Friday, July 23, 2010

మర్యాద జక్కన్న

మర్యాద రాజన్న..మర్యాద జక్కన్న...మర్యాద రామన్న
 ఏమనాలో తెలీదు కానీ...చాలా కాలం తరువాత ఫ్యామిలీతో అంటే..అమ్మా నాన్నా భార్యా బిడ్డా కలిసి కాసేపు హాయిగా నవ్వుకునే సినిమా చూసిన ఫీలింగు కనిపించింది..అనిపించింది..ఈ సినిమా చూసినంత సేపూ..

మగధీర లేకాదు మర్యాద రామన్ననూ తియ్యగలను అనిపించుకున్నాడు జక్కన్న ఉరఫ్ స్యూర్ సక్సెస్ రాజమౌళి.

ఎంత సేపు కడప లో మొదలయ్యే కధలు..టాటా సూమోలు పేలడం..కత్తులు బాంబులే కాదు గడపలోపల జరిగే మర్యాద..మర్యాదకు..ఆచారానికి వాళ్ళిచ్చే మర్యాద..బాగా చూపించారు.

తెలుగు అమ్మాయి కాకపోయినా రాజమౌళికి చిక్కిన జక్కన్న  చెక్కిన సలఒని బాగానే ఉంది..ఎక్స్పోజింగు కాదు ఎక్స్ప్రెషన్ ముఖ్యం అని గుర్తించిన అతి కొద్ది మంది డైరెక్టర్లలో రాజమౌళి ఒకడు..అతి అనిపించకుండా శృతి మించకుండా,,అందం గా చూపించారు..

ప్రభుదేవాకే డ్యాన్స్ నేర్పిన సునీల్ డ్యాన్సులు బాగా చేశాడు..

పౌరుషాల కోసం చంపుకోవడమే కాదు..ఆచారం కోసం మర్యాద కోసం విలువనిచ్చే కొత్త కడపని చూపించారు..ఏంటో చాలా కాలం తరువాత ఒక సినిమా గురించి పాజిటివ్ గా రాసేస్తున్నా..

ట్రైన్ ఎపిసోడ్ ఇంకా ఉంటే బాగుండేదనిపించింది...ఈ చిత్ర రచయిత కాంచీ గారు ఉన్న కాసేపూ బాగా నవ్వించారు..

పాపం బ్రహ్మాజీ ఏమయ్యాడో లాస్ట్ లో అర్ధం కాలేదు..చావు వెంటపడుతుంటే ఎక్కడ లేని శక్తి వస్తుందని...టాటా సూమోని డామినేట్ చేసే సైకిల్ చేజ్ చూపించింది..

మొత్తానికి సునీల్ పారిపోవడానికి తిరిగినన్ని మలుపులు లేకుండా..వర్షం పడ్డప్పూడు హైదరాబాదులోని రోడ్లంత గతుకులు అతుకులు లేకుండా..స్ట్రైట్ గా నీట్ గా ఉన్న మర్యాద రామన్న...నాకు నచ్చింది..మా ఇంట్లో నలుగురికీ నచ్చింది.
ఫార్ములా ప్రకారం..ఓ మమైత్ ఖాన్ పాట..రెండు టాటా సూమో బ్లాస్ట్లు..లేకుండా..ప్రశాంతం గా తీసిన ఈ సీమ సినిమా 500 వందల ఏళ్ళు పూర్తి చేసుకున్న "రాయలు "వారు ఏలిన రాయల సీమ పై వచ్చిన ఓ మంచి సినిమా గా చెప్పుకోవచ్చు..ఇంటిల్లిపాదీ చూసెయ్యొచ్చు..




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/Bookmark

Wednesday, July 21, 2010

No Leaf - No Life




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/Bookmark

శఠగోపం

కర్ణాటకది "గాలి " వాటం
మహారాష్ట్ర "నీటి " వాటం
ప్రతిపక్ష నేతల పై లాఠీ ప్రతాపం
ఆంధ్ర ప్రజలకు శఠగోపం



నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/Bookmark

Thursday, July 15, 2010

ఢాం ఢాం ఢాం

 విత్తు పాతితే మొక్క వచ్చె ఢాం
ఢాం ఢాం

మొక్క పెరిగి చెట్టు అయ్యె ఢాం
ఢాం ఢాం

కాయ కాసి పండు ఇచ్చె ఢాం
ఢాం ఢాం

నీడనిచ్చే గూడు అయ్యె ఢాం
ఢాం ఢాం
 చెట్టు కొట్టి కొయ్య చేసే ఢాం
ఢాం ఢాం

కొయ్య కాల్చి బొగ్గు చేసే
ఢాం
ఢాం ఢాం
బొగ్గు తోటి బూడిదొచ్చె
ఢాం
ఢాం ఢాం

విత్తు లేని పండు తెచ్చె
ఢాం
ఢాం ఢాం

సీడు లెస్సు పేరు పెట్టె ఢాం
ఢాం ఢాం

మొక్క లేక చెట్టు లేదు
ఢాం
ఢాం ఢాం

చెట్టు లేక నీడ లేదు
ఢాం
ఢాం ఢాం

ఆకు లేక ఆక్సిజన్ లేదు
ఢాం
ఢాం ఢాం

ఆక్సిజన్ లేక మనిషి లేడు
ఢాం
ఢాం ఢాం


ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భం







నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/Bookmark

రూపాయిని గుర్తించారహో...

