Friday, February 19, 2010

వేలంవెర్రిడే

వేలంవెర్రిడే
వేలంవెర్రిడేకి స్వాగతం..సుస్వాగతం..ప్రేమించుకోవడానికి ఒక రోజు..ప్రేమను తలుచుకోవడానికో..తెలుపుకోవడానికో..పంచుకోవడానికో..దేనికో అర్ధం కావట్లా..
అసలు ఈరోజు ఎందుకు పుట్టింది.
క్లాడియస్ అనే రాజు గారు సైనికుల్ని పెళ్ళి చేసుకోవద్దు అని ఆంక్ష పెడితే అది నచ్చని సైంట్ వేలంటైన్ అనే ప్రీస్టు ఎవరికీ తెలియకుండా పెళ్ళిళ్ళు జరిపించేవాడు..ఒక సారి పట్టుబడి ఉరి శిక్షకు గురి అయ్యాడు..జైల్లో ఉన్నప్పుడు జైలరు గారమ్మాయితో స్నేహం కుదిరి మంచి మాటలు చెబుతూ ఉండడం వల్ల మంచి మిత్రుడయ్యాడు చివరకి ఫిబ్రవరి 14న ఉరి తీయబడ్డాడు..ఉరితీతకు ముందు ఆ జైలరు గారమ్మాయికి పంపిన లేఖలో ప్రేమతో నీ వేలంటైన్ అని చివరిమాటగా వ్రాశాడు అందుకని ఆయన అంటే ఇష్టపడే వాళ్ళూ ఆయన వల్ల పెళ్ళి చేసుకున్న వాళ్ళు అందరూ ఆయన మీద గౌరవం కొద్దీ ఆరోజుని వేలంటైన్స్ డేగా జరుపుకోవడం రివాజుగా మారింది..ఇది నాకు తెలిసిన చరిత్ర....
అయితే అసలు ఆయన త్యాగానికి విలువ నిచ్చి జరుపుకుంటున్నారా ఈ ప్రేమికుల రోజుని..డేటు గుర్తుంది కదా అని జరుపుకుంటున్నారా అని అర్ధం కావట్లేదు..గులాబీలు, గ్రీటింగు కార్డులు, గిఫ్టులు లాంటివి ఇచ్చిపుచ్చుకోవడమేనా లేక భవిష్యత్తు గురించి ఆలోచన వుందా అన్నది అనుమానమే.. అమ్మా నాన్న లకి తెలియకుండా ఏదో ఒకటి చేసి అమ్మాయి అబ్బాయి కలిసి ...పార్కులకి,,హోటళ్ళకి, పబ్బులకి, సినిమాలకి షికార్లకి తిర్గడం...కాదు ప్రేమ అంటే..సైంట్ వేలంటైన్ కూడా ప్రేమించుకున్న వాళ్ళకి పెళ్ళి చేసాడు కానీ వదిలెయ్యలేదు తిరగమనలేదు...పెళ్ళి అనేది బాధ్యత ని గుర్తుచేస్తుంది..భవిష్యత్తుని నిర్దేసిస్తుంది...బంధాన్ని బలపరుస్తుంది...ఊరికే తిరిగి....తిరిగి..అలిగి..విసిగి...మధ్యలో మారిపోయే ప్రేమలు నిలబడవు...e-తరం అబ్బాయిలూ అమ్మాయిలూ ఒకరినొకరు ఏమి చూసి ఇష్టపడుతున్నారో..అది ప్రేమో ఇంకోటో సరిగ్గా తెలుసో లేదో అని అనిపిస్తుంది నాకు ఎందుకంటే..చూడ్డానికి బాగున్నారనో..మంచి పని చేసారనో..బాగా మాట్లాడతారనో..మంచి చదువుందనో ..ఒకేఅ రకమైన టస్టు ఉందనో..ఇలా ఏదో ఒక క్వాలిటీ చూసి ప్రేమ అనుకునే ఒకరకమైన ఫీలింగులో పడి అది ఏమిటో తెలిసే లోపలే పెళ్ళీ,,,కొన్నాళ్ళకే అపార్ధాలూ అలకలు..లుక లుకలూ,..పెటాకులూ...
కావాలంటే పెళ్ళయ్యాక భార్య భర్తని>>>>భర్త భార్యని ప్రమించవచ్చు>>>ప్రస్తుతం అమ్మా నాన్నలని ప్రేమించండీ మీ చదువుని..లక్ష్యాన్ని ప్రేమించండి..సమాజాన్ని ప్రేమించండి...ఇంక ఓల్డేజి జోముల్లోకి వెళ్ళకపోతే మీ తాతా< అమ్మమ్మ< నానమ్మలని ప్రమించండి///దేశాన్ని ప్రేమించండి///ఆ తరువాత పెళ్ళి చేసుకోండి అప్పుడు ప్రతీ రోజూ ప్రేమికుల రోజే...సైంట్ వేలంటైంకి అదే నిజమైన నివాళి....




