Friday, April 30, 2010

కాశీ పట్నం చూడర బాబూ


కాశీ పట్నం చూడర బాబూ
   తెలుగు సినిమా గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే...'కొత్త ' ఐడియా లతో వస్తున్న 'చిత్రాలని ' చూడాలంటే భయమేస్తోంది..సినిమాకి ఐతే వెళ్ళడం తప్పించుకోవచ్చు,
కానీ,,ట్రైలర్ల పేరుతో ఇంట్లో టీవీల్లోవి ఏం చేద్దాం.ఇదివరకు పండంటి సంసారం, పచ్చని కాపురం, నిండు గౌరవం లాంటి సినిమాలొచ్చాయి, తరవాత సంసారాలు పోయి,
రాక్షసుడు, యమకింకరుడు, కిరతకుడులాంటి సినిమాలొచ్చాయి, తరువాత..నువ్వు నాకు నచ్చావ్, ప్రేమించుకుందాం రా , కలిసుందాం రా ,
ఇంకేదో చేదాం రా లాంటి సినిమాలొచ్చాయి, ఇప్పుడు తిట్ల ట్రెండు అనుకుంటా...ఈడియట్, కంత్రి, పోకిరి, బలాదూర్,దేశ(హ)ముదురు,
ఇలా తిట్ల సినిమాలొస్తున్నాయి..సెంటిమెంటు కూడా వర్కౌట్ అవుతోంది...ఎంత పెద్ద "తిట్టో "అంత పెద్ద "హిట్టు"....
ఇక ప్రస్తుత జెనెరషన్ బాడీలది..అవును మొహం తో నటించలేం కాబట్టి బాడీ లాంగ్వేజు అంటున్నారు..ఇది ఏమి లాంగ్వేజ్ప మరి, మనమెక్కడ నేర్చుకోవాలో..
సిక్స్ పాకు హీరోలూ, సెక్సీ హీరోయిన్లు (హెరాయిన్ అనాలేమో?)...బలిసిన శరీరాల్ని...సుష్కింపచేసి..కండలు పెంచి..చొక్కాలు చించి.....
గడ్డాలు పెంచి...నీరసించి...కనిపిస్తున్న హీరోలు...ఆ సమయాన్ని కాస్త నటననేర్చుకోవడానికి....కాస్త మంచి సబ్జెక్టుల్ని వెతుక్కోవడానికి ఉపయోగిస్తే
బాగుంటుందేమో..

ఒక డైరెక్టరు ఒకహిట్టు ఇవ్వగానే వెంటనే ఆయనతో ఒక సినిమా అనేసుకోవడం.హడావిడిగా మొదలెట్టడం..ఒక హీరోయిన్ హిట్టవగానే ఆమెతోనే సినిమాలు చెయ్యడం..

వాళ్ళకి విసుగొచ్చి బాంబేనో, చెన్నయ్యో, కేరళో పారిపోతే..సినిమా ఆపి కోటి పైగా ఇచ్చి ఆ పర భాషాకాంత ని తెచ్చి చెయ్యడం ఫాషన్ అయిపోయింది...
జాతీయ అవార్డు అందుకున్న నటి చేస్తున్న చిత్రం అంటూ వచ్చిన ఒక సినిమాలో (అవార్డు వచ్చిన సినిమా కాదు) ఆమె కు నటించాల్సిన అవసరం లేని పాత్ర..
ఒకట్రెండు పాటలు..ప్రేమ, ఇతరత్రా విషయాలు//మీకు జాతీయ అవార్డు వచ్చింది కదా మీకెలాంటి పాత్రలు ఇష్టం అంటే అన్నీ అలాంటి పవిత్రమైన పాత్రలు పరుత్తివీరన్
పాత్రలే వస్తున్నాయి...నాకు బబ్లీగా ఉండే పత్రలిష్టం ఎక్స్పోజింగు అవసరమైనంత మేరకు చేస్తాను (ఎవరికి అవసరమైనంత వరకో మరి ??) అంటూ "ప్రియం"గా
చెప్పింది ఒక భామా "మణి".....

ఇంకా నేను తూనీగ పిల్లనే అనుకుంటున్నారు నేను "పెద్ద" దాన్నాయాను..గుర్తించండి..కావాలంటే ఎక్స్పోజింగు చేస్తా(అప్పటికైనా గుర్తిస్తారనేమో)

అని ఈనాడు ఒక బాల వర్ధమాన యువ నటి సెలవిచ్చింది///నేను మాటలు చెప్పను అంతా చేతలే అంటూ 'నయనా' నికి ఆనందం కలిగించే 'తార ',
ఇటీవల 'విశాల హృ దయం కల ఒక హీరోకి పోటీగా తన 'కండలని-గుండెలని ' ప్రదర్శించింది....ఆమె స్ఫూర్తికి "సెల్యూట్ " .
యోగాభ్యాసం నుంచి హీరోయిన్ "యోగం "పట్టిన మరో చిన్నది కూడా వీలైనంత చిన్న దుస్తులే వేసుకుంటూ ఇటీవల పెంచిన తన పారితోషికానికి న్యాయం చేస్తూ..
కనీసం కాస్ట్యూంస్ విషయంలోనైనా నిర్మాత కి నాలుగు డబ్బులు మిగులుస్తోంది....

