Monday, January 28, 2008

ఎవడైతే నాకేంటి....




ఇది రాజసేఖర్ సినిమా కాదు..' చిరు ' అభిమానులు 'చిర్రు 'బుర్రులాడుతూ మాట్లాడుతున్న మాట.. మామూలుగా ' అన్న ' మాటలకి పంజాగుట్ట లో పట్టుకుని కారుకూతలు కూస్తావా అంటూ కారు వెంబడి పడి మరీ చితక్కొట్టారు..తన సినీ 'జీవితం ' లో ఇలాంటి సంఘతనలు చూసినవాడు కాబట్టి షాకైనా నేర్పుగా తప్పించుకుని నేరుగా మీడియా వాళ్ళకి చెప్పుకున్నాడు ...అటు కలిసి వచ్చిన అర విందు తో (పాపం తినకుండా వచ్చేసాడు) ఇంటికి వచ్చిన చిరు చిన్నపిల్లలతో కాసేపు మాట్లాడి ....ఆ దంపతులు వచ్చేదాకా ఆగి సారీ చెప్పి మరీ తనేంటో నిరూపించుకున్నాడు...ఇక రాజకీయ నాయకులు ఇంకా కొంతమంది దీనికి కావలసిన రంగు పులుమడానికి లైన్ కట్టారు..
అటు అభిమానులను చూస్తే అన్నయ్యకి ఇష్తమున్నా లేకపోయినా కొన్ని పనులు చేసేస్తున్నారు....... చూస్తుంటే వీళ్ళే పార్టీ పెట్టేసి ..పోటీ చేసేసి...ఫొటో పెట్టేసి పరిపాలన చేసేలా ఉన్నారు..తమ్ముళ్ళార మీకంత తొందర వద్దు.. అన్నయ్య కి యెప్పుడు రావాలో తెలుసు........కాస్త ఆలోచించుకోనీయండి......మీరు మరో ముగ్గురికి సాయం చేయండి...మరో మూడు తల నొప్పులు తేకండి...
చిరు కోపం కూడా రాని చిరు మీ వల్ల ఇవాళ సారీ చెప్పాల్సి వచ్చింది...ఇది మంచిది కాదు..మంచికీ కాదు...
కంటి చూపుతో చంపడం కాదు కంటి చూపు ఇవ్వమని ఐ బాంక్ పెట్టిన వాడికి మీరిచ్చే విలువ ఇదేనా?
తప్పు నావైపు వుంది కాబట్టి తలవంచుకు వెళ్ళిపోయా
అని అప్పుడెప్పుడో ఇంద్ర లో అన్నాడు కానీ ఇప్పుడు తప్పు ఉన్నది అభిమానులదా ఆయనదా...

Monday, January 21, 2008

క్రూర జంతువు---కూర జంతువు


శాకాహారం
ఎందుకో ఇవ్వాళ ఈ విషయం గురించి మాట్లాడాలనిపించింది....ప్రపంచం లో రెండు రకాల ఆహారాలు...శాకాహారం///మేకాహారం//అఫ్ కోర్స్ మేక ఆహారం కూడా శాకాహారమే..
ఇక జంతువుల్లో కూడా రెండు రకాలు..ఒకటి క్రూర జంతువులు..రెండు కూర జంతువులు.. అంటే కూరగా మారే జంతువులు....
పొద్దున్నే నిద్రలేపుతుందన్న కోపం తో పాపం దాని వంశ వ్రుక్షాన్ని ఆంలెట్ పేరుతో లాగించేస్తారు..
ఇక రాత్రికి వుండుకు తినేస్తే పొద్దున్నే నిద్ర లేపదు కదా అందులోనూ ఆదివారం తినేస్తే సోమ వారం దాని బాధుండదు..
వీలైతే సాయంత్రం మందులోకి ప 'కోడి ' గానైనా పరవాలేదు మనోళ్ళకి....
ఇక మేకలూ అంతే గాంధీ గారికి పాలిచ్చినా... పాపం ఆయన జయంతి రోజున కూడా వదలకుండా తింటారు.. దుకాణాలు బంద్ ఐనా తెరిపించి మరీనూ..
కాకపోతే దానికి ఒక విషయం లోమాత్రం సంతోషంగానే వుంటుందిట మామిత్రుడు కామేస్వర రావు అన్నట్టు ...బక్రీదు కైనా బోనాలకైనా కుర్బాని నేనే అని దానికి గర్వం...
ఏదైనా ఆదివారం కావాలంటే తినండి కానీ ఆదివారం కేవలం తినడం కోసమన్నట్టు కాక కనీసం ఆరోజైన ఆడవాళ్ళకి శలవిచ్చి సరదాగా నల భీమ అవతారం ఎత్తితే మనం ఏది పెట్టినా అనాందంగా తింటారు..వాళ్ళు..మనం తిండం కోసం పుట్టలేదు బతకడం కోసం తిందాం...
పక్కన శాకాహారులుంటే వాళ్ళకి ఇబ్బంది కలిగించకుండా తిందాం....
ఓకే లేటవుతోంది మా ఆవిడ పిలుస్తోంది .....భోజనానికి కాదు .....వంట త్వరగా మొదలెట్టమని.....ప కోడి వెయాలిట....శాకాహారమే లెండి....