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

Thursday, February 18, 2010

అమ్మాయకత్వం

అమ్మాయకత్వం
అమ్మాయిల అమాయకత్వం చూస్తుంటే జాలేస్తోంది. వీళ్ళ అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని కొంతమంది మగాడిదలు..అచ్చోసిన ఆబోతుల్లా రెచ్చిపోయి..తల్లి - చెల్లి కూడా సిగ్గుపడేలా చేస్తున్నారు. గాడిదలు, ఆబోతులు కూడా అలాటి మగాళ్ళతో పోల్చినందుకు బాధపడతాయేమో..

నిన్నా మొన్నా సినిమా థియేటరాయన ఇప్పటికే అష్ట భార్యలని..కష్టాలు పడ్డవాళ్ళలో ఒకామె బయటకి ధైర్యంగా వచ్చి చెబితే తెలిసింది. ఇలాంటి నికృష్టులని బహిరంగంగా రోడ్డు మీదకి తెచ్చి తగిన శాస్తి చెయ్యాలి. అది అన్ని టీవీల్లో లైవ్ చూపించాలి. అప్పటికైనా కొంతమందైనా భయపడో..బుద్ధొచ్చో బాగుపడతారేమో అనిపిస్తోంది.

ఈ మధ్య ఒక ఫంక్షన్ కి వెళ్ళా..అక్కడ ఒక పెద్ద పదవిలో ఉన్న ఒకావిడ గెస్టు,,అది మహిళా కార్యక్రమం....కానీ ఆవిడతో పాటు వాళ్ళాయనా అక్కడ ప్రత్యక్ష్యం. ఆవిడతో పాటు ఆయనా స్టేజి మీద...అఫ్కోర్స్ ఆయనా లీడరే ఏదో ఆ సీటు లేడీస్ కోటా లో ఉండడం వల్ల ఆవిడని నుంచో పెట్టి గెలిపించుకున్నట్టున్నాడు. ఒక వేళ ఆ పదవి లో ఆయనుండి...అదే మహిళా కార్యక్రమానికి ఆయన గెస్ట్ గా వెళితే..మరి వాళ్ళావిణ్ణి కనీసం అక్కడికి తీసుకెళతాడా అని నా అనుమానం. ఏ, ఇంటిని, కుటుంబన్ని నడపగలిగే స్త్రీ సమాజం లో తన ప్రజలని సరిగా నడపలేదా? ఎందుకు ఆ రకమైన వివక్ష చూపిస్తారో అర్ధం కాలేదు.

కానీ ఒక్కోసారి సినిమాలు చూస్తుంటే ఆ హీరోయిన్ ల ని చూస్తోంటే వీళ్లకి ఎందుకీ ఖర్మ అనిపిస్తుంది.




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

Saturday, February 6, 2010

సెన్సారు చేసేవాళ్ళకు సంసారాలు పట్టవా

 సారీ మా ఆయన ఇంట్లో ఉన్నాడు...
అబ్బ ఎంత గొప్ప టైటిలో..పోస్టర్ చూస్తేనే అసహ్యం వేసింది..అసలు అలాంటి ఐడియాలు ఎలా వస్తాయో ఆ మహానుభావులకి.

సెన్సారు చేసేవాళ్ళకు సంసారాలు పట్టవా అని నా డౌటు. సెన్సారంటే ఏంటో ఎందుకుందో కూడా నాకర్ధం కావట్లేదు. టైటిలూ గురించి వాళ్ల పరిధిలోకి రాదా...లేక సినిమా చూసేసి ఏదో ఒక సర్టిఫికేటు ఇవ్వడమేనా వాళ్ల పని అని నాడౌటు.

అందులోనూ ఈమధ్య..ఓ సినిమాలో రింగ రింగా అంటూ వచ్చిన పాటని తరువాత ఎవరో అభ్యంతర పెట్టినందుకు గాను మార్చారు..అలానే అదుర్స్ లోనూ ఒక మాట మార్చారు. మరి సెన్సారు సమయంలోనే ఇవి ఎందుకు జరగడన్లేదో మరి?

స్త్రీలని, అంగవైకల్యాన్ని, సాంప్రదాయాల్ని, కులగౌరవాన్ని, మత విశ్వాసాల్ని, భాష, ప్రాంత గౌరవాల్ని, చరిత్రని కించపరిచే విధం గా ఉన్న వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఖమించకూడదు అన్న ప్రాధమిక సూత్రం వీళ్ళకి వర్తించదేమో అని నాకు మరో డౌటు. ప్రజల ముందుకెళ్ళబోయే ముందే మనం చూస్తున్నాం, రేపు మన పిల్లలో ..ఆ వయసు వాళ్ళో చూస్తారు అన్న కనీస బాధ్యత వీళ్ళకు గుర్తురాదెందుకో.?

A సర్టిఫికెట్ అంటూ ఇస్తే దాని అర్ధం ఏమిటి..పాటించవలసిన నియమాలేంటి..పోస్టర్ మీద కనిపించే విధం గా ఉండాలి, 18 ఏళ్ళ లోపు వాళ్ళకి చూసే హక్కు లేదు....ఇలాంటి విషయాలు ఇంకా ఏమన్నా ఉన్నాయా?


నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Best CD Rates