ఇక రాబోయే సినిమాల్లో ఎలా వుంటారో..ఏమో? ఈ మధ్య ఒక జోక్ చదివా ఆ సినిమాలో నగ్నంగా ఎలా నటించారు అని ఒక విలేఖరి హీరోయిన్ ని అడిగితే..

ఏం చెయ్యను హీరో అలా కల గన్నాడు మరి అంటూ అమాయకంగా జవాబిచ్చిందిట..కధ డిమాండ్ చేసింది కాబట్టి ఏమైనా చెయ్యొచ్చు..
కానీ నాకు అర్ధంకాని విషయం ఒకటుంది...కధకి మాటలొచ్చా అని..రైటర్ అనుకున్నది తెర మీదకి వస్తుందా అని..మధ్యలో ప్రొడ్యూసరు, డైరెక్టరు,
హీరో ఇలా తలా ఒక చెయ్యి వేస్తారుకదా....హీరోయిన్ మీద కాదండీ కధ మీద...

ఇక రాబోయే సినిమాల టైటిల్సు ఇలా వుంటాయేమో?

వె ధ వ - వెయ్యేళ్ళు ధనముతో వర్ధిల్లు
శ్రీ రాముడు - ఈయనకి ఇద్దరు పెళ్ళాలు
లేచిపోదాం రా...కట్నాలు మిగులుద్దాం, కళ్యాణం చేసుకుందాం
సిక్స్ పాక్ వీరుడు- సెక్సీ లుక్ చిన్నది

అదిగో అక్కడ ఏదో సినిమా ప్రా'రంభో'త్సవం మొదలౌతోంది :


అక్కడ బాగా హడావిడిగా ఉంది...షామియానాలు, కుర్చ్చీలు, మైకులు, ఒకటే హడావిడి..ఇంతకీ విషయం ఏమిటంటే అక్కడ ప్రెస్ మీట్ జరగబోతోంది..

ఒక సినిమా తాలూకు విశేషాలు చెప్పడానికి...సినిమా అద్భుతంగా వచ్చింది..ఇంత వరకూ తెలుగు తెర మీద ఇలాంటి సినిమా రాలేదు (తాను చూసి ఇన్ స్పైర్ అయి
కాపీ కొట్టిన ఇంగ్లీషు సినిమా తలుచుకుంటూ, దాని వసూళ్ళు లెక్కలు కడుతూ ) దర్శకుడి ..తొలి పలుకులు...

మ్యూజిక్ చాలా బాగా వచ్చింది హీరో (లావుగా బొజ్జతో కదలలేని)బాడీ లాంగ్వేజ్ దృష్టిలో పెట్టుకుని చేసా...గ్యారంటీగా సూపెర్ హిట్ అవుతుంది..

తాను డైరెక్టుగా డౌన్ లోడ్ చేసిన ఇంగ్లీష్ ఆల్బం మీద నమ్మకంతో) మ్యూజిక్ డైరెక్టరు దిస్ ఈజ్ మై ఫస్ట్ ఫిల్మ్ చాలా హాపీ గా ఉంది..మంచి
ఎక్స్పోజింగు కి) స్కోప్ ఉన్న సినిమా...హీరో సార్, డైరెక్టర్ సార్, ప్రొద్యూసర్ సార్ చాలా 'కోపరేట్" చేస్తున్నారు...
(సబ్బు కంపేనీ యాడ్ నుంచి దిగుమతి ఐన బొంబాయ్ భామ)..

సినిమా అనుకున్న దాని కన్నా బాగా వచ్చింది (అంత చండాలంగా తీద్దామని అనుకోడం ఎందుకు ? బాగా వచ్చిందనడం ఎందుకు ?)

బాగా రిచ్ గా తీసాం (తప్పలేదు మరి).హీరో గారు బాగా "కోప"రేట్ చేసారు...(నెక్లెస్ రోడ్లో తీయాల్సిన హీరో నడిచే సీను న్యూజిలాండ్లో
చేయించిన సీను గుర్తు చేసుకుంటూ) ప్రొడ్యూసరు.. 100 ప్రింట్లతో రిలీజ్ చేస్తున్నాం. (కనీసం ఒక్క రోజు ఆడినా 100 రోజుల ఫంక్షన్ చేసుకోవచ్చు).
గ్యారంటీగా సూపర్ హిట్ అవుతుంది.
ఇలా ఒకరిని ఒకరు పొగుడుకుంటూ రిలీజ్ డేటు అనౌన్స్ చేసారు...
సినిమా రిలీజ్ అయింది...ధియేటర్ దగ్గర..

కెవ్వు కేక..మా హీరో సినిమా సూపెర్ హిట్టు,,ఆయన మీద వొట్టు..రికార్డులన్నీ తిరగరాస్తుంది..హండ్రెడ్ డేస్ ఆడేస్తుంది..

(ముందు రోజు నుంచీ తిండీ తిప్పలు లేకుండా కటౌట్లు కట్టి, దండలేసి,,సినిమా హాలుకి రంగులేసి, చొక్కా చిరిగినా టికెట్టు సంపాదించేసి,,
పాటలకి ఈల వేసి, ఫైట్లకి కాగితాలెగరేసి ..సినిమా చూసి మెంటలెక్కేసి) అభిమాని ఉవాచ.... కట్ చేస్తీ..సినిమా రెండో రోజే గల్లంతు
కానీ మళ్ళీ మనవాళ్ళు సక్సెస్ మీట్ అంటూ తయారు...ఏం చేస్తాం తప్పదు మరి,,,,




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

Sunday, April 25, 2010

మన హీరోలు జూ లో జంతువులా

 హీరోల అభిమానులకి విజ్ఞప్తి..