Saturday, January 19, 2008

డాన్ స్ స్ స్ స్


ఇది నా యాభయ్యవ పోస్టు...ఆనందంగా ఉంది...ఇంత చక్కని వేదిక తయారు చేసినవారందరికీ వందనం.....










డాన్ స్ స్ స్ స్
డాన్స్ చేయాల్సిన వాళ్ళు డాన్ చేస్తే ఇలానే ఉంటుంది అనిపించింది.. ఈ మధ్య వచ్చిన ఆ సినిమా చూస్తే... టైటిల్ తీసుకున్న వాళ్ళు కథ కూడా తీసుకుని ఉంటే ఇంకా బాగుండేదోమో అనిపించింది... మాస్ ఆడింది కనక ఇది కూడా ఆడుతుంది..తను ఆడింది ఆట పాడింది పాట అని ఆ దర్శకుడి ఉద్దేశ్యం కాబోలు..అందుకే మ్యూజిక్కు కూడా చేసిపారేసాడు మన మొహాన...నడవాల్సిన చోట డాన్సు చేసినట్టు కథ కూడా నడవాల్సిన చోట డాన్సు చేసిందిల్...ముల్టీ స్టార్ చిత్రాలు రాని కొరత తీరుద్దామని అనిపించి అలా చేయాల్సొచ్చిందని పాపం ఆ హీరో గారన్నా ఇది పల్టీ స్టారర్ చిత్రం అనొచ్చేమో...
ఇక ఒక్క మగాడు గురించి తలుచుకుంటే....భారతీ(సర్దార్ పాపారా)యుడు గుర్తుకొచ్చారు.....స్వాతంత్ర్య సంగ్రామం లో పోరాడిన పెద్ద మగాడికి ఆ సిమ్రాను కాక యే భానుప్రియ లాంటి కాస్త నటన తెలిసిన వాళ్ళని పెట్టుంటే బాగుండేదోమో...ఇక ప్రేక్షకులకి కనువిందు "యోగం" కలిగించడానికి అనుష్క యెలానూ ఉంది... ప్రదర్షనకు ప్రియంక ......ఒక్క సారి నిర్ణయం తీసుకుంటే ఇక వెనక్కి తిరిగేది లేదు.....
వెలిసింది వాన...ధియేటర్లోనా అని పాడుకోవాలేమో..ప్రస్తుతం మ(బ)కర సంక్రాంతి రాజు.....మంగార మలై ని తెలుగులోకి కనడం వల్ల కంగారు మలై అయి కంగాళి అయినట్టుంది..వేలెడతారనేమో ఆస్థాన విద్వాన్సుల్ని కాదని కొత్త కాంబినేషన్లో చేసిన సినిమా ప్రస్తుతం వానా కాలం కాకపోవడం వల్లో ? కాలం కలిసి రాకో కొంచెం వెలిసీనట్టూ గానే వుంది ..
పండగ నాడు విడుదలయ్యే సినిమాలకోసం యెదురుచూసే సగటు అభిమాని ప్రస్తుతం తీగకు తగులుకున్న పతంగి లాంటి వీటిలో యేవి చూడాలో తెలియక ....టీవీ ని నమ్ముకున్నట్టున్నాడు...

