Thursday, January 22, 2009

అమెరికా- భూతాల స్వర్గం..

అమెరికా భూతాల స్వర్గం..

ఒకప్పుడు భూతల స్వర్గం అనుకునే అమెరికా ఇప్పుడు భూతాల స్వర్గంగా మారింది..ఆ సాలరీలపై ఎన్నో ఆశలతో అమ్మ తాళిని(అదీ డాలరే) అమ్మి డాలర్లని నమ్మి వెళుతున్న వారు ఎంతమంది సుఖ పడుతున్నారో నాకైతే తెలీదు కానీ..ఆర్ధికసంక్షోభం వల్ల ఉన్న ఉద్యోగం ఊడి ఎక్కడైనా ఏదైనా ఊడిగం చెయ్యాల్సిన పరిస్థితులు వినిపిస్తున్నాయి...
డొనేషన్లు పోసి ఇంజినీరింగు చదివి పై చదువులకోసం అమెరికా చేరీ పైలోకాలు చేరుతున్న అమాయకుల కధలు వింటుంటే..జాలీ బాధా భయమూ కోపమూ అన్నీ ఒకేసారి కలుగుతున్నాయి...
తెలుగు వారంతా ఒకటే అని పైకి చెబుతున్నా కులాలూ..ప్రాంతాల వారీగా విడిపోయి..పోటీపడిపోయి..తాన తందాన ఆటలూ..పాటలు నిర్వహించే వారంతా ఒక్కటై ఉంటే ఎంత బాగుంటుంది...
ఎబ్రాడ్ మైండు తో ఆలోచించే పిల్లలూ...డాలర్ల కోసం డేంజర్లో పడకండి...డార్లింగుల వలలో పడకండి....మన భారతాన్ని అమెరికాని చెయ్యండి..అంటే అమెరికాలా భూతాల స్వర్గం చెయ్యమని కాదు...
మన మేధా సంపత్తిని పరాయి దేశం పాలు చెయ్యకండి...మన మేధోవలస ఇంగ్లీషులో 'బ్రైన్ డ్రైన్' అంతా అక్కడకి వెళుతోంది...మన యువత ధీ శక్తి మన దేశంలోనే ఉంటే మనమే అమెరికా కన్నా గొప్పవాళ్ళమౌతామని..హరగోవిందులు..కల్పనా చావ్లాలూ,,,మన వాళ్ళే కదా....మన జీవ కణాల్లో ఉన్న ఆ బుద్ధికుశలత మనకి ఉపయోగపడట్లేదే అని నా బాధ...మన పసుపు ..వేప కూడా వాళ్ళ పేటెంటులో చేరిపోతుంటే మన కి బాధే కదా ? భారతీయ కధల్లో..ఆయుర్వేదంలో..వేదాల్లో సారం వాళ్ళు జుర్రేసుకుని చీకేసిన టెంకలని..మన మీదే విసురుతున్నారు...ఇది ఎంతవరకు సహ్యం....బాగున్నంత కాలం మన సేవలు...మన తెలివితేటలూ కావాలి..ఇవ్వాళ ఆర్ధిక సంక్షోభం వచ్చిన రోజున నిన్నటిదాకా పరువు కాపాడిన మనం బరువౌతున్నాం....అక్కడ చదువుతూ పెట్రోలు బంకుల్లోనూ..సూపర్ మార్కెట్లోనూ పనిచెయ్యడానికి పడని సిగ్గు అమ్మకి నాలుగు కరివేప రెబ్బలు తేవడానికి ఎందుకు...అమ్మ చేతి ం వంట తింటూ..నాన్న కళ్ళముందు తిరుగుతూ..మన అక్క చెల్లెళ్ళు,,అన్న దమ్ములు..మన స్నేహితులూ..మధ్య హాయిగా తిరుగుతూ మన తాలెంటు ఇక్కడ నిరూపించుకుంటే చాలదా...
మేరా భారత్ మహాన్

4 comments:

Anonymous said...

బాగా చెప్పారు

ఎస్పీ జగదీష్ said...

"పెట్రోలు బంకుల్లోనూ..సూపర్ మార్కెట్లోనూ పనిచెయ్యడానికి పడని సిగ్గు అమ్మకి నాలుగు కరివేప రెబ్బలు తేవడానికి ఎందుకు..."
చాలా బాగా చెప్పారండి. ఇక్కడ కష్ట పడమంటే నామోషి అంటారే గాని, గల్ఫ్ వెళ్ళి ఒంటెలు కాయలేక వచ్చేసినోళ్ళు ఎంతో మంది వున్నారు. ఇప్పుడు ఆ లిష్ట్‌లో అమెరికా కూడా చేరింది.

K said...

మీ బ్లాగు చదవగానే ఒక విషయం గుర్తొచ్చింది. తెనాలి రామకృష్ణ, రాయలవారిపై (ధూర్జటి లేక పెద్దనా?) చెప్పిన పద్యాన్ని విమర్శించేడుట - "తోక ముడిచి బిలప్రవేశం చేసే సింహం అంటూనే, రాయలవారిని రాజ కంఠీరవా" అని పొగడడం ఒక contradiction అని. మీరు కూడ , ఒక పక్క "అమెరికా భూతాల స్వర్గం అంటూనే, "మన భారతాన్ని అమెరికాని చెయ్యండి" అని రాస్తున్నారు.

K said...

మీ బ్లాగు చదవగానే ఒక విషయం గుర్తొచ్చింది. తెనాలి రామకృష్ణ, రాయలవారిపై (ధూర్జటి లేక పెద్దనా?) చెప్పిన పద్యాన్ని విమర్శించేడుట - "తోక ముడిచి బిలప్రవేశం చేసే సింహం అంటూనే, రాయలవారిని రాజ కంఠీరవా" అని పొగడడం ఒక contradiction అని. మీరు కూడ , ఒక పక్క "అమెరికా భూతాల స్వర్గం అంటూనే, "మన భారతాన్ని అమెరికాని చెయ్యండి" అని రాస్తున్నారు.

Post a Comment

Twitter Delicious Facebook Digg Stumbleupon Favorites More

 
Design by Free WordPress Themes | Bloggerized by Lasantha - Premium Blogger Themes | Best CD Rates