పాపం మీకిష్టమైన హీరోలని మనుష్యులుగా చూడండి..వాళ్ళని జూ లో జంతువులుగా చూడొద్దు. మీ అభిమానం తో మీ హీరోలని "సిమ్హా"లు.'పులులు " గా చూసి వాళ్లకి మేమూ మనుష్యులమే అనుకోవడం మర్చిపోయేలా చేస్తున్నారు..అడవిలో పులులు సిమ్హాలా లా
గుహల్లో(గృహాల్లో) ఉండిపోతున్నారు.. మీ అభిమానానికి..ఎక్ష్పెక్టేషన్ కోసం.అవసరమున్నా లేకున్నా  ఇమేజ్ కాపాడుకోవడం కోసం ఒకే లాంటి కధలు..కధనాలతో నటించి ఫ్లాపులు ఇస్తున్నారు.

సమర సిమ్హం, సీమ సిమ్హం, నరసిమ్హం, సిమ్హా ఇలా పేర్లు కోసం పాకు లాడి..ఒకటో రెండో డైలాగులు..పాటలతో నెట్టుకు రావడం..అది మీకు నచ్చక సినిమా ఫ్లాపు కావడం..మరి మీరు నిజంగా అంత గొప్ప అభిమానులైతే మీ హీరో ఎంతో ఇష్టపది..కష్టపడి చేసే సినిమాలు ఎందుకు ఆడించరు. మీకు ఏది నచ్చుతుందో ఏది నచ్చదో వాళ్లకి ఎందుకు తెలీదు..ఈసారి పాపం మీ కోసం ఒక పడుచు పిల్ల స్నేహా ఉల్లాల్ దాదాపు కూతురు వయసు..మధ్య వయస్కురాలు..నయన తార చాన్నాళ్ళకు చీరతో..ఇక నమిత.. ఇలా ఎన్నో చేయవలసి వస్తుంది..ఆ హీరో గారికి తండ్రి పాత్ర వేసే నటుడు ఉండడు..హీరో ఒక్క దెబ్బ తినకూడదు..మీసం మెలేస్తే రైళ్లు , విమానాలు ఆగిపోతాయి..ఇవి నిజం గా జరిగే విషయాలేన..చిటికెన వేలికి దెబ్బ తగిలి షూటింగు ఆపేస్తారు..అంటే వాళ్ళూ మానవ మాత్రులే కదా. మరి ఎందుకు మీ ఓవరేక్షన్..సినిమా బాగుంటే ఆదరించండి..ఒకరి పై అభిమానాన్ని ఒకరిపై ద్వేషం గా మార్చుకోకండి.. ఎన్ టీ ఆర్  బాగా డైలాగు చెబితే..రాం చరన్ స్టైలిష్ గా ఉంటాడు.. అల్లు అర్జున్ చలాకి గా ఉంటే..నాగ చైతన్య మరో లా ఉంటాడు..మీ మధ్య వైరాలతో వాళ్ళ మధ్య దూరాలు పెంచకండి.

కలెక్షన్లు, 100 డేయ్స్ విషయం లోనూ అంతే..సినిమా ఎలా ఉంటుందో తెలీక ముందే వంద పైన ప్రింట్లతో వదులుతారు..మొదటి వారంలో వేలం వెర్రి గా చూసేస్తారు..మొత్తం ఏదో కలెక్షన్ వస్తుంది.. అదే కొలమానమా..రెండో వారానికి సగానికి పైగా ప్రింట్లు వెనక్కి వచ్చేస్తాయి..నాలుగో వారానికి నాలుగైదు చోట్ల తప్ప ఇంకెక్కడా ఉండదు..సడెన్ గా ఎక్కడో ఒక చోట 50 రోజులదో ఇంకోటో ఫంక్షను..ఎందుకీ ఖర్మ.

నాయకుడు లాంటి సినిమా మన బాల కృష్ణలు, చిరంజీవి లాంటి వాళ్ళు చేయలేరా. చేస్తే మీరు చూడరా..చూడకపోతే మీది నిజమైన అభిమానం కాదు. మూస పాత్రల సినిమాలకన్నా ..మంచి సినిమాలు ఆదరించండి..ఇకనైనా మీ హీరోలని మనుష్యులుగా చూడడానికి ప్రయత్నించండి..గోళ్ళతో గోడౌన్ లని కూల్చే, కళ్ళ తో రైళ్ళు ఆపేసే  సినిమాల కన్నా .. హాయిగా ఇద్దరు ముగ్గురు అగ్ర హీరోలు కలిసి నటించే సినిమాలు ఆదరించండి..