 రూపాయిని గుర్తించారహో...

మొత్తానికి మనరూపాయికి 'గుర్తి 'చ్చారు .. మరి అది మనవాళ్ళు చేసిన ఆలస్యమో..ప్రపంచ బ్యాంకు పర్మిషనో తెలిదు కానీ..ఎంతో కాలం క్రితం మొదలైన మన రూపాయికి ఒకా రూపు వచ్చింది.

రూప్యము అన్న సంస్కృత పదం నుంచి వచ్చిన మన రూపాయి ఇన్నాళ్ళూ ఇంగిలీసు అక్షరాలుగా చూసుకున్న మనం ఇప్పుడు ఎంచక్కా మన జాతీయ భాష హిందీతో కలిసిన గుర్తుగా వ్రాయవచ్చు..కానీ జనాలకి అలవాటు కావడానికి కొంత కాలం పట్టొచ్చేమో..ఇంకా కంప్యూటర్లలోకి..ఫాంటులరూపంలో..చేరడానికి ఎన్నాళ్ళు పడుతుందో..మొత్తానికి కొంతకాలానికి అలవాటఔతుంది కానీ..అప్పటికి మనవాళ్ళు డాలర్లు తప్ప రూపాయలు పట్టించుకుంటారోలేదో..ఏది ఏమైనా శివాయ విష్ణు 'రూపాయ ' శివ 'రూపాయ ' విష్ణవే గా దేవుడి రూపం గా మారిపోయిన మన రూపాయి కీ జై..    .




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/Bookmark

Monday, July 12, 2010

ఆస్ట్రో ప్లస్


ఆస్ట్రో ప్లస్

ప్రపంచ కప్ ఫుట్ బాల్ గురించి మాట్లాడుకున్నప్పుడల్లా..ఆక్టోపస్ గురించి మాట్లాడారు జనాలు..ఆ ఆక్టోపస్ గురించి ఊళ వేసి మరీ చెప్పారు. అదే మనం చెప్తే మన జ్యోతిష్యాన్నీ ఇతర శాస్త్రాలని హేళణ చేస్తారు.

జెండాలు పెట్టిన పెట్టె ముట్టుకుంటే గెలుస్తున్నాయని..ముందే విజేత ని నిర్ణయిస్తుందనీ చెప్తే..ఆహా ఓహో అంటూ వింటున్నారు.

మరి సుర్యోదయం సమయం..గ్రహణం ఎప్పుడొస్తుంది..వర్షం ఎప్పుడు పడుతుంది..అన్ని చెప్పే మన జ్యోతిష్యాన్ని ఎందుకు అపహాస్యం చేస్తారో అర్ధం కావట్లేదు.

ఏ దుర్భిణిలు(టెలిస్కోపులు),,క్యాలిక్లేటర్లు.. కంప్యూటర్లు లేని రోజుల్లోనే ఖగోళ శాస్త్రాన్ని ఔపోసన పట్టి ఏది ఎంత దూరం లో ఉంది..గ్రహాలెన్ని ..వాటి ప్రభావం ఎలా ఉంటుంది ..అని చెబితే మనవాళ్ళని పిచ్చివాళ్ళన్నారు..అదే జోడియాక్ సైను..వర్గియో...కాన్సరు..అంటే మాత్రం...యా యా నేనూ వర్గియో నే..అందుకే సెన్సిటివ్ అంటూ తాళం వేస్తారు.

మన రుతువులు..వర్షాలు..ఎండలు..పండగలు.అన్నీ ప్రకృతి తో పాటు ప్రయాణిస్తాయి.. ఖచ్చితంగా ఎప్పుడొస్తాయో మనకి తెలుసు..అదే ఒక సారి డిసెంబర్ లో వచ్చే చలికాలం..ఒక సారి జనవరిలో మరో సారి నవంబరు లో వస్తాయి మన తెలుగు మాసాల్లో మాత్రం ఖచ్చితంగా ప్రతీ సారి చైత్రం లోనే ఎండాకాలం మొదలౌతుంది..ఉగాది నుంచే వసంతం మొదలౌతుంది..మన జీవనం ప్రకృతితో సహజీవనం..