Friday, January 11, 2008




సంక్రాంతి శుభాకాంక్షలు, మామూలుగా పంట చేతికొచ్చినందుకు చేసుకునే పండుగ ఇది..కానీ ఈసారి జరిగిన పెంటలను తలుచుకుంటే...అసలు పండుగ చేసుకోవాలంటేనే దిగులుగా ఉంది..బాంబుల తో రక్తసిక్తమైన రాజకీయ నాయకుల జీవితాలు...ఎందరినో సోకంలో ముంచి పోయిన జనార్దనులు..లేచిపోయిన పెళ్ళిళ్ళు...బలవంతంగా రాజకీయాలలోకి లాగుతున్న మెగా అభిమానుల తొందరపాట్లు .....పెరిగిపోతున్న ధరలు.....సంచలన వార్తలకోసం ప్రతిదానినీ రచ్చకెక్కిస్తున్న చానెళ్ళ విశ్రుత విక్రుత కార్యక్రమాలూ....కొత్తదనం లేక పోయినా టైముకి వాలిపోయే కొత్త సినిమాలూ......ఇలా చెప్పుకుంటూ పోతే నాలాగా అంతా నెగిటివ్ గా మాట్లాడే కొందరూ....ఇవన్నీ చూసే కాబోలు ఆ గంగిరెద్దు పరిగెడుతోంది...
ఐనా రేపు అనేది ఆశావహం కాబట్టి అందరికీ
సంక్రాంతి శుభాకాంక్షలు

Tuesday, January 8, 2008

నిత్య క్రుషీ వలుడు


క్రుషితో ఆస్తి దుర్బిక్షం

కరెక్టు గానే చదివారు.. ఎంత క్రుషి చేసినా పట్టుకోలేక పోయిన పోలీసులకు స్వచ్చందం గా లొంగిపోయిన క్రుషీవలుడు వెంకటేశ్వరరావు ...ప్రస్తుతం జైల్లో తన విద్యని ప్రదర్సిస్తున్నాడట.. ఆయన రంగమైన పెట్టుబడుల వ్యవహారాలని జైల్లో ఉన్న పోలీసు బాబాయిలతో పంచుకుని.. సదరు బాబాయిలతో షేర్లు కొనిపించాడట ప్రస్తుతం ఆ భాగోతం లో చేతులు కాల్చుకున్న మహానుభావులు బాబోయి అంటున్నారట... ప్రాక్టీసు పోకుండా వుండడానికి మంచి ప్లానే వేసాడు మనవాడు.. ఇంటికన్నా విదేశం పదిలం పైసలైపోయాక జైలు పదిలం అని స్వయం క్రుషి తో జైలుకొచ్చిన వెంకటేశ్వర రావు....వదిలి పెట్టిన విషయాలు లేవు....ఆ మాటనమ్మిన వాడికి పైసలు తిరిగి రావు....జైలుకెళ్ళినా ఆ బుద్ధులు పోవు ...

howzzatt??


సిల్లీ టెస్ట్
అంతా నువ్వే చేసావు, అంతా నీవల్లే, నాకు గట్టిగా అరవాలనుంటుంది..నేను ఔటవ్వలేదు .. అని...ఇదేదో బొమ్మరిల్లు సినిమాలో డైలాగు కాదు.. మొన్నటి టెస్ట్ లో మన భారత ఆటగాళ్ళ మనసులో మూగగా అరిచిన అందరి బాధ.. మామూలుగా బ్యాట్స్మెనో, బౌలరో అడాల్సిన ఆట లో ఈసారి అంపైర్లు వేలెట్టారు....భయంకరంగా ఉండే సైమండ్స్ అనే అమాయకుణ్ణి బల్లి పిల్ల లా ఉండే హర్భజన్ నానాజాతి మాటలూ అని భయపెట్టాడని పాయింటింగ్ చేసిన పాంటింగ్ సేన గెలవడమే ముఖ్యం మాకు ఎలాగైనా సరే అన్న రీతిలో క్రీడా స్ఫూర్తి కి మంటపెట్టి 16 గెలుపుల ఆనందాన్ని చలికాచుకుంటోంది....పాంటింగ్ ని చూస్తే నువ్వే బాటింగ్ చేస్తవ్ నువ్వే బౌలింగ్ చేస్తావ్ నువీఅ అంపైరింగు చేస్తావు ఇక నా ఆట కూడా నువ్వే ఆడేస్తే మేమెందుకు ఇక్కడిదాకా రావటం అని వాపోతున్నారు పాపం మన టేమిందీ....అసలే ఆడక ఆడక ఆడుతుంటే ఇలా అంపైర్ల చేతిలో వోడడం మనవాళ్ళకస్సలు ఇష్టం ఉండదు..
నువ్వౌటంటే నేకాదంటానా అంతూ అంఫైరింగ్ చేసిన ఆ మహానుభావులకి కళ్ళు బైర్లు కమ్మినాయేమో ఒక సారి చూపించుకుంటే మంచిది ఇక నుంచైనా వాళ్ళు పాంటింగ్ కళ్ళతో కాకుండా తన కళ్ళతో చూసి అవుట్ ఇస్తే బాగుంటుంది..ఫాం అనేది ప్లేయర్ల్కే కాదు వీళ్ళకీ ఉంటుంది అన్నమాట.. ఐతే ఇది స్కాం అనో స్పాం అనో అనాలేమో,,,,

howzzaatt??

