారిగిలపడి ప్రేమ వ్యక్తం చేసిన లోక నాయకుడు...తరువాత వేదిక మీద కనిపించాడు..మరి రాయిని మాత్రం కంటే దేవుడు కనరాడు...అని పాడిన పాటలో అర్ధం ఆ దేవుడికే ఎరుక...కాస్త ఆ విగ్రహాన్ని కూడా వొడ్డున పడేస్తే.. అంటే సముద్రం వొడ్డున కాదు...కధలో ప్రాధాన్యతనిచ్చి....

ఇక సంగీతం...ఊ ఊ అంటూ మూలిగే హిమేష్ రేష్మియా కు కాకుండా మన దక్షిణాది వారికిచ్చి ఉంటే ఇంకా బాగుండేదేమో..ఎలాగూ రి రికార్డింగు మన దేవీయే చేశాడు...రహమాను కాకపోతే..జయరాజు..కాకపోతే ప్రకాషు....ఎవరైనా ఒకరు...ఎందుకంటే సింగు గారికి కూడా పంజాబీ శైలి కాకుండా ఆయన స్టైలే పెట్టి...ఉసూరుమనిపించాడు...ఊ ఊ అనిపించి....

బామ్మ గారు చూడండి... ఆ రబ్బరు తొడుగులో అర్ధం కాకుండా..భామనే సత్యభామనే లో మనకి బాగా అనిపిస్తాడు...కనిపిస్తాడు..

ఇక విలను.,జపాను యోఢుడు..లంబూ మనిషి వీళ్ళలో కమల్ని వెతకడం కష్టమే..కష్టపడి నలుగురు కమలులు కలిసి చేసిన పనితనం అంతా వేశ్తే కదా...



అన్నిట్లోకి పోలీసు నాడారు అద్భుతం..బాలు గొంతు కూడా.. శైలి కూడా అదిరింది...కాకపోతే దొంగా దొంగాలో బాలూ నే గుర్తుకొచ్చారు....

నా బాధంతా
కష్టమంతా రబ్బరుకు పూసిన పన్నీరైందే అని


Monday, July 21, 2008

కరెంటు అఫైర్సు

కరెంటు అఫైర్సు వింటుంటే నవ్వొస్తోంది...
అసలు ఇప్పుడు కరెంటు కోతకి కారణం చంద్రబాబు అని రాజసేఖరుడు...కరెంటు కోసం ప్రాజెక్టులు కట్టలేదు ..అందుకనే ఈ కష్టాలు అని సారు వువాచ..తొమ్మిదేళ్ళు పాలించిన బాబు పట్టించుకోలేదు సరే అంతకు ముందు పాలించిన బాబులు ఏమి చేశారో...మరి.. ఏడాదికో ముఖ్యమంత్రి గా పాలించిన వాళ్ళు ఏమి చేశారో మరి...

వర్షాలు పడకపోతే పాత ముఖ్యమంత్రి చేసిన పాపం ఫలితం అని...వర్షం పడితే అది మా పుణ్యం అని..ఎక్కువ పడితే మరింకోటని...ప్రక్రుతిని కూడా రాజకీయం లోకి లాగుతున్నారు..మన నాయకులు...

క్రిందటేడాది.. రుతుపవనాలకి ఎదురెళ్ళి కేరళలో స్వాగతించారు ఒక
టీ వీ చానెల్ వారు..ఈ సారి వెళ్ళలేదేమో అందుకనే అలిగి రాలేదేమొ ఈ సారి రాలేదు మరి ఆ చానెల్ వాళ్ళు మళ్ళీ వెళ్ళి పిలుస్తారేమొ మరి ఆ నాయకుడు అడిగితే సరి..అన్నట్టు వాళ్ళే ఒక పత్రిక ఒక చానెల్ పెడుతున్నారుగా,,,ఇంక మరో చానెల్ ని అడగక్కర్లేదు..

