Saturday, April 26, 2008

బ్యాటు పట్టిన రాజీవ్


అప్పుడెప్పుడో ఒక సినిమాలో కోటా శ్రీనివాసరావు రోడ్లూడుస్తున్నట్ట్లు, బోరింగ్ ఫంపు కొడుతున్నట్ట్లు, చీరలుపంచుతున్నట్ట్లు రక రకాల ఫొటోలు దిగుతూ కనిపించాడు...ఇప్పుడు ప్రభుత్వం కూడా అదే పనిలో ఉన్నట్టుంది...
శమ్షాబాద్ ఐర్పొర్ట్లో ----విమానం నడుపుతున్న రాజీవ్ఉప్పల్ స్టేడియంలో ====క్రికెట్ బాట్ తో రాజీవ్ఉప ఎన్నికలలో రేపు ====== వోటేస్తున్న రాజీవ్ఇంకా బస్సు నడుపుతున్న రాజీవ్విత్తనాలు పంచుతున్న రాజీవ్తెల్ల రేషన్ కార్డులు పంచుతున్న రాజీవ్
పాపం రాజీవ్ నిజంగా ఆ ఆటలు ఆడాడో లేదో కానీ రాజకీయాల కోసం ఆయనతో ఆడుకుంటున్నారు...
ఇందిరమ్మ్ ఇళ్ళ పధకం,, రాజీవ్ ఇంకేదో పధకం లా కొన్నాళ్లకి సోనియ మరుగుదొద్ల పధకం..రాహుల్ రోడ్లూద్చే పధకం లాతివి కూడా పెడతరేమో? ఈ గాంధీ భక్తులు ...
రాహుల్నిప్రసన్నం చేసుకునేందుకు ఏకంగా బాట్ తో రాజీవ్ ఫొతో తయారు చెసిన నాయకులని అడగాలి మరి

Tuesday, April 15, 2008

వారసత్వం పౌరసత్వం

వారసత్వం పౌరసత్వం
రాజకీయం అంటే ప్రజలకు సేవ చేయడమని ఏ నాయకుడైనా అనుకుంటాడో లేదో డౌటే?
ప్రజలకు నాయకత్వం వహిస్తూ వాళ్ళ సమస్యలని పరిష్కరించే ప్రయత్నం చేసే వాడే అసలైన నాయకుడు,,
ఈ రోజుల్లో ఈ రాజకీయ నాయకత్వం వారసత్వం గా అందుతోంది మరి !
నెహ్రూ గారమ్మాయి "ఇందిర" ఇండియా indi(r)a కి భవిష్యత్తు నాయకురాలిగా ఎదిగింది...
తండ్రి వారసత్వాన్ని చేపట్టి దేశాన్ని ఏలింది...హాయిగా "గాలి' లో విహరించే స్వేచ్చా జీవి రాజీవ్ తల్లి మరణం తో సడెన్ గా రాజకీయాలలోకి లాండ్ అవ్వాల్సి వచ్చింది॥
దేశానికి ఏదో చెయ్యాలనుకున్న సంజయ్ పాపం కాలం కలిసి రాక తల్లికన్న ముందే వేరే లోకానికి వెళ్ళిపోయాడు॥
రాజీవ్ కూడా తీవ్రవాదుల చేటిలోఅ హతమైపోయాడు....
మళ్ళి కధ మామూలే నాయకత్వానికి పాపం ఎవరికీ సీనియారిటి చాలక సోనియా ని నాయకురాలిని చేసారు......
రావద్దొనుకున్నా రాహుల్ ని రాజకీయాలలోకి లాగేశారు॥ తండ్రి పోలికలతో పాటు పొలిటికల్ కరీర్ కూడా అంటగట్టేసారు....