అని అంపైర్లు కూడా అరిచే రోజులు కూడా చూడగలిగిన మనం ధన్యులం....


Friday, January 4, 2008

ఏనుగెక్కిన టైగర్





కంగారు పడకండి.. మన టైగర్ నరేంద్ర ప్రస్తుతం టి ఆర్ ఎస్ కారు దిగి బి ఎస్ పి ఏనుగు ఎక్కారు.. సడ్డెన్ గా చంద్రశేఖర్ ద్రోహి అంటూ గాండ్రించారు.. మన సారు వాడు , సెపరేట్ తెలంగాణా స్టేట్ వస్తె అది నావల్లే అంటారు సారు.. బి జె పి వాళ్ళు తెలంగాణా విషయం లో ఒక నిర్నయం తీసుకోకుండా ప్రజల చెవిలో కమలం పువ్వు పెడుతునారు..అందుకే ప్రస్తుతం బి ఎస్ పీ లో కొచ్చా.,, అన్నారు టైగర్... ఏ పార్టీ నుంచి నుంచున్నా గెలిచి తీరతా అని ధీమా గా ఉన్నారు నరేంద్ర.... పైగా ఆయన వొచ్చిన వేళా విసేషం ఏమిటో రాయల్ బెంగాల్ టైగర్ పవన్ కళ్యాన్ కూడా చేరనున్నట్లు మీడియా లో అప్పుడే కొన్ని పుకార్లు షికార్లు చేస్తున్నాయి..అసలే సమస్యల్లో ఉన్న ఆ ఫామిలీ పేరు దీన్లోకి కూడా లాగడం ఇప్పుడవసరమా.....ఏదో ప్లాట్ఫాం మీద నిలబడి రైలు కోసం ఎదురు చూస్తున్నారు...కావాలంటే వాళ్ళే ఒక సొంత రైలో విమానమో కొనుక్కోగలరు.. కాబట్టి వాళ్ళ విషయం వాళ్ళకి వొదిలేసి ప్రస్తుతం మన గురించి ముచ్చటించుకుందాం...

Wednesday, January 2, 2008

పాత సంవత్సరం
2007 లో ఏమి సాధించామని చూసుకుంటే ఏమీ లేదనిపించింది

మామూలుగానే
రాజకీయపు అరుపులు, గోలలతో ముగిసిన అసెంబ్లీ...
ప్రజా సమస్యల పై పోరాడే వేళ తిట్టారని పాపం నిద్ర పట్టక
ఉపక్రమించి రాబోయె ఎన్నికల గురించి కలలు గన్న ప్రతిపక్ష నేత నిద్రించిన అసెంబ్లీ..

కాళ్ళు నెప్పుట్టేలా తిరిగి తిరిగి సంపాదించిన అధికారం
నోళ్ళు నెప్ప్ట్టేలా తిడతాం పడండి అనే రాజసం చవి చూసిన అసెంబ్లీ..

బాంబు దాడితో రక్త సిక్తమైన శాంతి కి చిహ్నంగా పేరు సంపాదించిన
బుద్ధుడు కొలువైన సాగర తీర లుంబిని

ప్రజా స్వామ్యం కోసం పుట్టో
ోరాడి అసువులు బాసిన ముసల్మాను దేశాల చరిత్రలో తొలి మహిళా ప్రధానిగా చరిత్ర స్రుష్తించిన బుట్ట


తలుచుకుంటే కడుపు తరుక్కు పోతోంది...

సాధించిన విజయాలు 20-20 ఐతే పోగొట్టుకుంది 80-80 అనుకోవచ్చేమో..

సినీ నటుల రాజకీయ రంగప్రవేశం గురించిన పుకార్లు...
లేచిపోయిన వాళ్ళని సెలెబ్రిటిఎలుగా చేసిన ఛానళ్ళు....
రోదసి నుంచి తిరిగొచ్చిన సునీతా విలియంస్ సాహసాలు,..
ప్రపంచ రెకార్డులు తిరగ రాసిన భారతీయ వీరులు...


ఏమి సాధించామో తెలుసుకునే లోపల సంవత్సరం గడిచిపోయింది.. రాబోయే సంవత్సరమైనా మంచి చేకూర్చాలని కోరుకుందాం....

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Best CD Rates