అయ్యా....పక్క వాళ్ళని తరువాత దుమ్మెత్తిపోద్దాం...ప్రస్తుతం కరెంటు ఎక్కడ దొరుకుతుందో చూడండి ...ఎలాగూ రోజు రోజుకీ పెరిగే ధరలకి అలవాటుపడ్డాం...నిండా మునిగినవాడికి చలేముంటుంది...అది కూడా కట్టుకుంటాం...కరెంటిప్పిచ్చండి...చాలు...అదే పదివేలు....కావాలంటే దానికి కూడా ఇందిర ఎక్స్ట్రా కరెంటు అనో....రాజీవ్ అధిక కరెంటు అనో పేరు పెట్టుకోండి./..

Thursday, July 17, 2008

తెగులు సినిమా

ఇక నుంచి సినిమాల్లో డైలాగులు...స్క్రిప్టులు కొంత మంది నాయకులకి చూపించి..మరీ తియ్యాలనుకుంటా.. ప్రతిదాన్ని తొమ్మిదింతలు చేసి చూపించే చానళ్ళకి పనిలేక వాటిని ఇంకా బాగా ప్రేరేపిస్తున్నారు..ఒక్కళ్ళు కూడా మరి సగం సగం బట్టలేసుకుంటున్న హీరోయిన్లు..కత్తులతో నరికే హీరోలు...అసలు ఆడదంటే రేపులు చెయ్యడానికి మాత్రమే లేదా ఐటం సాంగు చెయ్యడానికే అనే విలన్లు...తాగి వాగే కమెడియన్లు...పెళ్ళన్ని తన్ని బ్రహ్మానందపడే హాస్య కళాకారులు......ఫాక్షన్ పేరుతో కొన్ని ప్రాంతాల్ని...బాంబులు పేల్చి ..చూపించే దర్శకులు.....కాలేజీ ప్రేమకథల్లో టీచర్లని జోకర్లు గా చూపించే వారూ.. బ్రాహ్మలు అంటే 'రెడీ ' గా దొరికే మటన్ బిరియాని తినే వాళ్ళలా చూపించే వాళ్ళూ....హీరో అంటే వీలైనంత వెదవలా చూపించే మహానుభావులు కనపడలేదేమో///// తండ్రి ని తిట్టుకోవడానికి మందుకొట్టి..రోడ్డుమీదపోయే వాళ్ళని కొట్టి...అర్ధరాత్రి ఇంట్లోంచి వెళ్ళి ఐస్క్రీం కొనుక్కుతినే అమ్మాయిని...ఇంట్లోకి తీసుకొచ్చి..పెట్టి...చివరకి..తండ్రి క్షమాపణ చెప్పే ఉత్తమ చిత్రాలని ఆదరించే మనవాళ్ళకి //////కాఫీ లాంటి టీచరు కి లైనేసే 18 యేళ్ళ ఇంగినీరింగు స్టూడెంటు..చిత్రాలు..హాపీగా 100 డేస్ ఆడేస్తాయి.....

Monday, July 14, 2008

చిరు మెగాస్టార్

తెలుగు సినిమా ...ఎలా ఉంటుంది... ముందు ప్రెస్స్ మీటు...ప్రస్తుతం అదే జరుగుతోంది.. మిత్రులు..మిత్రాలు...తమ్ముళ్ళు,,,,అళ్ళుళ్ళు...అందరూ ప్రెస్సు మీటు పెడుతున్నారు...మా సినిమా డిఫరెంటుగా ఉంటుంది..ఇంతకుముందున్న వాటిలా ఉండదు..కొత్త గా ఉంటుంది..రాస్ట్రమంతా హాయిగా ఐదేళ్ళు ఆనందంగా చూసేలా ఉంటుంది...అంటూ అచ్చం సినీ ప్రెస్స్మీట్లో లా మాట్లాడుతున్నారు..