ఆంధ్ర లో ఎన్ టీ ఆర్ కి వారసత్వం గా ఎవరు వస్తారో అని ఎదురుచూసిన రోజుల్లో సడెంగా తెరమీదకొచ్చిన లక్ష్మి పార్వతి ॥తరువాత కనుమరుగైపోయింది...
చక్రం తిప్పిన అల్లుడు చంద్రబాబు వారసుడయ్యడు...నాయకుడు అయ్యాడు ....అసలు పార్టీ స్థాపించిన పెద్దయనకన్నా 'పవర్' ఫుల్ అయ్యాడు...మరో అల్లుడు కొన్నాళ్ళు మంత్రిపదవితో సంత్రుప్తి పొందినా పెదవి ఇప్పే చాన్సులు రాక వైరిపక్షం చెయ్యి అందుకుని అందలం ఎక్కేసాడు॥ఆయన భార్య కూడా మంత్రి యోగం పొందారు....ప్రస్తుతం మళ్ళీ లక్ష్మీ పార్వతి అన్నగారి ఆశయాలను నిలబెట్టగల ఒక్క మగాడు వై ఎస్ అంటూ కితబిస్తున్నారు...అటు చంద్రబాబేమో నందమూరి వారసులు అధికపక్షం నా వైపే అంటూ రెండు వేళ్ళు చూపిస్తున్నారు॥ఒక పక్క వియ్యంకుడైన యువరత్నం తో పాటు రాజ్య సభలో సీటిచ్చి మరో బావమరిది చైతన్య రధ సారధి ని ఆకట్టుకున్నారు॥ఆయన వారసులు కూడా వెండితెర హీరోలు కాబట్టి వారి మద్దతు కూడా నాదే అని ధంకా పధం గా చెప్తున్నారు...ఇంతకీ ఎన్ టీ ఆర్ వారసులెవరు॥ భార్యా,। కూతురా, అల్లుడా, కొడుకులా, మనుమలా.....వై ఎస్సా ? రెండురూపాయలకు కిలో బియ్యం పధకం ఎన్ టీ ఆర్ నుంచి వారస్త్వం గా పుచ్చుకున్న వై ఎస్ కూడా...వారసుడేనేమో?

కె సి ఆర్, పి జె ఆర్, ల పిల్లలు కూడా రాజకీయ రంగప్రవేశం చేస్తున్న సూచనలు ఆల్రెడీ రెడీ గా వున్నాయి...
ఇవన్ని వూహించేనేమో పాపం గాంధీ గారు......మనందరిని వారసులని చేసి జాతిపిత అయి పోయారు.....

Monday, April 7, 2008

సర్వధారి నామ సంవత్సర శుభాకాంక్షలు...


సర్వధారి నామ సంవత్సర శుభాకాంక్షలు...

సర్వధారి ఐనా మన నేతలని సరైన దారిలో నడిపించాలని..కోరుతూ...మీ ఫణి మాధవ్..

కాంగ్రెస్ రాశి వారు...
ఆదాయం వేల కోట్లు...వ్యయం వందలు
రాజ పూజ్యం ఫుల్లు అవమానం నిల్లు
హామీలు బోలెడు అమలు చిప్పెడు

తెలుగుదేసం రాశి వారు

ఆదాయం పాతవే వ్యయం రాజ్యం వచ్చేవరకు
రాజ పూజ్యం గతం అవమానం వర్తమానం
ఆశలు అధికారం నిజం మిధ్య

తెలంగాణా రాష్ట్ర సమితి రాశి వారు

ఆదాయం సెంటిమెంటు వ్యయం అపయింట్మెంటు
రాజ పూజ్యం సోనియ దయ అవమానం జనం దయ
ఆశ ప్రత్యేక రాశ్త్రం నిజం కేంద్రం పెత్తనం

భారతీయ జనతా రాశి వారు

ఆదాయం ఖతం వ్యయం నిత్యం
రాజపూజ్యం గతం అవమానం పత్యం
ఆశ ప్రభుత్వ నిర్వహణ ఆశయం రామాలయ స్థాపన

కమ్యునిస్టు రాశి వారు

ఆదాయం ప్రజల పాట్లు వ్యయం ప్రజా ఆందోళణలు
రాజపూజ్యం కలకత్తా అవమానం కొత్త
ఆశ ప్రజా ప్రభుత్వం నిజం మద్దతులు పొత్తులు

ఏమిటో ముఖ్యం గా ఐదు రాశులు కనిపిస్తున్నాయి మిగతావి కొంచెం తరువాత

ఉగాది శుభాకాంక్షలతో

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Best CD Rates