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

Friday, April 23, 2010

ఐ పీ ఎల్ కిర్ కెట్

 ఐ పీ ఎల్ కిర్ కెట్

కిర్ కెట్..కిరికిరి బెట్.. బ్యాటు  బంతి మధ్య పోరు ... అనుకున్నారంతా. నాకు మొదటినుంచీ అనుమానమే..
శ్రీ "శాంతు" సైమండ్స్ ని ఔట్ చేసి పెవిలియన్ వైపు చూపిస్తే ఉండే సరదా... వేడి ,,,  ఇప్పుడు లేదు. అంత కంఫ్యూజన్. ఆస్ట్రేలియ గిల్క్రిస్ట్ కొడుతుంటే హైదరాబాదీ గా ఆనంద పడాలా..హర్భజన్ బౌలింగులో సిక్స్ కి బాధ పడాలా అర్ధం కాదు. డబ్బుకు లోకం దాసోహం అని.. ఐ పీ ఎల్ లో ఆడడానికి రిటైర్ అయిపోయిన వాళ్ళు రిటైర్ కి దగ్గరగా ఉన్నవాళ్ళు అందరూ సిద్ధమే..వరల్డ్ కప్పు కి మాత్రం సిద్ధం గా ఉండరు..ఇక్కడ ఒళ్ళు హూనం చేసుకుని అక్కడ అవమానం పాలై వస్తారు. దేశం కోసం కాదు డబ్బు కోసమే ఆడే ఈ మహానుభావులు.

మన సీక్రెట్లు, వాళ్ళకి తెలిసిపోయి..మనం ఎంత నష్టపోతున్నాం. ఇది దేశ ద్రోహం కిందకి రాదా అని డౌట్,