ప్రతీ పండగకి..అది చేసుకునే విధానానికీ ఒక విశిష్టత ఉంది.. ఆరోగ్య సూత్రాలున్నాయి..ప్రకృతి నియమాలున్నాయి.

శాస్త్ర రూపం లో చెబితే కలకాలం..చదువురాని వారికి కూడా అర్ధమవుతుందని అప్పట్లో అలా చెప్పి ఉండొచ్చు...కానీ మన శాస్త్రాలు..విద్యలు..వేదాలు..అన్నిటికన్నా విలువైనవని ఇప్పటికైనా గుర్తించాలి..



 




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/Bookmark

Saturday, July 10, 2010

మా నేల తల్లిని కబ్జా చేస్తున్నారు

మా నేల తల్లిని కబ్జా చేస్తున్నారు
మా భూమి తల్లిని చక్కగా భోంచేస్తున్నారు
కడుపులో బంగారాన్ని దోచుకు తింటున్నారు
కనుచూపు మేరా ఆక్రమించుకుంటున్నారు
చిరునవ్వు తో సిరులు పంచుకు తింటున్నారు

గల గలా గోదారి మహరాష్ట్రకు తరలిపోతుంటే
బిర బిరా కృష్ణమ్మ కర్ణాటకలో ఆగిపోతుంటే
బంజరు భూములే మిగులుతాయి
మరుభూములే మనకి కనబడతాయీ..

మా నేల తల్లిని కబ్జా చేస్తున్నారు.
మా భూమి తల్లిని చక్కగా భోంచేస్తున్నారు

అసెంబ్లీ నగరి ఆ ఆపసోపాలు
దాహార్తి తో చేసే ఆ ఆర్తనాదాలు
తిరుమలేశుని మింగేసే తిమింగలాలు
నిత్యమూ నిఖిలమూ ముంచిపోయేదాక 

రౌడీ షీటర్ల భుజశక్తి
పదవి పైన పెను భక్తి
గోతులు తీసే కుయుక్తి
గనుల స్వాహాలో ఘన కీర్తి

మా కనుల ముందే తిరుగుతుంటే
చూస్తూ నే ఉంటాము
బిరియానీ సారాలకు వోటమ్ముకుంటాము
జై నేల తల్లీ జై పుడమి తల్లీ









నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/Bookmark

Monday, July 5, 2010

బందేమాతరం

బందేమాతరం

బంద్ ఎవరు ఎవరికోసం, ఎందుకు చేస్తున్నారో ?
పెట్రోల్ రేట్లు పెరిగినందుకు ప్రతిపక్షాల బందు.. మరి ప్రజలని, ప్రజావసరాలని ఎందుకు బంద్ చేస్తున్నారు. అది ప్రభుత్వానికి వ్యతిరేకం గానా..అప్పుడు ప్రభుత్వానికి ఎలా తెలుస్తుంది.. అది వారికి వ్యతిరేకత ఎలా అవుతుంది..
బస్సులు పగలగొడితే  బందు సంపూర్ణమౌతుందా.?
ట్రాఫిక్ ఆపేసి..షట్టర్లేసేసి..అద్దాలు పగలగొట్టి ..ఇదెక్కడి నిరసన..ఎవరికోసం చేసే ప్రతిఘటన.

గవర్ణమెంటు ఆఫీసులు పనిచెయ్యకుండా చేస్తే..ముఖ్యమంత్రి ముందు నిరసన తెలియజేస్తే..సచివాలయం ముందు బైఠాయిస్తే కనీసం వాళ్ళకి తెలుస్తుందేమో..పొద్దున్నే పార్టీ జెండాలు పట్టుకుని ..తిరిగేసి..భయపెట్టి మూయించేసి.తరువాత వైన్ షాపులకెళ్ళి ఫుల్లుగా మందుకొట్టేసి పార్టీ ఖర్చుని పార్టీ ఖాతాలో రాసేసి..బందు విజయవంతమైందనుకుంటే సమస్య తీరుతుందా..సమస్య తీరేదాకా పోరాడాలి..ఒకరోజు బందు చేసేసి మేమూ పోరాడాం ప్రజల కోసం అరెస్ట్ అయ్యాం అని చెప్పుకోవడం కాదు ..ప్రజలు స్వచ్చందంగా పాలొగొనేలా వాళ్ళకి అర్ధమయ్యేలాగా చెయ్యాలి..ఏదో న్యూస్ చానెల్ లో స్క్రోలింగు చూసి ఓహో ఇవాళ ఏదో బందట ..ఆఫీసుకి వెళ్ళక్కరలేదు..అనో..ఇవాళ ఎలా వెళ్ళాలిరా భగవంతుడా అనో అనుకుంటున్నారు తప్ప..ఆ బందు ఎందుకో..సామాన్య మానవుడికి మాత్రం..తెలీదు..


 



నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి Share/Save/Bookmark

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Best CD Rates