హీరోయిన్ అంటే ముఖ్యమంత్రి పదవి..హీరోని కాక ఇంకెవరిని వరిస్తుంది.. మధ్యలో విలన్లు ఎంతమంది అడ్డుపడ్డా...చివరికి హీరోనే వరిస్తుంది..ఇది సినిమాలో కామన్ పాయింట్..ప్రస్తుతం షూటింగులో వుంది సినిమా.. డైరెక్టరుగారు ఎవరో సస్పెన్స్..నిర్మాత కూడా ఖర్చుకు వెనకాడట్లేదు..లొకషన్లు రౌజు రోజుకూ మారుతున్నాయి...భారీ సెట్టింగులేసి...జనాన్ని పోగేసి మరీ తీస్తున్నారు....సినిమాని..అఫ్కోర్స్ జనం పిలవకపోయినా వస్తారు...మెగా అభిమానంతో...

ఫైటింగులు కూడా ఉండచ్చు కొన్నాళ్ళ తరువాత ఎందుకంటే ..ఇది రాజకీయం అనే యాక్షన్ సినిమా..... కామెడీ కి కూడా కొదవేమి వుండదు.. ఎందుకంటే ఎవరు ఏమి మాట్లాడతారో ఒక్కోసారి తెలీదు దానితో భలే కామెడీ వస్తుంది....


ఒకటే ఆనందం ఈ సినిమాలో మాత్రం.. హీరోయిను,,,విలను...అందరూ తెలుగు వాళ్ళేఅ...
హీరో గారి విజయం చూడాలిక క్లైమాక్సులో....

Wednesday, July 9, 2008

తె దే ....జానె దేవ్...

తె దే ....జానె దేవ్...
తెదేపా తో తె దె అదే తెగ దెంపులు చేసుకున్న తె దే అంటే తెలంగాణా దెవేందర్...
జానె దేవ్..అంటున్నారు...తె దే పా వాళ్ళు... దేవేందర్ వెళ్తున్నాను అంటే ఊరికే అనుకున్నారు..కానీ నిజంగా వాళ్ల ఊరికి వెళ్ళాక తెలిసింది అది బెదిరింపు కాదు....ఫిరాయింపు అంతకన్నా కాదు....సొంత కుంపటి అని. విషయం తెలిసాక..మేకపోతు గాంభీర్యం తో జాన్ దేవ్ అంటున్నారు...కొందరు నాయకులు..
తె దె పా తెలుగు దేశం నుంచి తెలంగాణ దేశం పుడుతుందని వూహించని నాయకుడు ...మీకోసం తిరగాలా...వాళ్ళ కోసం తిరిగి రావాలా. అర్ధం కాక..ఆ రధం ఎటు తిప్పాలో తెలీక తిప్పలు పడుతున్నాడు..

మొన్ననే ప్రజల స్పందన బాగుంది,, బావమరుదులు,,వియ్యంకుడు., ఇంకా కొంత మంది నందమూరి నాయకులు...తన వైపు ఉన్నారు అని ఆనందిస్తున్న సమయంలో..ఈ గొడవ..తరువాత ఒక్కక్కరుగా రాజీనామాలు చేస్తున్న...తీరూ కొంచెం ఇబ్బంది కలిగించేదే....

చిరుగాలికి ఆకర్షించబడే నాయకులని ఆపడం వాళ్ళకి ఆ గాలి తగలకుండా..తెలంగాణం చేస్తున్న నాయకులకి దేవేంద్ర గ్నానం కలగకుండా...కాపాడుకోవలసిన పరిస్థితి కలిగి...కొంచేం డోలాయమాన పరిస్థితిలో పడ్డది..తె రా స ఎన్నికల ఆశ కొంచెం నీరుకారిన ఆనందం నిలవకుండా పోయినందుకు..బాధల్లో ఉంది...ఎన్ టీ ఆర్.... ట్రస్టు భవనం...ప్రస్తుతం...ఎవరు బయటకు వెళ్తున్నారో ..ఎవరు వెళతారో అన్నట్టుగా చూస్తోంది...అందులోనూ ఫిల్మునగరుకు దగ్గరలో ఉందాయె...అసలే...