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

Monday, April 19, 2010

కృయాలిటీ షోస్



 ఒక చిన్న పాపాయి ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ అంతా ఎంతో పాపులర్. ఆమె పాట వింటే ఎంతో ఆశ్చర్యమేస్తుంది..ఆ పాపని దగ్గరకు తీసుకుని నీ పేరేంటమ్మా అని అడిగా..పాప దిక్కులు చూసింది బహుశా వాళ్ళ అమ్మా నాన్న కోసం అనుకుంటా..వాళ్ళు కనిపించి తలకాయ ఊపాక చిరీచ అంది మొదట్లో అర్ధం కాలే తరువాత శిరీష అని అర్ధం అయింది..నువ్వు ఏం చదువుతున్నావ్ అని అడిగా పీ పీ వన్ అంది నాకర్ధం కాలే ...సరే నీకు ఏ బీ సీ లు వచ్చా అన్న,,ముద్దుగా తల ఊపింది.. చెప్పు అన్నా, మళ్ళీ అమ్మ నాన్న ల వంక చూసి నావేపు తిరిగి ఏ ఏ ప్లస్ ఏ ప్లస్ ప్లస్ బీ బీ ప్లస్ బీ ప్లస్ ప్లస్ సీ సీ ప్లస్ అంటూ చెప్పింది ..నాకు మతిపోయింది అదేంటమ్మ ఏ ఏప్లస్ ఏంటి అన్నా..దానికి ఆ పాప అమాయకంగా మొహం పెట్టి ఏమో అంకుల్ మా కూల్లొ అవే ఉంటాయి అంది...ఏ స్కూలమ్మ అని అడిగా...ఏమో అంది ...మీ టేచర్లు ఎవరు అని అడిగా ..ఒక సింగరాంటీ, ఒక పాటల తాత, ఒక మ్యూజిక్ అంకుల్ అంది....కాసేపటి తరువాత ఎవరో నీళ్ళు జల్లినట్టున్నారు కొంచెం కొంచెం నా కళ్ళు తెరుచుకుంతున్నాయి..అది ఒక రియాలిటీ షో మహత్యం అదిగో అక్కడ స్టేజి ధగ ధగ లాడిపోతోంది..లైట్లు మిరుమిట్లు గొలుపుతున్నాయి....కట్టర్లూ, థెర్మోకోల్ షీట్లు, రంగు రంగు దీపాలు చాలా హడావిడిగా ఉంది. టీలు పంచేవాళ్ళూ, టిఫిన్లందించే వాళ్ళూ, ఇలా ఎవరిపనుల్లోవాళ్ళున్నారు...అక్కడ మరో రియాలిటీ షో జరుగుతోంది..ఇంతలో అక్కడ పోటీ పడుతున్న ఒక శృంగార తార..మరో టీవీ తార మధ్యలో సడెన్‌గా గొడవ స్టార్ట్ అయింది..నువ్వు అసలు కొరియోగ్రాఫర్వేనా అని ఆడిగితే మరో ఆయన తిడుతూ మీదకెళ్ళాడు..ఒక అమ్మాయి ఏడుపు లంఘించుకుంది..జడ్జికి కంగారు కలిగింది..అందరూ ఒక్క సారిగా స్టేజిమీద కి జేరారు..నువ్వెంత అంటే నువ్వెంత అనుకుని అరుచుకుంటున్నారు..ఎదురుగా ఆడియన్స్ మధ్యలో కూర్చున్న ఒక గర్భిణి కి ఈ జగడమంతా ఆటలో భాగమని తెలీదు చాలా టెన్షన్ పడింది..వెంటనే నొప్పులు ప్రారంభమైనాయి..డెలివరీ అయింది పండంటి మగబిడ్డ..అంతా సంతోషించారు టీవీ చరిత్రలోనే ప్రధమంగా జరిగింది అంటూ యాంఖరమ్మ అరిచి చెప్పింది..జడ్జీల ఆసీర్వాదంతో ఆ పిల్లాడికి "స్టూడియో కుమార్ " అని పేరుపెట్టలని నిర్ణయించారు....ఆ పిల్లాడి కాళ్ళు ఊపడం చూసి అప్పుడే వీడికి డాన్స్ అబ్బింది అన్నరు...కెమేరా అటు పాన్ అయింది... ఇది మరో టీవీ...ఏవో రక రకాల్ ప్రోగ్రాములు వస్తున్నాయి..మధ్యలో యాడ్స్ వస్తున్నాయి సడెంగా..ఒక డాన్స్ ప్రోగ్రాం యాడ్ వచ్చింది...ఒక డాన్సర్ని ఒక జడ్జి తిడుతున్నాడు..నువ్వు చేసింది అసలు బాగాలేదు..అసలు నువ్వు ఇక్కడిదాకా ఎలా వచ్చావా అని నాకు అర్ధం కావట్లేదు..అసలు స్టాండర్డ్ లేదు అంటూ తిడుతున్నాడు..ఆ డాన్సర్ కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి ..సెట్ అంతా నిశ్శబ్దం..యాంఖరు మఔనంగా చూస్తున్నాడు..జడ్జి తారాస్థాయిలో తిడుతున్నాడు..సడెంగా ఆ డాన్సరు కత్తి తీసుకుని ఆ జడ్జి మీదకి వెళ్ళాడు..అందరూ ఒక్క సారి ఉలిక్కి పడ్డారు...ఆ డాన్సరు పూర్తిగా జడ్జిమీదకెళ్ళాడు...అక్కడ ఫ్రీజ్ అయింది..సీను..... ఆ పార్టిసిపెంట్ ఆ జడ్జిని పొడిచి చంపాడా...లేక పొడుచుకుని చనిపోయే ప్రయత్నం చేశాడా...తప్పక చూడండి రేపటి మా కార్యక్రమంలో ...అంటూ వెనకాల నుంచి గంభీరమైన గొంతు వినిపిస్తోంది.. ఆ యాడ్ మొత్తం మీద ఒక పది ఇరవై సార్లు వచ్చింది...అందరిలో టెన్షన్ ....ఆ సమయం రానే వచ్చింది..అందరూ టీవీలకి అతుక్కుపోయారు..కానీ తొమ్మిదింటికి మొదలైన ఆకార్యక్రమంలో తొమ్మిదీ నలభై వరకూ ఆ సిట్యుయేషన్ రాలేదు కానీ ప్రతీ బ్రేకులో అదే చూపించారు..సమయం తొమ్మిదీ యాభై రెండు...జడ్జి తిట్టడం మొదలెట్టాడు..ఆ సీను మొత్తం రిపీటయింది....చివరకి...అంటే ఆఖరుకు..ప్రోగ్రాం అయిపోయే సమయానికి కత్తి తీసుకుని ఆ డాన్సరు జడ్జి మీదకి ఉరికాడు..తన చేతిలో కత్తి ఆయన కాళ్లదగ్గర పెట్టి ...సార్ ఇంకొక్క చాన్సివ్వండి నన్ను ప్రూవ్ చేసుకుంటా...ఈ సారి చెయ్యలేకపోతే ఇంక డాన్స్ చెయ్యను,,,మీరే ఈ కత్తితో నా కాళ్ళు నరికెయ్యండి..ప్రస్తుతం నేను ఈ కత్తి పాట మీద డాన్స్ చెయ్యండి అంటూ కన్నీళ్ళతో కాళ్ళు కడిగాడు..అందరూ ఊపిరి తీసుకున్నారు మీతో సహా..... ఇవన్నీ కొంచెం అతిగా నేను ఎక్కువ చేసి రాసినా..నిజానికి కొంత నిజం లేకపోలేదు..పాపం అభం శుభం తెలీని పాపాయిలని ఆడుకోవాల్సిన వయసులో ఇలాంటి పోటీ ప్రపంచంలోకి నెట్టి వాళ్ళ బంగారు భవిష్యత్తుతో ఆడుకుంటున్నారు ....అసలే ఐదో క్లాసునుంచే ఐ ఐ టీ లాంటి పరీక్షలకి ట్రైనింగు స్టార్ట్ చేస్తున్న ఈ రోజుల్లో..ఐదేళ్ల వయసునుంచే ఇంత పోటీ అవసరమా....మన బలహీనతలని ఆసరా గా తీసుకుని ఎంతటి హీనానికైనా దిగజారుతున్న ఇవి రియాలిటీ షోలా...కృయాలిటీ షోలా అర్ధం కావట్లేదు...కొరియోగ్రాఫర్ తో లేచిపోయిన డాన్సరు..పేరిణి డాన్సు చూసి పూనకం తెచ్చుకున్న మరో నాట్య తార, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకునే రూపకాలు, ప్రాంతాల వారీగా విడగొట్టి తెలంగాణా..రాయలసీమ అంటూ ప్రజలని రెచ్చగొట్టే కార్యక్రమలు..ఈ ప్రోగ్రాముల ద్వారా హీరోలైపోయామని కొందరు అనుకుంటే...మేము ఓడిపోయాము ఇక ఎందుకూ పనికిరాము అని డిప్రెస్ అయిపోయే వాళ్ళు కొందరు...ప్రోగ్రాములో జరిగే తంతు చూసి టెన్షన్ పడేది మనం...



నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

Wednesday, April 14, 2010

హై క్లూలు - హై డెఫినిషన్స్

 హై క్లూలు - హై డెఫినిషన్స్


జల తారు - "జలం" వస్తే కరిగి పోయే "తారు" రోడ్లు,


నిత్య వైతరిణి - డ్రైనే'జీవ"నది


అల్లు 'అర " విందు - "పార్టీ " ఉంది 'పదార్ధం " లేదు


చి"రంజీ"వి - రాజకీయ రంజీ ప్లేయర్


రో"శయ్య " - శయ్య మీద రెస్ట్ టైములో గెస్ట్ సీ ఎం



జే ఏ సీ - జాయింట్ లెస్ యాక్షన్ కమిటీ


ఏ ఆర్ రహ్మాన్ - అవార్డ్స్ రివార్డ్స్ రెహ్మాన్


సన్నాసి - "ఆ" శ్రమ జీవితం లో "నిత్యానందం"


బి కి నీ - బిజినెస్ కి నీచమైన మార్గం


పైరసీ చట్టం - కాపీ కొట్టే హక్కు మాది మాత్రమే అనే పోరాటం


బ్రాడ్ మైండ్ పేరెంట్స్ కి "అబ్రాడ్ " మైండ్ పిల్లలు


ఆహారం రెండు రకాలు - శాకాహారం - మేకాహారం


నిజాన్ని చూపేది అద్దం - నిజాన్ని చంపితే "అబద్దం "


పేవ్ మెంట్ - పేమెంట్ లేని పేదోడి మహల్


నెక్లెస్ రోడ్ - రెక్లెస్ యూత్ కి కేరాఫ్ అడ్రస్


బ్లాక్ లో టికెట్ కొని సినిమాకెళితే - మైండ్ బ్లాంక్ అయింది


"ఉత్తరమో". "దక్షిణో "లేక పోతే - తూర్పే దిక్కు


మళ్ళీ కొట్టుకు పోయింది కంకర రోడ్డు - కాంట్రాక్టరింట్లో మంత్రిగారికి పార్టీ


ఈ నెల మా ఆవిడ మరో వ్రతం - వచ్చే జన్మ లో నైనా మంచి మొగుడి కోసం


పిల్లిని కట్టేసి కొడితే పులౌతుందిట - పులికి పెళ్లి చేసేస్తే పిల్లౌతుంది..


అతను ఫోనెత్తకపోతే - అది "మిసెస్" కాల్


పేదోడి కడుపు నిండడానికి..గొప్పోడి బొజ్జ తగ్గడానికి ఒకే మందు - గంజి


" మని" - "షి" వెనక పడేవాడు -మనిషి



నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

Monday, April 12, 2010

Me at Hyderabad Bloggers' Meet




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

Sunday, April 11, 2010

ఆడపిల్లకి న్యాయం చేయలేని సిఎం ఉంటే యెంత ఊడితే ఎంత - అని మా ఫ్రెండు పంపిన ఒక పోస్టుకి ప్రతిస్పందన.

ఆడపిల్లకి న్యాయం చేయలేని సిఎం ఉంటే యెంత ఊడితే ఎంత ? ----------అని మా ఫ్రెండు పంపిన ఒక పోస్టుకి ప్రతిస్పందన.


ayesha_pratusha_copyలీడర్ సినిమాలో ఆఖరు పావుగంటలో వచ్చే ఒక డైలాగ్ ప్రజలని ఆలోచనలోకి నెట్టింది. హీరో తన పదవికి రాజీనామా చేసినప్పుడు చెప్పే డైలాగ్ " ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేని సిఎం ఉంటే ఎంత ఊడితే ఎంత " . నిజంగా తన పదవివి కాపాడుకోడానికి ఒక ఆడపిల్లని అత్యంత కిరాతకంగా మానభంగం చేసి , చంపేసిన నరరూప రాక్షసుడిని తన పదవికోసం కాపాడిన సిఎం ..... మరుక్షణం మనసు మార్చుకుని తన పదవికి రాజీనామా చేయడం కేవలం   సినిమాకే పరిమితం అయినప్పటికీ సిగ్గు లేని మన నాయకులకు చెప్పుదెబ్బ లాంటిది. గతంలో కొందరు అమాయకమైన ఆడపిల్లలు అత్యాచారాలకు బలైనప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వారిని కాపాడాడు అని ఆరోపణలు వచ్చాయి. వాటిలో ప్రధానమైనవి హీరోయిన్ ప్రత్యూష కేసు , ఇంకా ఆయేషా మీరా కేసు.