Saturday, July 5, 2008

కలిసొచ్చే కాలానికి

కలిసొచ్చే కాలానికి


కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే .... అని తెలుగు సామెత ఒకటి ఉంది ... ఇదేదో కొడుకు గురించో మనవడి గురించో చెప్పట్లేదు...ప్రస్తుతం రాజకీయాలు దాని ప్రాభవం పరిస్థుతుల పై ప్రభావం గురించి అంటున్న మాటలు...

అప్పట్లో అన్న ఎన్ టీ ఆర్ రాజకీయాలలోకి వచ్చినప్పుడు అభిమానులు , ఆంధ్రా ఆడపడుచులు అందరు హారతులు పట్టి స్వాగతం పలికారు..అధికారం అప్పచెప్పారు....' అన్న ' అన్నందుకు రెండురూపాయల కిలో బియ్యం, మద్యపాన నిషేధం వంటి పధకాలతో ' అన్న ' మాట నిలబెట్టుకున్నారు... తొమ్మిది నెలల్లోనే అప్రతిహత కాంగ్రెస్స్ పార్టీ ని తొమ్మిది నెలల్లోనే ఆ పొజిషను లోంచి అపోజిషనులోకి దించారు....
తరువాత జరిగిన రాజకీయ పరిణామాలు...కుటుంబ కలహాలు, అన్నీ అందరికీ తెలిసినవే.....

కాని ఇప్పుడు సీను రివర్సు...

అభిమానులు అందరూ అన్నయ్య రాజకీయాలలోకి రావాలి అని అంటున్నారు...ఆలోచించుకునే టైము కూడా ఇవ్వట్లేదు...తొమ్మిది నెలలు నిండితేనే కదా ప్రసవం అయ్యేది కానీ ఎనిమిదో నెలలోనే పార్టీ అంటున్నారు ...అదే ఆగుస్టులో అని జనం గుస గుసలాడుతున్నారు... స్వతంత్ర దినోత్సవం....వారం తేడాలోనే అన్నయ్య పుట్టిన రోజు పండగ ఉన్నాయి.... 15నాడు జాతీయ జెండా ఎగరేస్తాము... 22న పార్టీ జెండా ఎగరేస్తాము అని తొందర పడుతున్నారు....కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదు అన్నది పాత సామెత... అభిమానులకు ముద్దొచ్చినా మూడొచ్చినా ఆగరు...ఇది కొత్త సామెత....

వెల్కం అన్నయ్యా....

Friday, July 4, 2008

వయాగ్రా....

వయాగ్రా....

వయాగ్రా అనేది ప్రపంచంలో ఈ మధ్య పరిచయం అక్కర్లేని పేరు.. ఎందుకు పనికొస్తుందో...ఎలా పనిచేస్తుందో ఇప్పుడు పనికట్టుకుని నేను చెప్పక్కర్లే.. అసలు కన్నా కొసరు ముద్దు అని...చేసే మేలు కన్నా తరువాత దాని వల్ల ఉన్న సౌకర్యాలు అన్నీ ఇన్నీ కావని తేల్చారు మేధావులు..ఈలోగ ఎంతో మంది ట్రై చేసి....ఫలితాలు చవి చూశారు....కొందరు చావూ చూశారు...అది వేరే విషయం అనుకోండి... ఇంతకీ నే చెప్పొచ్చేదేంటంటే...ప్రేమ కి వయసు తో సంబంధం లేదు... మీ ప్రేమ వ్యక్తం చేయడానికి స్వర్నభస్మం వూర పిచ్చుక లేహ్యం తో చేసిన మా గుళికలే వాడండి అని వచ్చే ప్రకటనలు కూడా ఇలాటివే.. ప్రేమ అంటే వాళ్ళు చెప్పే ' అది ' కాదు...

నిజం గా మీ ప్రేమ ప్రదర్శించాలనుకుంటే మీరు ఒక ట్రిప్ ప్లాన్ చెయ్యండి అది వయా ఆగ్రా ఐతే మీ ప్రేమ యాత్ర కు తిరుగుండదు...

వయాగ్రా --- ఆరోగ్యానికి చేటు

వయా ఆగ్రా-----ఆనందానికి రూటు

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Best CD Rates