cbn-pratyshaఅందాల నటి ప్రత్యూష అనుమానాస్పద రీతిలో మరణించిన తర్వాత ... ఆమె మరణం వెనుక పెద్దమనుషుల హస్తం ఉందని  అనేక ఆరోపణలు చేశారు ఆమె తల్లి . అప్పట్లో తెలుగుదేశం పార్టీలో నంబర్ 2 పోసిషన్ లో ఉండే ఒక నాయకుడి కుమారుడి మీద ఆరోపణలు వచ్చినా చంద్రబాబు నాయుడు వారికి కొమ్ము కాశారని ప్రతిపక్షాలు ఆరోపించాయి.  తన పార్టీ లోని అనుచరుడి కుమారుడిని కాపాడుకోవడానికి  తన కుర్చీ కోసం  ప్రతూషకి చంద్రబాబు  అన్యాయం చేశారని  ఆరోపణలు వచ్చినా నాయుడు గారు చలించలేదు. తర్వాత ఏం జరిగిందో ఏమో ప్రత్యూష తల్లి తెలుగుదేశం లో చేరారు. కానీ ప్రత్యూషకి మాత్రం అన్యాయం జరిగింది. చంద్రబాబు నాయుడికి కనీసం చీమ కుట్టినట్టు కూడా అనిపీలేదేమో. ఒక ఆడపిల్లకి న్యాయం చేయలేని చంద్రబాబు రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్  చేస్తారట.
ayeshaa_ysrమరో కేసులో విజయవాడలో అత్యంత కిరాతకంగా రేప్ కి గురై హత్యగావించబడ్డ ఆయేషా మీరా కేసులో నిందితులని వైఎస్ఆర్ కాపాడుతున్నారని పెద్ద దుమారమే రేగింది. ఐనప్పటికీ వైఎస్ఆర్ చలించలేదు. కేసు విచారణ వేగవంతం అయ్యేటప్పుడే  విజయవాడ పోలీస్ కమీషనర్ నీ ట్రాన్స్ ఫర్ చేసేసారు. కేసుతో సంబంధం లేని లడ్డు అనే వైజాగ్ యువకుడిని తీసుకొచ్చి ఇరికించే ప్రయత్నం జరిగింది . తర్వాత సత్యం బాబు అనే మరొక యువకుడి పేరు వెలుగులోకి తెచ్చారు . కానీ ఆయేషా మీరా  కి అన్యాయం జరిగింది అని ఆమె తల్లి మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోలేదు. కేవలం తన వర్గం వాడు అనే ఫీలింగ్ తోనే నిందితుడిని కాపాడి ఒక అమాయకమైన ఆడపిల్లకి అన్యాయం చేసి సిఎం సీటులో దర్జాగా కూర్చున్నారు అనే ఆరోపణ వైఎస్ఆర్  మీద ఉంది. ఇలా ఆడపిల్లలకి అన్యాయం చేసి చివరికి వీరు సాధించింది ఏంటి? బావుకున్నది ఏంటి ?
తాజాగా విజయవాడలో హత్యకి గురైన నాగవైష్ణవి హత్య కేసులో నిందితులని తప్పించే ప్రయత్నం జరుగుతుంది అని వూహాగానాలు వస్తున్నాయి. కనిసం ఎనభై ఏళ్ళ వయసులో అన్న రోశయ్య తన కుర్చీ కన్నా ఆడపిల్లకి న్యాయం చేయడంలో శ్రద్ధ వహిస్తారు అని ఆశిద్దాం



 ప్రతిస్పందన.


దయచేసి..సినిమాలు చూసి ఎమోషన్ అవద్దు. ఈ అన్యాయాలు శతాబ్దాల బట్టీ స్త్రీల మీద జరుగుతునే ఉన్నాయి. అందులో చూపించేవి కేవలం ఎమోషనల్ గా టచ్ చేసి సినిమా ఆడించుకోవడం కోసమే..నిజంగా వాళ్లకి అంతటి చిత్త శుద్ధి ఉంటుందా? అని నా ప్రశ్న. ఆ సినిమా అయిపోయి మళ్ళీ వేరే సినిమా మొదలవగానే అందులోని విషయం మర్చిపోతారు..ఏ ప్రేమ సబ్జెక్టో ఐతే వీలైనంతవరకూ "హీరోయిన్ " ని ఎక్స్ పోజ్ చేస్తారు.వాళ్ళు ఎప్పటికీ ఆదర్శం కారు.

ఇక రాజకీయ నాయకుల విషయానికొస్తే...అసలు మనదగ్గర ఉన్నది ప్రజా స్వామ్యమే కాదు. ఎందుకంటే..వారసత్వాన్ని ఓటు  ద్వారా మార్చుకుని గెలిచే వీళ్లు రాజకీయ నాయకులే కానీ ప్రజా నాయకులు కాదు. ముందు తరం నాయకుల పేర్లు చెప్పుకుని  కొడుకులు, కూతుళ్లు, అల్లుళ్ళు, భార్యలూ(కరెక్టే కొందరికి ఇద్దరు ముగ్గురున్నారు), ఇలా బంధువులే నిండిపోతే ఇక ప్రజా  నాయకులెక్కడనుంచీ వస్తారు.

వాళ్ళ స్వంత ఖర్చులు..డ్రైవర్లు, పీ ఏలు, ఇతర మెయిన్ టెనెన్స్ ఖర్చులు ,అసెంబ్లీ లో వృధా చేసే గంటల కొద్దీ సమయం యొక్క విలువ లెక్కగడితే ఐదేళ్ళలో వాళ్ళు నియోజక వర్గానికి ఖర్చుపెట్టేదానికి కనీసం 30 రెట్లు ఎక్కువ ఉండవచ్చు.

ఇక ప్రత్యూష, అయేషా ల లాంటి కేసులు విషయానికొస్తే...బయటకు రాని కేసులు ఎన్ని ఉన్నాయో కూడా లెక్క చూడవలసి ఉంటుంది. కులం , వర్గం, ప్రాంతం, బంధు జనం, ఇలా అనేక రకాలుగా చుట్టూ ఉన్న జనాన్ని కాపాడే విషయంలో ప్రజల కి జరిగే అన్యాయాలని పట్టించుకునే టైం లేదు వీళ్లకి. దొరికిన ఐదేళ్ళలో అందింత దోచుకోవడానికే ప్రణాళికలు తప్ప..ఆడవాళ్లకి ఏమి జరిగితే వీళ్లకేమిటి.


బ్రిటీష్ వాళ్ళు మనలని డివైడ్ అండ్ రూల్ అనే పద్ధతి లో పాలించారు. కలిస్తే ప్రమాదమని ...వీలైనంతవరకు విభజించి పాలించారు. చేస్తే చేసారు కనీసం రైళ్ళు, విమానాలు లాంటి టెక్నాలజీ త్వరగా ఇచ్చి వెళ్ళారు. కానీ ఇప్పటి నాయకులు.. డిలే అండ్ రూల్ అనే సూత్రం పాటిస్తారు అంటే ...నిదానంగా పాలించు..ఎందుకంటే కొంత కాలం అయితే జనం మర్చిపోతారు. ఎవరు ఉన్నా ఎవరు లేక పోయినా ప్రపంచం నడుస్తునే ఉంటుంది కాబట్టి..ఎవరి గోల లో వాళ్ళుంటారు అని లేట్ చేస్తారు.

ప్రపంచం లో మనలని ఎవరూ ఉద్ధరించరు..మనలని మనమే కాపాడుకోవాలి..జనమే కలిసి పోరాడాలి..మన దాకా వచ్చేదాకా వేచి చూడక..పక్క వాడికి అన్యాయం జరిగినప్పుడు స్పందిస్తే..ప్రభుత్వమూ కళ్ళు తెరుస్తుంది..


"ఒక్క ఆడపిల్లకి సాయం/న్యాయం చేయలేని సీ ఎం ఉంటే ఎంత లేకపోతే ఎంత ?" ఇది కాదు ముఖ్యం "పక్కవాడికి అన్యాయం జరిగినప్పుడు స్పందించని మనం ఉంటే ఎంతా...లేకపోతే ఎంత.????"


నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

Tuesday, April 6, 2010

"నిఖా"ర్స్


సా"నిఖా"...సానియా నిఖా మళ్ళీ డౌట్ లో పడింది..పాపం ఆమెకింకా మంచి రోజులు వచ్చినట్ట్లు లేదు. అసలు 100 కోట్ల భారతీయుల్లో ఎవరూ దొరక్క పాకీ వీరుణ్ణి వరించింది..అది నిజమైన ప్రేమేనా..ఎందుకంటే పాపం షోయబ్ క్రికెట్ కన్నా మిగతా విషయాల వల్లే ఎక్కువ ఫేమస్..మరి ఈమెని కూడా అలానె వర్రించాడా....అదే వరించేడా...అని ఓ డౌట్.ఇంత సడెన్ గా షోయెబే నా మొగుడు అని ప్రకటించాల్సిన 'అవసరం ' ఎందుకొచ్చింది..? గొడవ సద్దుమణిగాక చేసుకోవచ్చు కదా...ఆగేంత "టైము లేదేమో???........కళ్యాణ మొచ్చిన కక్కొచ్చినా ఆగదంటారు..కానీ కక్కొచ్చినాక కళ్యాణం ఆపలేము కదా.....!!!!!

సావిత్రి నుంచీ సానియా దాకా ...అసలు ఈ సెలెబ్రిటీలే ఇంత..పూర్వం రోజులనుంచీ అంతే...సావిత్రి గారు...ఎందరు వద్దన్నా పెళ్ళై పోయిన  జెమినీ గణేశన్ ని చేసుకుని..తరువాత జీవితాంతం బాధలు అనుభవించి...ఆ దిగులు తోనే మరణించిందంటారు..మధుబాల, దివ్య భారతి, పర్వీన్ బాబీ ఇలా ఎందరో..నిన్నటి తరం కలల రాణి శ్రీదేవి కూడా ఎందరో ప్రపోస్ చేసినా వద్దని పెళ్లై పోయిన బోనీ కపూర్ నే చేసుకుంది..ఇప్పుడు బాగానే ఉన్నాను అని చెప్పుకుంటున్నా రెండో నంబరు గానే మిగిలిపోయింది..ఈ ఆల్ ఇండియా మాజీ నంబర్ వన్. సానియా వయసు కూడా ఎక్కువ కాదు..ఇంకా ఓ రెండు మూడేళ్ళు టెన్నిస్ ఆడుకోవచ్చు..ఇంత హటాత్తుగా పెళ్ళి...దుబాయి లో కాపురం..ఇండియా-పాకిస్తాన్ మధ్య తిరగడం ఇవన్నీ ఇంత సడెన్ గా ఎందుకో..  ????

ఇది "నిఖా"ర్సైన ప్రేమా? లేక ?.............. ఏమో టెన్నిస్ కోర్టులో లా చమటలు కక్కుతూ ఇలా కోర్ట్ వ్యవహారాల దాకా తెచ్చుకునే లా ఇప్పుడు ఈ హడా"విడి" పెళ్లి బదులు...మొత్తం తెలుసుకున్నాక
గ్రాండ్ స్లాం లాగా గ్రాండ్ సలాం ల మధ్య ...చేసుకుంటేనే ఇన్నాళ్ళ తన కెరీర్ కి మచ్చ లేకుండా ఉంటుంది...లేకపోతే..??అనవసరమంగా జీవితమంతా బాధ పడాల్సి వస్తుంది..


టెన్నిస్ ద్వారా భారత దేశానికి పేరు తెచ్చిన సానియా పై అభిమానం తో..




నచ్చితే నలుగురికీ చెప్పండి..నచ్చకపోతే నాకు చెప్పండి

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Best CD Rates